గోవా రాష్ట్రం :
〰〰〰〰
🔷 1987 మే 30న గోవాను కేంద్రపాలిత ప్రాంతంగా కాక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచారు. ఇది భారతదేశంలో 25వ రాష్ట్రం అయ్యింది.
🔷కొంకణి ఏకైక అధికారిక భాష కానీ మరాఠీని అధికారికావసరాలకు వాడుకోగలెగే సౌలభ్యం కల్పించారు.
🔷భారతదేశంలోపశ్చిమతీరాన అరేబియా సముద్రం అంచున ఉన్నది. ఈ ప్రాంతాన్ని కొంకణ తీరమని కూడా అంటారు.
🔷గోవాకు ఉత్తరాన మహారాష్ట్ర, తూర్పు, దక్షిణాన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఇది దేశంలో వైశాల్యపరంగా రెండవ అతిచిన్న రాష్ట్రం.
🔷జనాభా పరంగా నాలుగవ అతిచిన్న రాష్ట్రం. సిక్కిం, మిజోరామ్, అరుణాచల్ ప్రదేశ్లుగోవా కంటే తక్కువ జనాభా కలిగి ఉన్నాయి
🔷గోవా రాజధాని పనజీ. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వర్తకులు గోవాలో స్థావరం ఏర్పరచుకొన్నారు. కొద్దికాలంలోనే అధికారాన్ని బలవంతంగా హస్తగతం చేసుకొన్నారు. 450 ఏండ్ల తరువాత, 1961లో భారత ప్రభుత్వం గోవాను తన అధీనంలోకి తీసుకొన్నది.
🔷చక్కని బీచ్ లు, ప్రత్యేకమైన కట్టడాలు, విశిష్టమైన వన సంపద - ఇవన్నీ కలిపి గోవా మంచి పర్యాటక కేంద్రంగా కావడానికి తోడ్పడ్డాయి.
🔷 1498లో క్రొత్త సముద్రమార్గాన్ని కనుక్కొన్న మొదటి ఐరోపా వర్తకుడు వాస్కో డ గామా కేరళలో కోజికోడ్లో అడుగుపెట్టాడు. తరువాత అతడు గోవా చేరాడు.
🔷 సుగంధ ద్రవ్యాల వ్యాపారమే పోర్చుగీసు వారి అప్పటి లక్ష్యము. కాని 1501 లో తిమ్మయ్య అనే స్థానిక రాజు తరపున పోరాడి అల్ఫోంసో డి అల్బుకర్క్ (Afonso de Albuquerque) అనే పోర్చుగీసు అడ్మిరల్ బహమనీ రాజులనోడించాడు. గోవాను తమ నావలకు స్థావరంగా చేయాలనేది వారి అభిమతం.
🔷 1947లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా గోవాను వదులుకోవడానికి పోర్చుగీసువారు ఒప్పుకొనలేదు. ప్రపంచ సంస్థలు భారతదేశానికి అనుకూలంగా తీర్పు చెప్పినా ప్రయోజనం లేకపోయింది.
🔷 1961 డిసెంబరు 12న భారత సైన్యం గోవాలో ప్రవేశించి, గోవాను ఆక్రమించింది. కొద్దిపాటి ఘర్షణ తరువాత డామన్, డయ్యులు కూడా భారతదేశం అధీనంలోకి వచ్చాయి.
🔷 కాని 1974 వరకు పోర్చుగీసు ప్రభుత్వం గోవాను భారతదేశంలో అంతర్భాగంగా అంగీకరించలేదు.
🔷 1987 మే 30న గోవాను కేంద్రపాలిత ప్రాంతంగా కాక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచారు. ఇది భారతదేశంలో 25వ రాష్ట్రం అయ్యింది.
రాష్ట్ర గణాంకాలు :
〰〰〰〰〰〰
అవతరణము. 30 మే 1977
వైశాల్యము.3,702 చ.కి.
జనసంఖ్య. 1,457,723 స్త్రీలు. 717,912 పురుషులు. 740,711 నిష్పత్తి . 968. అక్షరాస్తత. స్త్రీలు. 87.40 పురుషులు.92.81
జిల్లాల సంఖ్య. 2
గ్రామాలు. 359 పట్టణాలు.44
ప్రథాన భాష. కొంకణి, మరాఠి ప్రథాన మతం. హిందు. క్రీస్తు.
పార్లమెంటు సభ్యుల సంఖ్య, 3 శాసన సభ్యుల సంఖ్య.40
మూలము. మనోరమ యీయర్ బుక్
జన విస్తరణ :
〰〰〰〰
🔷గోవా నివాసిని ఆంగ్లంలో గోవన్ అని, కొంకణిలో గోయెంకర్ అని, మరాఠీలో గోవేకర్ అని, పోర్చుగీసు భాషలో మగవారిని గోయెస్ Goêsఅని, ఆడువారిని గోయెసా Goesa అని అంటారు.
🔷ఇప్పుడు గోవా జనాభా 13,47,668 - ఇందులో 6,87,248 మంది పురుషులు మరియు 6,60,420 స్త్రీలు. మిగిలిన వివరాలు
🔷చదరపు కిలోమీటరుకు జనాభా: 364
🔷పట్టణ జనాభా: 49.8%
🔷ఆడు, మగ నిష్పత్తి 960 స్త్రీలు: 1000 పురుషులు
🔷అక్షరాస్యత: 82.0 % (పురుషులు 88.4%, స్త్రీలు 75.4%)[13]
🔷హిందువులు 65%, కాథలిక్కులు 30%[14],
🔷ముఖ్య నగరాలు: వాస్కో డ గామా, మడగావ్, మార్మగోవా, పంజిమ్, మపుసా
🔷ప్రధాన భాషలు: కొంకణి, మరాఠీ, (ఇండియన్) ఇంగ్లీష్, హిందీ. (పోర్చుగీసు భాష వాడకం క్రమంగా క్షీణిస్తున్నది). అధికార భాషగా మరాఠీ, కొంకణి భాషలు కావాలనుకొనే వారి మధ్య బలమైన స్పర్ధ ఉన్నది.
🔷మిగిలిన రాష్ట్రాలలో బ్రిటిష్ పద్ధతిలో మతం ప్రకారం civil laws అమలులో ఉన్నాయి. కాని గోవాలో పోర్చుగీసు వారి పద్ధతి ప్రకారం Uniform Civil Code అమలులో ఉన్నది.
〰〰🌻🌻🌻〰〰