Type Here to Get Search Results !

Vinays Info

తెలంగాణ పర్యాటక రంగం

Top Post Ad

తెలంగాణ రాష్ట్రం ప్రాచీన జీవన సంప్రదాయాలను వెల్లడించే అద్భుత హస్తకళలకు, చేతి వృత్తులకు కేంద్రంగా ఉన్న పర్యాటక ప్రదేశాలు నల్లగొండ జిల్లాలోని పోచంపల్లి, ప్రపంచ ప్రసిద్ధి నిర్మల్ కొయ్య బొమ్మలు, నకాషి కళ వరంగల్ జిల్లా చేర్యాల, పంచెపై వేసే అనేక కళాకృతులకు నిలయం వరంగల్ జిల్లాలోని పెంబర్తి.
-మెడికల్ టూరిజం: భారత్‌లో వివిధ శస్త్రచికిత్సలకు, వైద్యంకోసం తక్కువ ఖర్చు కావడం, నిపుణులైన డాక్టర్లు ఉండటంతో అపోలో, యశోద, కేర్, ఏఐజీ వంటి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు వివిధ దేశాలు, రాష్ర్టాల నుంచి అనేక వ్యాధులతో బాధపడేవారు ఎక్కువగా వస్తున్నారు. దీంతో తెలంగాణకు మెడికల్ టూరిజం అభివృద్ధిలో చాలా అవకాశాలు ఉన్నాయి.
ఆధ్యాత్మిక/మత సంబంధ పర్యాటకం
ఛాయాసోమేశ్వర ఆలయం
-కాకతీయ కళాకారుల, శిల్పుల ప్రతిభకు ప్రతీక, భౌతిక, గణిత శాస్త్ర అద్భుతం ఈ దేవాలయం. నల్లగొండ జిల్లా పానగల్లులో ఉంది.
మెదక్ చర్చి
-ఇది ఆసియాలో రెండో అతిపెద్ద చర్చి. దీనికి వాటికన్ సిటీ చర్చి తర్వాత అంతటి ప్రాధాన్యత గల క్యాథడ్రల్ చర్చి.
బాసర సరస్వతీ దేవాలయం
-దేశంలో రెండు సరస్వతీ దేవాలయాలు మాత్రమే ఉన్నాయి. కశ్మీరులో ఒక సరస్వతీ దేవాలయం ఉండగా రెండోది రాష్ట్రంలో జ్ఞాన సరస్వతీ దేవాలయం ఆదిలాబాద్ జిల్లా బాసరలో ఉన్నది.
కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం
-గోదావరి నది ఒడ్డున కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలోని విశిష్టమైన దేవాలయం. శివుడు, యముడి దేవాలయాలు ఇక్కడి ప్రత్యేకత.
జైనాథ్ ఆలయం
-ఈ ఆలయం ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఇది అతి ప్రాచీన జైన ఆలయం. తర్వాత దీన్ని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంగా మార్చారు. ఏడాదిలో ఒకసారి సూర్య కిరణాలు స్వామివారి మూల విగ్రహాన్ని తాకడం ఇక్కడి విశేషం.
రామప్ప దేవాలయం
-కాకతీయ రాజుల అద్వితీయ కట్టడాలకు ప్రతిరూపం రామప్ప దేవాలయం. అద్భుత సాంకేతిక నైపుణ్యంతో నీటిలో తేలియాడే ఇటుకలు, Sand Technology (ఇసుక పునాదుల) ఆధారంగా నిర్మించారు.
కొలనుపాక
-నల్లగొండ జిల్లాలోని కొలనుపాక తెలంగాణలో నేటికీ కొనసాగుతున్న ఏకైక జైన స్థావరం.

గ్రూప్-2,3 తెలంగాణ ఎకానమీ
-లీగ్ ఆఫ్ నేషన్స్ (1936) ప్రకారం ఒక వ్యక్తి 24 గంటలు విదేశాల్లో గడిపినప్పుడు విదేశీ పర్యాటకునిగా పేర్కొనవచ్చు. ప్రపంచ పర్యాటకుల సమాచారాన్ని యూఎన్‌డబ్ల్యూటీవో (1957) MADRID అందిస్తున్నది. భారత్‌లో పర్యాటకుల సమాచారాన్ని 1966 లో ప్రారంభించిన ITDA వెల్లడిస్తున్నది. తెలంగాణలో 2014 జూలైలో ఏర్పడిన తెలంగాణ స్టేట్ టూరిజమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలో పర్యాటకరంగ అభివృద్ధికి, పర్యాటకులను ఆకర్షించడానికి కృషిచేస్తున్నది.
2005 - 15 పర్యాటకులు
-2005లో రాష్ట్రంలో 3,25,92,350 మంది పర్యాట కులు నమోదయ్యారు. 2014లో వారి సంఖ్య 7,24,71,495గా తేలింది. 2014లో స్వదేశీ పర్యాటకులు 7,23,99,113 నమోదయ్యారు. విదేశీ పర్యాటకులు 75,171 రికార్డయ్యారు.
స్వదేశీ పర్యాటకులు
-2014లో స్వదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో వరంగల్ (2,32,27,277) తొలిస్థానంలో ఉండగా, కరీంనగర్ (1,19,48,325), హైదరాబాద్-రంగారెడ్డి (92,97,426) వరుస స్థానాలు కలిగి ఉన్నాయి. చివరి స్థానంలో ఉన్న నిజామాబాద్‌లో 6,880 మంది మాత్రమే పర్యటించారు.
విదేశీ పర్యాటకులు
-2014లో నమోదయిన విదేశీ పర్యాటకుల్లో (75,171) దాదాపు 70,051 మందిని రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు ఆకర్షించాయి. తర్వాతి స్థానాల్లో మహబూబ్‌నగర్ (2,789), వరంగల్ (2,238) ఉన్నాయి. విదేశీ పర్యాటకులు జనవరిలో అధికంగా నమోదవుతుండగా స్వదేశీ పర్యాటకులు ఫిబ్రవరిలో రికార్డవుతున్నారు.
NITHAM
-2004లో హైదరాబాద్‌లో ప్రారంభమైన National Institute of Tourism and Hospitality Management తెలంగాణ పర్యాటకరంగ అభివృద్ధికి, మానవ వనరుల అభివృద్ధికి కృషి చేస్తున్నది.
5T విధానం
-ప్రపంచీకరణలో భాగంగా భారతదేశాన్ని బ్రాండ్ ఇండియాగా మార్చడానికి Talent, Trade, Tourism, Tradition and Technology పేర్కొంది. అంటే బ్రాండ్ ఇండియాలో టూరిజాన్ని చేర్చారు.
వైల్డ్‌లైఫ్ టూరిజం (Wildlife Tourism)
-రాష్ట్రంలో ఉన్న వన్యప్రాణి రక్షణ కేంద్రాలు పర్యాటక రంగానికి కొత్త వన్నె తెస్తున్నాయి.
అవి..
1. అలీసాగర్ డీర్ పార్క్ (నిజామాబాద్)
2. ఏటూరు నాగారం సాంక్చురీ (వరంగల్)
3. పాకాల వైల్డ్‌లైఫ్ సాంక్చురీ (వరంగల్)
4. శివరామ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ (ఆదిలాబాద్)
5. షామీర్‌పేట్ డీర్‌పార్క్ (రంగారెడ్డి)
6. పోచారం సాంక్చురీ (మెదక్)
7. కవ్వాల్ వైల్డ్‌లైఫ్ సాంక్చురీ (ఆదిలాబాద్)
8. ప్రాణహిత వైల్డ్‌లైఫ్ సాంక్చురీ (ఆదిలాబాద్)
9. మంజీరా వైల్డ్‌లైఫ్ సాంక్చురీ (నిజామాబాద్)
10. కిన్నెరసాని వైల్డ్‌లైఫ్ సాంక్చురీ (ఖమ్మం)
11. పిల్లలమర్రి వైల్డ్‌లైఫ్ సాంక్చురీ (మహబూబ్‌నగర్)
ఎకో టూరిజం
- ఆదిలాబాద్‌లో పొచ్చెర, కొరటికల్, కుంటాల, లఖింపూర్, గాజిలి జలపాతాలు ఉన్నాయి. అదేవిధంగా మోతుగూడెం, బొగాత జలపాతాలు ఖమ్మం జిల్లాలో ఉన్నాయి.
హెరిటేజ్ టూరిజం (Heritage Tourism)
-నేషనల్ జియోగ్రఫీ ట్రావెలర్ మ్యాగజైన్ జాబితా-2015లో ప్రపంచంలో రెండో చూడదగిన ప్రదేశంగా హైదరాబాద్ నిలిచింది.
చార్మినార్
-Global Icon of Hyderabadగా చార్మినార్‌ను పేర్కొంటారు. చార్మినార్ సమీపంలోని ఐదో తరం ముత్యాల వర్తకులతో లాడ్‌బజార్ దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తోంది.
గోల్కొండ
-Ancient Engineering Wonder on Telangana Landగా గోల్కొండ ప్రసిద్ధి చెందింది. ధ్వని సాంకేతికత, కోట నిర్మాణంలో పర్యాటకులను సంభ్రమాశ్చ ర్యాలను కలిగిస్తోంది గోల్కొండ కోట.
ఫలక్‌నుమా ప్యాలెస్
-ఇటాలియన్, Tudor architecture సమ్మిళితమే ఫలక్‌నుమా ప్యాలెస్
చౌమహల్లా ప్యాలెస్
-European neo Classical Architecture ఈ ప్యాలెస్ ప్రత్యేకత.
తారామతి బరాదరి
-పర్షియన్ శైలిలో నిర్మితమైన గార్డెన్, చారిత్రక సరాయి అయిన తారామతి బరాదరి ఇబ్రహీంబాగ్‌లో ఒక భాగం.
ఈజిప్ట్ మమ్మీ
-200 ఏండ్ల నాటి ఈజిప్ట్ మమ్మీ రాష్ట్రంలో ఆర్కియాలజీ మ్యూజియంలో ఉంది. దీంతోపాటు దేశంలోని ఏకైక అజంతా పెయింటిగ్స్‌ను పోలిన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి.
కుతుబ్‌షాహీ సమాధులు
-ఇండో-పర్షియన్ శిల్పకళాకృతులకు ప్రతీకలు ఈ సమాధులు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఒక రాజవంశంలోని రాజులందరి సమాధులు ఒకే దగ్గర ఉండటం వీటి ప్రత్యేకత.
కాకతీయ కళాతోరణం
-కాకతీయ రాజుల చారిత్రక కట్టడాలకు నిలువెత్తు సాక్ష్యం ఈ కళాతోరణం. రాష్ట్ర అధికారిక చిహ్నం కూడా.
మక్కా మసీదు
-దేశంలోని అతి ప్రాచీన, అతి పెద్ద మసీదుల్లో ఒకటి మక్కామసీదు. ముస్లింలకు అతి పవిత్రమైన మక్కా నుంచి తెచ్చిన ఇటుకలను ఈ మసీదు నిర్మాణంలో వాడటం ఇక్కడి ప్రత్యేకత.
ADVENTURE TOURISM
1. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్: మహబూబ్‌నగర్ జిల్లాలోని నల్లమల అడవుల్లో Jungle Ride
2. భువనగిరి కోట: Rock Climbirng
3. ఆదిలాబాద్ జన్నారం అభయారణ్యంలో Jungle Ride రాష్ట్రంలోని ప్రధాన సాహస పర్యాటక స్థలాలు.
జానపద సంప్రదాయ, సాంస్కృతిక పర్యాటకం బోనాలు
-తెలంగాణ జానపద సంస్కృతికి ప్రతీకైన రాష్ట్ర పండుగ బోనాలను టీఎస్‌టీడీసీ పర్యాటకంగా మార్చి దేశ, విదేశీ యాత్రికులను ఆకర్షిస్తోంది. సికింద్రాబాద్ ఉజ్జయినీ, గోల్కొండ మహంకాళి అమ్మవార్ల సందర్శన ఈ పర్యటనలో ఉంటాయి.
సమ్మక్క సారక్క జాతర
-తెలంగాణ గిరిజన సంస్కృతిని ప్రపంచ వ్యాప్తం చేసే మేడారం సమ్మక్క-సారక్క జాతర ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతర.
కేస్లాపూర్ జాతర
-ఆదిలాబాద్ జిల్లాలోని గోండులు, గిరిజనులు అడవి తల్లిని పూజించే పండుగ.
జోడేఘాట్
-గిరిజన శౌర్య, పరాక్రమాలకు ప్రతీకగా నిలిచిన కొమరం భీం స్మృతివనం ఇక్కడ నిర్మిస్తున్నారు.
Nature Tourism
-పాకాల సరస్సు: వరంగల్ జిల్లాలోని కాకతీయుల కాలంనాటి సరస్సు
-లక్నవరం సరస్సు: ప్రకృతి సౌందర్యాల మధ్య ఉంది. రాష్ట్రంలో మొదటి వేలాడే వంతెన ఈ సరస్సు మీద ఉంది.
-పాండవుల గుట్ట: వరంగల్ జిల్లాలోని ప్రకృతి అద్భుతం ఈ గుట్ట. పాండవులు ఇక్కడ వనవాసం ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.
-మల్లెల తీర్ధం, సలేశ్వరం: మహబూబ్‌నగర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలోని ప్రకృతి, సహజ వనరుల మధ్యగల పర్యాటక క్షేత్రాలు.
-ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్: జంట జలాశయాలు. హైదరాబాద్ జంట నగరాల దాహార్తిని తీరుస్తున్నాయి. నిజాం కాలంలో ఈ జలాశయాలను నిర్మించారు.
Recreational Tourism
-బుద్ధపూర్ణిమా ప్రాజెక్ట్ అథారిటీ: హుస్సేన్‌సాగర్‌లో బోటింగ్, బుద్ధ విహారం, లుంబినీ పార్క్, అందులో లైటింగ్ షో ఈ పర్యాటక ప్రాజెక్టు ప్రత్యేకత.
-శిల్పారామం: తెలంగాణ గ్రామీణ సంప్రదాయాలకు నిదర్శనం శిల్పారామం. చేనేత కళా ప్రదర్శన ఇక్కడి ప్రత్యేకం. నైట్ బజార్స్ కూడా నిర్వహిస్తారు.
-రామోజీ ఫిల్మ్‌సిటీ: హైదరాబాద్ శివార్లలో ఉన్న ఈ ఫిల్మ్‌సిటీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం పొందింది. ఇందులో అనేక సినిమా షూటింగ్‌లు జరుగుతాయి.
-మౌంట్ ఒపేరా: దేశ, విదేశ పర్యాటకులను ఆకర్షించే పర్యాటక కేంద్రం మౌంట్ ఒపేరా.
-స్నో వరల్డ్: ఐస్ గేమ్స్ దీని ప్రత్యేకత.
తెలంగాణ రాష్ట్రం ప్రాచీన జీవన సంప్రదాయాలను వెల్లడించే అద్భుత హస్తకళలకు, చేతి వృత్తులకు కేంద్రంగా ఉన్న పర్యాటక ప్రదేశాలు నల్లగొండ జిల్లాలోని పోచంపల్లి, ప్రపంచ ప్రసిద్ధి నిర్మల్ కొయ్య బొమ్మలు, నకాషి కళ వరంగల్ జిల్లా చేర్యాల, పంచెపై వేసే అనేక కళాకృతులకు నిలయం వరంగల్ జిల్లాలోని పెంబర్తి.
-మెడికల్ టూరిజం: భారత్‌లో వివిధ శస్త్రచికిత్సలకు, వైద్యంకోసం తక్కువ ఖర్చు కావడం, నిపుణులైన డాక్టర్లు ఉండటంతో అపోలో, యశోద, కేర్, ఏఐజీ వంటి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు వివిధ దేశాలు, రాష్ర్టాల నుంచి అనేక వ్యాధులతో బాధపడేవారు ఎక్కువగా వస్తున్నారు. దీంతో తెలంగాణకు మెడికల్ టూరిజం అభివృద్ధిలో చాలా అవకాశాలు ఉన్నాయి.
ఆధ్యాత్మిక/మత సంబంధ పర్యాటకం
ఛాయాసోమేశ్వర ఆలయం
-కాకతీయ కళాకారుల, శిల్పుల ప్రతిభకు ప్రతీక, భౌతిక, గణిత శాస్త్ర అద్భుతం ఈ దేవాలయం. నల్లగొండ జిల్లా పానగల్లులో ఉంది.
మెదక్ చర్చి
-ఇది ఆసియాలో రెండో అతిపెద్ద చర్చి. దీనికి వాటికన్ సిటీ చర్చి తర్వాత అంతటి ప్రాధాన్యత గల క్యాథడ్రల్ చర్చి.
బాసర సరస్వతీ దేవాలయం
-దేశంలో రెండు సరస్వతీ దేవాలయాలు మాత్రమే ఉన్నాయి. కశ్మీరులో ఒక సరస్వతీ దేవాలయం ఉండగా రెండోది రాష్ట్రంలో జ్ఞాన సరస్వతీ దేవాలయం ఆదిలాబాద్ జిల్లా బాసరలో ఉన్నది.
కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం
-గోదావరి నది ఒడ్డున కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలోని విశిష్టమైన దేవాలయం. శివుడు, యముడి దేవాలయాలు ఇక్కడి ప్రత్యేకత.
జైనాథ్ ఆలయం
-ఈ ఆలయం ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఇది అతి ప్రాచీన జైన ఆలయం. తర్వాత దీన్ని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంగా మార్చారు. ఏడాదిలో ఒకసారి సూర్య కిరణాలు స్వామివారి మూల విగ్రహాన్ని తాకడం ఇక్కడి విశేషం.
రామప్ప దేవాలయం
-కాకతీయ రాజుల అద్వితీయ కట్టడాలకు ప్రతిరూపం రామప్ప దేవాలయం. అద్భుత సాంకేతిక నైపుణ్యంతో నీటిలో తేలియాడే ఇటుకలు, Sand Technology (ఇసుక పునాదుల) ఆధారంగా నిర్మించారు.
కొలనుపాక
-నల్లగొండ జిల్లాలోని కొలనుపాక తెలంగాణలో నేటికీ కొనసాగుతున్న ఏకైక జైన స్థావరం.

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.