Type Here to Get Search Results !

Vinays Info

👉తెలంగాణలో ప్రథమం, ప్రధానం, ప్రముఖ👈

తెలంగాణలో ప్రథమం, ప్రధానం, ప్రముఖం
1. తొలి తెలుగు చరిత్రకారుడెవరు
- ఏకామ్రనాథుడు (ప్రతాపరుద్ర చరిత్ర)
2.. 1902లో బండారు అచ్చమాంబ రాసిన 'ధన త్రయోదశి' - తెలుగులో మొదటి కథ
3. పూర్తిగా చైతన్య స్రవంతి శిల్పంలో రూపొందించిన మొట్టమొదటి తెలుగు నవల ''అంపశయ్య'' నవీన్‌
4. తెలంగాణలో మొట్టమొదటి ప్రచురణ సంస్థ ''విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి''
5. తెలంగాణలోనే కాదు మొత్తం తెలుగు సాహిత్యంలోనే ప్రథమకవి - పాల్కురికి సోమనాథుడు.
6. ప్రపంచంలో ఎక్కువ ఫ్లోరైడ్‌ ఉన్న ప్రాంతం?
- నల్లగొండ జిల్లాలోని నార్కెట్‌పల్లి.
7. ప్రపంచంలోని అతిపెద్దరాతి కట్టడమైన బహుళార్థసాధక ప్రాజెక్ట్‌ - నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌.
8. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన జైన దేవాలయం
- కొలనుపాక (నల్లగొండ జిల్లా)
9. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పట్టుకేంద్రం
- భూదాన్‌ పోచంపల్లి.
10. తెలంగాణ మాండలికంలో ప్రప్రథమంగా భూస్వామ్య సంస్కృతి ఇతి వృత్తంగా రాసిన నవల ఏది? ఎవరు రాశారు? - తరం మారింది- మాదిరెడ్డి సులోచన
11. తెలంగాణ వచ్చిన తొలి తెలుగువార పత్రిక
-'నీలగిరి' - షబ్నవీసు వెంకటనర్సింహారావు
(1922 ఆగస్టు - 24) నల్లగొండ నుండి
12. మొట్టమొదటి అచ్చ తెనుగుకవి, పొన్నగంటి తెలగనార్యుడు రాసింది
-''యయాతి చరిత్ర''. ఇది మొట్టమొదటి అచ్చ తెనుగు గ్రంథం.
13. తెలంగాణలో మొదటి బుర్రకథ - ''హైదరాబాద్‌ సంస్థాన రాజ్యాంగ సంస్కరణలు'' - 1946లో.
14. తెలంగాణ యక్షగాన పితామహుడు
- శ్రీ చెర్విరాల బాగయ్య కవి.
15. తెలంగాణ సాహిత్య చరిత్రలో ప్రప్రథమ లిఖిత కవి- గుణాఢ్యుడు - బృహత్కథ.
16. తెలంగాణలో మొట్టమొదటి చారిత్రక గేయ కావ్యం - ''నాగార్జున సాగరం'' - డా.సి. నారాయణరెడ్డి రచించారు.
17. ''వాణి నారాణి'' అని సరస్వతీ దేవిని సంబోధించింది. మన తెలంగాణ కవి - ''పిల్లలమర్రి పినవీరభద్రుడు''.
18. ప్రప్రథమంగా తెలుగులో పురాణాన్ని రాసిన కవి
- (ద్విపద) - బసవపురాణం - పాల్కురికి సోమనాథుడు.
19. తెలుగులో మొట్టమొదటి సినిమా తీసిన వారు
- తెలంగాణవారే.
- కందిబండ సంస్థానం - నారపరాజువారు - ఆదర్శం.
20. అచల పరిపూర్ణ రాజయోగ సిద్ధాంతం అను శివరామ దీక్షతీయ సాంప్రదాయం ప్రారంభమైంది
- తెలంగాణలోనే నల్లగొండ జిల్లా - నారాయణపురం.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section