Type Here to Get Search Results !

Vinays Info

ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవం

ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవం : (నో టొబాకో డే ) 31st of May.--VINAYS INFO
〰〰〰〰〰〰〰〰🌺
🌻పొగాకుతో నేడు ఎన్నో అనారోగ్యాలు సంభవిస్తున్నాయి. సిగరెట్‌ తాగడం వల్ల గుండె, ఊపిరతిత్తులకు సంబంధించిన వ్యాధులతో పాటు క్యాన్సర్‌, డయాబెటిస్‌, ఆస్టియోపొరోసిస్‌ వంటి వ్యాధులు వస్తున్నాయి. ఆస్తమా రావడానికి సిగరెట్‌ తాగడం కూడా ఓ కారణమే.
💠పొగ తాగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి 13 సెకండ్లకు ఒక వ్యక్తి మరణిస్తే ప్రతి ఏడాది మిలియన్‌ మంది ప్రజలు దీంతో మృతిచెందుతున్నారు. దీంతో పాటు పొగాకుతో కూడిన గుట్కా కూడా మనిషికి ప్రాణాంతకంగా మారుతోంది.
💠ఈ నేపథ్యంలో పొగాకు మూలంగా సంభవించే వ్యాధులపట్ల చైతన్యం కలిగించేందుకు ప్రతి ఏటా మే 31న ‘వరల్డ్‌ నో టొబాకో డే’ను నిర్వహిస్తున్నారు. 

💠ప్రతి సంవత్సరము ఒక రోజు ఈ దినోత్సవాన్ని జరిపి ప్రజలకు పొగ త్రాగడం వలన వచ్చే అనారొగ్యము గురించి తెలియజెప్పడమే ముఖ్య ఉద్దేశము .
💠 సమాజములో స్వచ్చంద సంస్థలు , ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు , అన్ని పాఠశాలలు , ఆ రోజు స్వచ్చందము గా ర్యాళీ లు , సభలు , సమావేశాలు జరిపి ధూమపానము వలన జరిగే నస్టాలను ప్రజలకు తెలియజేయాలి .

💠ధూమపానం చేయడం నేడు ఫ్యాషన్ అయిపోయింది. ఎవరింట్లోనైతే పెద్దలు ధూమపానం చేస్తుంటారో ఆ ఇంట్లోని పిల్లల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ధూమపానం చేసేవారికన్నా ఆ వ్యక్తి చుట్టుపక్కలనున్న వ్యక్తి ఆరోగ్యంపై పొగ ప్రభావం అధికంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

💠ధూమపానము రక రకాలుగా ప్రజలలోకి చొచ్చుకుపోయినది . నాగరికులు - సిగారేట్టుగాను , పండితులు -ముక్కుపోడుము గాను ,విలాసవంతులు -తంబాకు , కారా కిల్లీగాను ,సామాన్యులు పొగ చుట్టాలు గా , పేదలు బీడీలుగా దీనిని సేవిస్తున్నారు .ఇన్ని రకాలుగా ఇది (పొగాకు) లభించడం తో దీనికి తోడుగా " ఖైనీలు , గుట్కాలు , పాన్పరాగ్ , " మున్నగు రాకకాల పేర్ల తో పొగాకు ఉత్పత్తులు లభిస్తున్నాయి .
గ్రామీణ ప్రాంతం లో వీటి వినియోగం ఎక్కువగా ఉంటున్నాయి .
💠గ్రామీణ మహిళలు అడ్డపోగా చుట్టాను కాలుస్తారు .. ఇది నోటి కాన్సర్ కు దారితీస్తుంది . పొగ "క్షయ" వ్యాది కి కారణమవుతుంది .

ధూమ పానము వలన కలిగే అనర్ధాలు :
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
నోటి కాన్సర్ ,
దంతవ్యాధులు ,
క్షయ వ్యాధి ,
ఉపిరి తిత్తుల కాన్సెర్ ,
ఉదారకోస వ్యాధులు - అల్సర్ , గాస్ ట్రబుల్ , ఉదారకోస కాన్సర్ ,

💠ఏటా 7 లక్షలమంది ధూమపానం కారణంగా మరణిస్తున్నారు.. సిగరెట్టు, బీడీ, చుట్ట, పొగాకు వంటి పదార్ధాలు తాత్కాలిక ఆనంద్నా కలిగిస్తున్నా అధికశాతం నష్ట్నా మాత్రం కలిగిస్తున్నాయి .
💠గుండెజబ్బులకు, రక్తం గడ్డకట్టి వచ్చే పక్షవాతం వంటి వ్యాధులకు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమయ్యే ధూమపానమును పూర్తిస్థాయిలో అరికట్టాల్సిన అవసరం ఉన్నది .
💠ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సిగరెట్, బీడీ వంటి పొగాకు పదార్థాల ప్యాకెట్లపై తేలు బొమ్మ, కాన్సర్ లేదా కాన్సర్ రోగి బొమ్మను ముద్రించాలని ప్రకటించడం హర్షదాయకము . ధూమపాన వ్యతిరేకతను ప్రచారం చేసే స్టాల్ల్స్ ను ఎక్కువగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది .

💠బహిరంగ ప్రదేశాల్లో, పాఠశాలల పరిసరాల్లో పొగతాగడంపై నిషేధం, 18 ఏళ్లలోపు వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా చూడటం వంటి అంశాలు ఈ సంస్థ పరిధిలోకి వస్తాయన్నారు. బీడీ, సిగరెట్‌ పెట్టెలపై చట్టబద్ధమైన హెచ్చరికల ముద్రణ, వాటిల్లో తార్‌, నికోటిన్‌ ఏస్థాయిలో ఉన్నాయన్న విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారో లేదో కూడా పరిశీలిస్తుందన్నారు.

💠మధ్య వయసు వారికి... ధూమాపానం అలవాటు.. అధిక రక్తపోటు...అధిక కొలిస్టిరాల్‌ ఉంటే 10 నుంచి 15 ఏళ్లక ముందే మరణిస్తారు....

💠సిగరెట్టు, బీడీల పొగతో పిల్లల శ్వాసక్రియలో పలు మార్పులు సంభవించి వారికి ఊపిరాడని పరిస్థితి తలెత్తుతుంది. దీంతో వారు ఆస్తమా వ్యాధిబారిన పడతారంటున్నారు వైద్యులు. ఒకవేళ పిల్లలు ముందుగానే ఆస్తమాతో ఇబ్బందులెదుర్కొంటుంటే సిగరెట్టు, బీడీల పొగ మరింత ఇబ్బంది కలిగిస్తుంది.

💠సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కారణంగా పిల్లల్లో ఆస్తమా రోగుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. ధూమపానం ద్వారా వచ్చే పొగ వలన నిమోనియా లేదా పల్మోనరీ బ్రాంకటైస్ అంటే శ్వాసతోపాటు వచ్చే దగ్గు ఉత్పన్నమౌతుంది.

పొగ కారణంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నమౌతాయంటే...

*💠 పిల్లల్లో వారిలో వినికిడి, వాచక సమస్యలు తలెత్తుతాయి.

💠* ధూమపానం చేసేవారిండ్లలోనున్న పిల్లలకు ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి. పొగ వలన వారిలో వ్యాధి నిరోధక సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఇలాంటి పిల్లలు యువావస్థలోకి వచ్చే ముందు ఇతరులకన్నా బలహీనంగా కపడతారు.

💠ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి ఆరుగురిలో ఒకరి మృత్యువు కేవలం ధూమపానం కారణంగానేనని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ప్రస్తుతం ఫ్యాషన్ పేరుతో మహిళల్లోను ధూమపానం చేసేవారు అధికమౌతున్నారు. దీంతో ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది.
    〰〰🌻🌻🌻〰〰

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section