Type Here to Get Search Results !

Vinays Info

నిజాం రాజులు - రాజకీయ చరిత్ర

Top Post Ad

🚴 🚴నిజాం రాజుల - రాజకీయ చరిత్ర🚴🚴

👣 సికిందర్ జా (1803-1829)👣

-సికిందర్ జాను 3వ అసఫ్ జా అని పిలుస్తారు. (నిజాంలు మొత్తం ఏడుగురు). చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ (1911-1948). నిజాంలో చివరివాడైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ అందరిలో గొప్పవాడు. అయితే చాలా పుస్తకాల్లో నిజాం అలీఖాన్ 2వ అసఫ్‌జా గొప్పవాడని రాశారు. పోటీ పరీక్షల కోసం మాత్రమే ఈ వ్యాసాల్లో అభ్యర్థులు ఏయే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటి అనే విషయంలో అయోమయానికి గురవుతుంటారు. అందువల్లనే ఈ విషయాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఏర్పడింది. కొన్ని పుస్తకాల్లో నిజాం రాజులు 9 మంది అని వారిలో నిజాం అలీఖాన్ గొప్పవాడని రాశారు. నిజాం రాజుల్లో మొదటి వాడు నిజాం ఉల్ ముల్క్ (1724-1748)

-ఇతని తర్వాత వారసత్వ యుద్ధాలు అసఫ్ జా రాజ్యా ల్లో ప్రారంభమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో నాసర్‌జంగ్ (నిజాం కుమారుడు), ముజఫర్ జంగ్

(నిజాం మనవడు) మధ్య విభేదాలు వచ్చాయి. ఇలా వరుసగా 1. నాజిర్ జంగ్ 2. ముజఫర్ జంగ్ 3. సలాబత్ జంగ్‌లు వరుసగా రాజ్యాన్ని పరిపాలించారు. వారసత్వ పదివి కోసం జరిగిన యుద్ధాల్లో సహకరిం చిన బ్రిటీష్, ఫ్రెంచి వారికి నిజాం రాజ్యంలోని కొన్ని భాగాలు కానుకలుగా అర్పించారు. చివరగా 2వ అసఫ్ జా పేరుతో నిజాం అలీ రాజ్యానికి వచ్చాడు. నిజాం అలీని 5వ నిజాంగా రాశారు. కానీ ఇతడిని 2వ అసఫ్‌జా గానే గుర్తించాలి. నిజాం అలీ కుమారుడే సికిందర్ జా 3వ నిజామ్‌గా రాజ్యానికి వచ్చాడు.

ఇతని కాలంలో హైదరాబాద్‌లో మీరాలం చెరువు, సికిందరాబాద్- కోఠి ఉమెన్స్ కళాశాల (నాడు బ్రిటీష్ రెసిడెన్సీగా ఉండేది) తర్వాత మహిళా కళాశాలగా మారింది. చాదర్‌ఘాట్ బ్రిడ్జ్ మొదలైన నిర్మాణాలు జరిగాయి. అరిస్తోజు (అలీం ఉల్ ఉమర్), మీర్ ఆలం, చందూలాల్ దివాన్లు (ప్రధానులు)గా పని చేశారు. అలాగే కెప్టెన్ అబర్లెల్స్ కిర్క్ పాట్రిక్, సైడెన్ హోమ్, రస్సేల్ బ్రిగేడియర్, మెట్‌కాఫ్, మార్టిన్‌లు హైదరాబాద్ రాజ్యంలో బ్రిటీష్ రెసిడెంట్స్‌గా నియమించబడినారు.

దివాన్స్ పై మరింత సమాచారం - మీర్ ఆలం
-ఇతడు పర్షియా దేశస్థుడు. బ్రిటీష్ వారి నుంచి నిజాం రాజులకు రావాల్సిన పేష్‌కుష్ (వసూలు చేసిన పన్నులు) విషయంలో నాటి బెంగాల్ గవర్నర్ జనరల్ వెల్లస్లీ (కంపెనీ పాలకుల్లో అక్బర్ వంటివాడుగా ప్రతీతి)తో కలకత్తాలో సంప్రదింపులు జరిపాడు. ఇక్కడ మరో విషయం సైన్యసహకార విధానంలో నిజాం అలీఖాన్ రాజుతో తొలిసారిగా సంతకం చేసేందుకు ఒప్పించింది మీర్ ఆలం. ఇలా బ్రిటీష్ వారి మన్నలను పొందాడు. హైదరాబాద్ రాజ్యంలో బ్రిటీష్ వారు రావడానికి ముఖ్యకారకుడు ఇతడే. మీర్ ఆలం హయాంలోనే ముంబై-మద్రాస్ నగరాల మధ్య రహదారుల మరమ్మతులు చేశారు. ఫ్రెంచి ఇంజినీర్ల సహాయంతో హైదరాబాద్ సమీపంలో అతి అద్భుతమైన మీర్‌ఆలం చెరువును నిర్మించాడు. నేటికి అతని పేరు మీదుగానే మీర్ ఆలం చెరువుగా ప్రసిద్ధి. 1808లో మీర్ ఆలం మరణించాడు. నిజాం కాలంలో రాజా మం గేపత్ రాయ్, ఫ్రెంచి సైనికుడు పీటర్ రేమాండ్ శిక్షణ ఇచ్చిన దళాలను పునర్‌వ్యవస్థీకరించాడు. బీరార్ సుబేదార్‌గా పనిచేశాడు.

-సికిందర్ జా కాలంలో బ్రిటీష్ వారికి, దివాన్‌ల మధ్య సత్సంబంధాలు ఏర్పడటంతో నిజాంను కీలుబొమ్మగా మార్చి వారే నిజమైన అధికారం చెలాయించారు. దీంతో సికిందర్‌జాకు పరిపాలనపై ఆసక్తి తగ్గి పోయింది. ఇక ప్రధాని చందూలాల్, బ్రిటీష్ రెసిడెంట్ రస్సెల్‌దే ఇష్టారాజ్యం అయింది. చందూలాల్ 1816 సంవత్సరంలో సంస్థా నంలో (నిజాం రాజ్యంలో) శాంతిభద్రతలు కాపాడే బాధ్యతలు జనరల్ రస్సెల్‌కు అప్పగించాడు. దీంతో హైదరాబాద్ సైన్యం ప్రత్యేక సైన్యంగా మారింది. సైన్యం కోసమే సికింద్రాబాద్‌లో కంటోన్మెంట్ లష్కర్ (సైనికకేంద్రం) ఏర్పడింది. తర్వాత తన కోసం గెస్ట్‌హౌస్‌ను 1860లో సికింద్రాబాద్‌లో నిర్మించుకున్నాడు.
దీన్నే 1950లో భారతప్రభుత్వం 60 లక్షల రూపాయలకు కొనుగోలు చేసి రాష్ట్రపతి నిలయంగా మార్చింది. అదే ప్రస్తుతం బొల్లారంలోని రాష్ట్రపతి శీతాకాలపు విడిది. రాష్ట్రపతికి వేసవికాలంలో సిమ్లా (హిమాచల్‌ప్రదేశ్), మరొకటి శీతాకాలంలో బొల్లారం (సికింద్రాబాద్) తెలంగాణలో ఉంది. సికిందర్ జా సైనిక పోషణ భారం భరించలేక పామర్ అండ్ కంపెనీ వద్ద రూ. 60 లక్షలకు పైగా అప్పుచేశాడు. అది తీర్చలేక చివరికి బ్రిటీష్ బ్యాంకులో తన ఇద్దరి కుమారులను తాకట్టు పెట్టి, 29.75 లక్షల ఆదాయం వచ్చే బీరార్ (మహారాష్ట్రలోని విదర్భ) ప్రాంతాన్ని వారికి ఇచ్చాడు.
👣చందూలాల్👣

-హైదరాబాద్ దివాన్‌లలో చందూలాల్ చాలా ప్రముఖుడు. 1806లో పేష్కర్‌గా తర్వాత దివాన్‌గా మారా డు. దివాన్‌గా 37 ఏండ్ల సుదీర్ఘకాలం పనిచేశాడు. ఇతడు లాహోర్‌లోని ఖత్రీ తెగకు చెందినవాడు. ఇతడు గొప్పకవి. అంతేకాకుండా పర్షియన్ భాషలో ఇష్రాట్ కడ-ఇ-అఫ్‌క అనే గ్రంథం రాశాడు. ఈ గ్రంథంలో చందూలాల్‌కు అక్బర్ కాలంలో ఆర్థికమంత్రిగా విధులు నిర్వహించిన రాజా తోడర్‌మల్ కుటుంబంతో వివాహ సంబంధాలున్నట్లు ఉంది. చందూలాల్‌కు నానక్‌భ, బలాపేర్షాద్, రాజా మఖల్‌లాల్ అనే కుమారులున్నారు. చందులాల్ మనుమడు నారాయణ పెర్షాద్‌కు నరేంద్ర బహుదూర్ అనే బిరుదు ఉంది. తుర్రేబాజ్‌ఖాన్ హైదరాబాద్‌పై దాడి చేస్తున్నాడనే వార్తను బ్రిటీష్ రెసిడెంట్ కల్నల్ డేవిడ్‌సన్‌కు, నిజాం అఫ్జలుద్దౌలాకు సమాచారం ఇచ్చింది నారాయణ పెర్షాద్. నారాయణ పెర్షాద్ మనమడు (కుమార్తె కుమారుడు) కిషన్ పెర్షాద్‌కు యామినిబుస్ సల్తానత్ (Right Hand Of State) అనే బిరుదు ఉంది. అంటే చందూలాల్, అతని వారసులు హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు.

సికిందర్ జా కాలంలో నాందేడ్, షర్బణీ ప్రాంతాల్లో హట్కర్ తెగవారు, సిరివంచ, మహాదేవపురం ప్రాంతాల్లోని జమిందార్లు తిరుగుబాటు చేశారు. రాయచూర్, మోమినీబాద్, జీల్నా, హింగోలి ప్రాంతాల్లో బ్రిటీష్ సైనికాధికారులకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు వచ్చాయి. ఈ తిరుగుబాటుల్లో ధర్మాజీ ప్రతాప్‌రావ్ అనే లంబాడీ నాయకుని తిరుగుబాటు చాలా ప్రసిద్ధి చెందింది. అదే విధంగా నాందేడ్‌లోని నవసా గ్రామంలో నవసాజీ, హన్సాజీ సోదరుల తిరుగుబాటు, 1819లో వీరప్ప, కొప్పల్ చోట తిరుగుబాటు చేశారు.

👣 నసీరుద్దౌలా (1829-57)👣

-సికిందర్ జా కుమారుడు 4వ నిజాం (4వ అసఫ్ జా)గా రాజ్యానికి వచ్చాడు.
ఇతని కాలంలో...
1. రాజ రాంబక్ష్
2. సిరాజ్ -ఉల్-ముల్క్
3. షంషుల్ ఉల్-ముల్క్
4. తురాబ్ అలీఖాన్ (మొదటి సాలార్‌జంగ్)లు దివాన్లుగా పని చేశారు. వీరందరిలో తురాబ్ అలీఖాన్ ప్రసిద్ధుడు. నసీరుద్దౌలా కాలంలో హైదరాబాద్ రాజ్య ఆర్థిక స్థితి దిగజారిపోయింది. దీంతో అమ్మపాళెం, చింతగాని, మునగాలకు చెందిన స్థానిక జమీందార్లు తిరుగుబాట్లు చేశారు.

-నసీరుద్దౌలా కాలంలోనే భారతదేశంలో 1857, మార్చి 29న బెంగాల్‌లోని భారఖ్‌పూర్‌లో మంగళ్‌పాండే తిరుగుబాటు చేశాడు. మే 10న మీరట్‌లో (3వ అశ్వక దళంలో) తిరుగుబాటు జరిగింది. ఇది దక్షిణ భారతదేశానికి వ్యాప్తి చెందేనాటికి అఫ్జల్ ఉద్దౌలా 1857-1869లో రాజ్యానికి వచ్చాడు. నసీరుద్దౌలా కాలంలో రాయచూర్‌లోని బాదామిలో కోహరాన్ అనే అరబ్ సర్దార్ తిరుగుబాటు చాలా ప్రసిద్ధి. దీనిని బ్రిటీష్‌కు వ్యతిరేకంగా అరబ్బుల తిరుగుబాటుగా చెప్పవచ్చు.

వీటిలో ముఖ్యమైనవి. 1. నాగ్‌పూర్ 2. బెల్గాం
3. నందుపూర్ 4. బీదర్ 5. హైదరాబాద్‌ల్లో అరబ్బులను ఏకం చేసి బ్రిటీష్ రెసిడెంట్ల పై దాడులు నిర్వహించారు. నిజాంరాజులు, విదేశీయులకు దాసులుగా మారడం సహించలేక ఈ తిరుగుబాట్లు వచ్చాయి. 1855లో బొల్లారం సైనికశిబిరంలో తీవ్ర ఆందోళనలు జరిగాయి.1855లో మొహర్రం పండుగలో జరిగిన ఒక సంఘటన ఇక్కడ ఉదాహరణగా చెప్పవచ్చు.

మొహర్రం పండుగ సందర్భంగా బొల్లారంలోని బ్రిటీష్ సైనికులు తమ శిబిరాల్లో పీర్ల ఊరేగింపును నిషేధించారు. దీంతో స్థానిక తురుష్క సైనికుల్లో కొందరు కోపంతో, అసహనంతో హవాల్దార్ గులాం ఖాదర్ తన ఆఫీసర్ బ్రిగేడియర్‌పై దాడి చేశాడు. గులాంఖాదర్‌కు అనేక మంది సహాయపడ్డారు. ఇతడే తనకు స్ఫూర్తి అని తర్వాత కాలంలో తుర్రేబాజ్‌ఖాన్ చెప్పాడు.

👣 వహాబి ఉద్యమం (1839)👣

-బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఉత్తరభారత దేశంలో సయ్యద్ అహ్మద్ బరేలి నాయకత్వంలో ఉద్యమం ప్రారంభం అయింది. దీనికి మద్దతుగా హైదరాబాదులో ముబారిక్ ఉద్దౌలా (నసీరుద్దౌలా సోదరుడు) నాయకత్వంలో వహాబి ఉద్యమం ప్రారంభమయింది. దీనిని బ్రిటీష్ రెసిడెంట్ మార్టిన్ అణచివేశారు. నసీరుద్దౌలా కాలంలో జరిగిన మరొక ముఖ్య సంఘటన బీరార్ దత్తత (1853).

👣 బీరార్ సంఘటన👣

-బీరార్ రాజ్యంలో గతంలో ఇమాద్ షాహీలు పరిపాలించారు. ప్రస్తుతం నాగపూర్ (విదర్భ) ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం గత కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యమం జరుగుతుంది. బ్రిటీష్ గవర్నర్ జనరల్ డల్హౌసికి, నసీరుద్దౌలాకు మధ్య జరిగింది.

👣 బీరార్ ఒప్పందంలోని ముఖ్యాంశాలు👣

-బ్రిటీష్ సైన్యాన్ని (రస్సేల్స్ దళాన్ని) హైదరాబాద్ కంటిన్‌జెన్సిగా మార్చుట, దీనిని బ్రిటీష్ ఇండియా సైన్యానికి అనుబంధ దళంగా మార్చారు. సైనికపోషణకు రాయచూర్ (కర్ణాటక), బీరార్, ఉస్మానాబాద్ ప్రాంతాలు ఇచ్చేందుకు నిజాం ఒప్పుకున్నాడు. ఇలాంటి అవమానకరమైన షరతులపై సంతకం చేయాల్సి వచ్చినందుకు నిజాం బాధపడ్డాడు.
👣 సాలార్‌జంగ్ -1 చాణిక్యం👣

- ఈ సమయంలో 24 ఏండ్ల యువకుడు, మేధావి, గొప్పదౌత్యవేత్త, స్వాప్నికుడు అయిన మీర్ తురాబ్ అలీఖాన్ (సాలార్‌జంగ్-I) హైదరాబాద్ ప్రధాని అయ్యాడు. మునిగిపోతున్న హైదరాబాద్ నౌకను రక్షించి సురక్షితమైన తీరానికి తీసుకెళ్లిన గొప్ప నావికుడుగా మొదటి సాలార్ జంగ్‌కు పేరుంది. ఇతని గొప్పతనానికి నిదర్శనంగా నాటి ఇంగ్లండ్ రాజ్యంలోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం వారు డాక్టర్ ఆఫ్-సివిల్-లా అవార్డ్‌ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా బ్రిటీష్ వారు హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించాడని సాలార్‌జంగ్‌ను కీర్తించారు.

హైదరాబాద్ విశ్వనగర అభివృద్ధిలో 1. మహ్మద్‌కుతుబ్ షా (అష్రబాదీ), అఫ్జలుద్దీలా (సాలార్‌జంగ్-I), మహబూబ్ అలీఖాన్ (ఉస్మాన్ దివాన్ జా), మీర్ ఉస్మాన్ అలీఖాన్(విన్సెంట్ ఎస్క్)లు ప్రధాన భూమికను పోషించారు. నసీరుద్దౌలా 1834లో హైదరాబాద్ నగరంలోని అబిడ్స్‌లో పాలకుల పిల్లల కోసం సెయింట్ జార్జ్ గ్రామర్ హైస్కూల్‌ను ఏర్పాటు చేశారు. ఇలా ఇతని కాలంలోనే పాశ్చాత్య విద్య (ఆంగ్ల విద్య) హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. 1846లో మెడికల్ స్కూల్‌ను ప్రారంభించారు. స్థానికంగా తిరుగుబాట్లు చేసిన జమిందార్లలో అమ్మపాళెం (వెంకట నరసింహారావు), మునగాల (జగన్నాథరావు) ముఖ్యులుగా చెప్పవచ్చు.

👣 చరిత్రలో కొన్ని యుద్ధాలు :👣

-1191 - మొదటి తరైన్ యుద్ధం : ఇది ఘోరి మహ్మద్-పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య జరిగింది. విజేత పృథ్వీరాజ్ చౌహాన్

-1192 - రెండో తరైన్ యుద్ధం : ఘోరి మహ్మద్- పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య జరిగింది. విజేత ఘోరి మహ్మద్. పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించబడి వధింపబడ్డాడు.

-1194 చందవార్ యుద్ధం : ఈ యుద్ధం ఘోరి మహ్మద్ -గహద్వాల వంశానికి చెందిన జయచంద్రుడి మధ్య జరిగింది. ఈ మూడు యుద్ధాలు చరిత్రగతిని మార్చి వేసిన యుద్ధాలు. భారతదేశంలో ఇస్లాం సామ్రాజ్యం ఏర్పడటా నికి ఈ మూడు యుద్ధాలు కారణమయ్యాయి.

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.