చౌదరీ చరణ్ సింగ్ :
(భారతదేశ 5వ ప్రధానమంత్రి.)
〰〰〰〰〰〰〰〰〰
Hi friends,Today's Ex PM Raithubandhu 'Charan Singh 'Death anniversary--KS
(డిసెం23,1902-మే 29,1987)
🌀 1902 సంవత్సరములో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రము, మీరట్ జిల్లాలోని నూర్‌పూర్ లో జన్మించాడు.
🌀1923లో సైన్సులో పట్టా పుచ్చుకొని 1925లో ఆగ్రా విశ్వవిద్యాలయము నుండి పోస్టు గ్రాడ్యుయేషన్ చేశాడు. ఈయన ఆ తరువాత న్యాయవిద్య అభ్యసించి వకీలుగా ఘజియాబాదులో జీవితాన్ని ప్రారంభించాడు. 1929లో మీరట్ కి చేరి ఆ తదనంతరం కాంగ్రేసు పార్టీలో చేరాడు.
🌀 1937లో ఉత్తర ప్రదేశ్ శాసనసభకు ఛత్రౌలి నుండి ఎన్నికై ఆ నియోజక వర్గానికి 1946, 1952, 1962 మరియు 1967 లలో ప్రాతినిధ్యం వహించాడు.
🌀 1946లో గోవింద వల్లభ్ పంత్మంత్రివర్గములో పార్లమెంటరీ కార్యదర్శియై రెవిన్యూ, ఆరోగ్య మరియు సాంఘీక పరిశుభ్రత, న్యాయ, సమాచర శాఖలలో పనిచేశాడు.
🌀 1951 జూన్ లో రాష్ట్రములో కేబినెట్ మంత్రిగా నియమితుడై న్యాయ మరియు సమాచార శాఖ మంత్రిగా ఆ తరువాత 1952లో డా.సంపూర్ణానంద్ మంత్రివర్గములో రెవిన్యూ మరియు వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేశాడు. 1959 ఏప్రిల్ లో మంత్రి పదవికి రాజీనామా చేశాడు.
🌀 చరణ్‌సింగ్ 1960లో హోమ్ మరియు వ్యవసాయశాఖా మంత్రిగా, 1962-63లో వ్యవసాయ మరియు అటవీ శాఖా మంత్రిగా పనిచేశాడు. 1965లో వ్యవసాయ శాఖను విడిచి 1966లో స్థానిక స్వయంపరిపాలనా శాఖకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.
🌀 కాంగ్రేసు పార్టీ చీలిక తర్వాత, 1970 ఫిబ్రవరిలో కాంగ్రేసు మద్దతుతో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి రెండవ దఫా ముఖ్యమంత్రయ్యాడు. కానీ 1970 అక్టోబర్ 2 న ఈయన ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రములో రాష్ట్రపతి పాలన విధించబడినది.
🌀 ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చరణ్‌సింగ్ భూసంస్కరణలు చేపట్టాడు. 1960 లాండ్ హోల్డింగ్ చట్టాన్ని తీసుకునివచ్చాడు.
🌀 1979 జూలై 28 నుండి 1980 జనవరి 14 వరకు చరణ్ సింగ్ భారతదేశ 5వ ప్రధానమంత్రిగా పనిచేశాడు.
🌀 ప్రధానమంత్రి కంటే ముందు ఈయన ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేశాడు.
🌀 చరణ్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలములో లోక్‌సభ ఎన్నడూ సమావేశం కాలేదు. లోక్ సభ సమావేశం ప్రారంభమవుతుందనగా, ముందురోజు ఈయన ప్రభుత్వానికి మద్దతునిచ్చిన కాంగ్రేసు పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో భారతీయ లోక్‌దళ్ ప్రభుత్వం కూలిపోయింది. చరణ్ సింగ్ పదవికి రాజీనామా చేశాడు. 6 నెలల అనంతరం లోక్‌సభకు మళ్ళీ ఎన్నికలు జరిగాయి.
🌀 రైతు బంధుగా పేరుతెచ్చుకున్న చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు.
〰〰🙏🏻🙏🏻🙏🏻〰〰