21. అల్లసాని పెద్దన కన్నాముందే ''ఆంధ్రకవితా పితామహుడు'' అన్న బిరుదున్న కవి
- కొరవి సత్యనారాయణ (రాచకొండ దుర్గం).
22. తొలి తెలుగు ''విజ్ఞానసర్వస్వం'' అనదగినది ఏది?
ఎవరు రాశారు?
- పాల్కురికి సోమనాథుడు - ''పండితారాధ్యుల చరిత్ర''.
23. భారతదేశంలో ఏర్పడిన మ్యూజియం - తెలంగాణలో వుంది- అది - నాగార్జునసాగర్ ఐలాండ్ మ్యూజియం.
24. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పుట్టిన భాష
- 'ఉర్దూ'.
25. ''కొలిమంటుకున్నది'' నవలా రచయిత
- అల్లం రాజయ్య.
26. రొనాల్డ్‌రాస్ మలేరియా మందును కనుగొన్న ప్రాంతం
- హైదరాబాద్ .
27. తెలంగాణలో మొట్టమొదటి డిగ్రీ కళాశాల ఎక్కడ ఎవరి ప్రోత్సాహంతో వెలిసింది
- హైదరాబాద్ ఖండవల్లి లక్ష్మీ రంజనం.
28. తెలంగాణ ప్రప్రథమ ప్రజాకవి ఎవరు? - కాళోజీ నారాయణరావు.
29. తెలుగులో - గజల్స్ - రచనలు ప్రారంభించిన తొలి తెలంగాణ కవి ఎవరు? - డా. సి. నారాయణరెడ్డి.
30. తెలంగాణలో పూర్తిస్థాయిలో వెలువడిన మొట్టమొదటి తెలుగు స్వతంత్ర పత్రిక - హితబోధిని.
31. తెలుగులో తొలిసారిగా నాలుగు వేదాలను వచనంగా రాసిన కవి ఎవరు? - దాశరథి రంగాచార్య.
32. హైదరాబాద్ రాష్ట్ర ప్రాజెక్ట్‌లలో మొట్టమొదటిది ఏది?
- నిజాం సాగర్
33. యావత్ భారతదేశంలోనే అరుదైన శిల్పంగా పేరుగాంచిన ''ఎలుక'' శిల్పం (రాతి) తెలంగాణలో ఎక్కడ కలదు. - నల్లగొండ జిల్లా, పానగల్లు మ్యూజియం.
34. ప్రపంచంలోని 5 ప్రదేశాలలో బుద్ధుని ధాతువులను దాచారు. అందులో తెలంగాణలోనిది ఒకటి ఎక్కడ
- నాగార్జునసాగర్.
35. తెలంగాణలో ప్రప్రథమ సార్వత్రిక విశ్వవిద్యాలయం నెలకొల్పబడింది. హైదరాబాద్‌లో
- డా. అంబేద్కర్ విశ్వవిద్యాలయం.
36. తెలంగాణలో తొలి ఉద్యమం -గ్రంథాలయోద్యమం.
37. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రప్రథమంగా నేలకొరిగిన వ్యక్తి - దొడ్డి కొమురయ్య.
38. తెలంగాణకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన పోరాటం - తెలంగాణ సాయుధ పోరాటం.
39. తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయం ఏది?
- నిజామాబాద్ జిల్లాలో - టి.కె. బాలయ్య - ఆర్మూర్ తాలుకాలో ఎడ్లబండిపై సంచార గ్రంథాలయాన్ని నడిపాడు.
40. తెలంగాణలో తెలుగు సాహిత్యానికి పునాది వేసిన రాజవంశం ఏది? - వేములవాడ చాళుక్యులు.
May 14, 2016
Tags