Type Here to Get Search Results !

Vinays Info

తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్-2015

Top Post Ad

తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్-2015 నివేదికను రాష్ట్ర అర్థగణాంక శాఖ జనవరి 1న విడుదల చేసింది.
-గ్రామీణ ప్రాంతాల్లో లింగనిష్పత్తి : 999
-పట్టణ ప్రాంతాల్లో లింగనిష్పత్తి : 970
-0-6 ఏండ్ల వయస్సులో లింగనిష్పత్తి : 933
-తెలంగాణ అక్షరాస్యత : 66.46 శాతం
-గ్రామీణ అక్షరాస్యత : 57.30 శాతం
-పట్టణ అక్షరాస్యత : 81.10 శాతం
-తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేను 2015 జనవరి 7న గణాంకాలతో విడుదల చేశారు. సమగ్ర కుటుంబ సర్వేను 2014 ఆగస్టు 19న రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు చేపట్టారు.
వివరాలు
-జనాభా - 3,63,37,160
-మొత్తం కుటుంబాలు - 1,01,93,027
-బీసీలు - 51.08 శాతం, ఓసీలు - 21.50 శాతం, ఎస్సీలు - 17.50 శాతం, ఎస్టీలు - 9.91 శాతం, మైనా రిటీలు - 14.46 శాతం ఉన్నారు.
-జనాభాపరంగా తొలి స్థానంలో ఉన్న జిల్లా - రంగారెడ్డి
-రెండో స్థానంలో ఉన్న జిల్లా - మహబూబ్నగర్
-మూడో స్థానంలో ఉన్న జిల్లా - కరీంనగర్
-ఎస్సీ జనాభాలో రంగారెడ్డి, ఎస్టీ జనాభాలో ఖమ్మం, బీసీ జనాభాలో రంగారెడ్డి, మైనారిటీ జనాభాలో హైదరాబాద్ తొలిస్థానాల్లో ఉన్నాయి.
-రాష్ట్రంలో ఎయిడ్స్ రోగులు 10,638
-దీర్ఘకాలిక వ్యాధుల రోగులు 7.58 లక్షలు
-గుండె సంబంధ రోగులు 1.17 లక్షలు
-క్యాన్సర్ రోగులు 32,339
-పక్షవాత రోగులు 65,903
-రాష్ట్రంలో ఆదాయ పన్ను చెల్లించే కుటుంబాల సంఖ్య 7 శాతం
-మతాలపరంగా హిందువులు 87.17 శాతం, ముస్లింలు 11.01 శాతం, క్రిస్టియన్లు 1.27 శాతం, సిక్కులు 0.06 శాతం, బౌద్ధులు 0.05 శాతం
కుటుంబాలు ఉన్నాయి.
-రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 2,83,15,120, వీరిలో పురుషులు 1,44,72,054, స్త్రీలు 1,38,40,715, ఇతరులు 2,351 ఉన్నారు.
-దేశంలో నూతనంగా రెండు అభయారణ్య ప్రాంతాలను పర్యావరణ పరిరక్షణ జోన్లుగా కేంద్రం ఎంపిక చేసింది. వీటిలో రాష్ట్రం నుంచి కృష్ణజింకల కోసం ప్రాణహిత ప్రాంతాన్ని ప్రకటించారు.
-రాష్ర్టానికి నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికవేత్త కార్యక్రమానికి అసోచామ్ అవార్డు లభించింది.
-జనవరి 6న నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరి మండలం ఫణిగిరి తూర్పు భాగంలో బౌద్ధ ధాతు పేటిక లభ్యమైంది. ఇక్కడ 1942 నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి.
-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాజయ్య స్థానంలో జనవరి 25న కడియం శ్రీహరిని నియమించారు.
-ఉత్తమ విశ్వవిద్యాలయం, నవీకరణ, పరిశోధన విభాగంలో విజిటర్స్ అవార్డు హెచ్సీయూకు జనవరి 29న లభించింది. దీన్ని 2014లో స్థాపించారు.
-రాష్ట్ర రెండో గ్రేటర్ నగరంగా వరంగల్ను జనవరి 28న ప్రకటించారు. ఈ నిర్ణయంతో 42 గ్రామపంచాయతీలు వరంగల్లో విలీనం అయ్యాయి.
-ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం అమల్లో దేశంలో రాష్ట్రం ప్రథమస్థానంలో నిలిచింది. 2015 జనవరి 26 నాటికి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు వంద శాతం బ్యాంకు ఖాతాల సదుపాయాన్ని గడువు కన్నా ముందే రాష్ట్రం కల్పిచింది.
-రాష్ట్ర రహదారి భద్రతా మండలిని 29 సభ్యులతో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జనవరి 23న ఉత్తర్వులు జారీ చేసింది. దీని అధ్యక్షుడు సీఎం కేసీఆర్.
-దేశంలో పంచాయతీలన్నింటినీ ఈ-పంచాయతీలుగా మార్చడానికి ఈ-పంచాయత్ మిషన్ మోడ్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మోడల్ ఈ-పంచాయతీగా చౌటుప్పల్ (నల్లగొండ) పంచాయతీ ఎంపికైంది.
-టీఎస్ జెన్కోకు చెందిన వరంగల్ జిల్లా భూపాలపల్లి సమీపంలోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు-1 దేశంలోనే విద్యుత్ ఉత్పత్తిలో ప్రథమస్థానంలో నిలిచింది. టీఎస్ జెన్కో చైర్మన్, సీఎండీ డి.ప్రభాకర్రావు.
-రాష్ట్రంలో ఆదిలాబాద్ కవ్వాల్ టైగర్ ప్రాజెక్టుతో పాటుగా అమ్రాబాద్ టైగర్ ప్రాజెక్టుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఫిబ్రవరి 13న ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 18 పెద్ద పులులు, 300 పైగా చిరుతపులులున్నాయి.
-దేశంలో చిన్న కుటుంబాలు కలిగిన రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో చిన్న కుటుంబాలు ఎక్కువగా ఉన్న జిల్లా ఖమ్మం.
-రాష్ట్ర ప్రభుత్వం మార్చి 13న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను భారీగా పెంచింది.

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.