Type Here to Get Search Results !

Vinays Info

జనగణన - 2011

జనగణన -2011

- సెన్సస్ (జనాభా గణన) అనే పదాన్ని పురాతన రోమ్‌లో మొదటిసారిగా వాడారు. ఈ పేరును లాటిన్ పదం సెన్సెర్ (అంచనా అని అర్థం) నుంచి స్వీకరించారు.
- భారతదేశంలో మొదటిసారిగా జనాభా లెక్కలను 1872లో లార్డ్ మేయో కాలంలో సేకరించారు.
- జనాభా లెక్కలను ప్రతి 10 ఏళ్లకు ఒకసారి సేకరిస్తారు.
- జనాభా లెక్కలు కేంద్ర జాబితాలో కలవు.
- 2011 జనాభా లెక్కల సేకరణ 15వది.
- స్వాతంత్య్రం తర్వాత జనాభా లెక్కల సేకరణ 7వది.
- 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా - 121,01,93,422
- పురుషులు - 62,37,24,248 (51.54శాతం)
- మహిళలు - 58, 64,69,174 (48.46శాతం)
- అత్యధిక జనాభా గల రాష్ర్టాలు - ఉత్తరప్రదేశ్ (19.9 కోట్లు), మహారాష్ట్ర (11.2 కోట్లు), బీహార్ (10.03 కోట్లు).
- అత్యల్ప జనాభా గల రాష్ర్టాలు - సిక్కిం (60.7లక్షలు), మిజోరాం (1.09కోట్లు), అరుణాచల్‌ప్రదేశ్ (1.38 కోట్లు).
- అత్యధిక జనాభా గల కేంద్రపాలిత ప్రాంతాలు - ఢిల్లీ (1.67 కోట్లు), పుదుచ్చేరి (12.44లక్షలు), అండమాన్ నికోబార్ దీవులు (3.79లక్షలు)
- అత్యల్ప జనాభా గల కేంద్రపాలిత ప్రాంతాలు - లక్షదీవులు (64,429), డామన్ డయ్యూ (2.42 లక్షలు), దాద్రానగర్ హవేలీ (3.42లక్షలు)
- అత్యధిక జనాభా గల జిల్లా - థానె, మహారాష్ట్ర (1.10 కోట్లు)
- జనాభా అత్యల్పంగా గల జిల్లా - దిబాంగ్ వ్యాలీ, అరుణాచల్ ప్రదేశ్ (7,948)
- జనాభా అత్యధికంగా పెరిగిన రాష్ర్టాలు - మేఘాలయ (27.8 శాతం), అరుణాచల్‌ప్రదేశ్ (25.9శాతం), బీహార్ (25.1 శాతం)
- జనాభా అత్యల్పంగా పెరిగిన రాష్ర్టాలు- నాగాలాండ్ (0.5శాతం), కేరళ (4.9 శాతం), గోవా (8.2శాతం)
- జనాభా అత్యధికంగా పెరిగిన కేంద్రపాలిత ప్రాంతాలు - దాద్రానగర్ హవేలీ (55.5శాతం), డామన్ డయ్యూ (53.5శాతం), పుదుచ్చేరి (27.7)
- జనాభా అత్యల్పంగా పెరిగిన కేంద్రపాలిత ప్రాంతాలు - లక్షదీవుల (6.2శాతం), అండమాన్ నికోబార్ దీవులు (6.7శాతం), చండీగఢ్ (17.1 శాతం)
- జనాభావృద్ధి అత్యధికంగా గల జిల్లా - కోహిమా (131.81శాతం), నాగాలాండ్.
- జనాభా వృద్ధి అత్యల్పంగా గల జిల్లా - లొంగ్లెంగ్ (21శాతం), నాగాలాండ్.
- దేశ గ్రామీణ జనాభా - 68.84 శాతం
- గ్రామీణ జనాభా అత్యధికంగా గల రాష్ర్టాలు - హిమాచల్‌ప్రదేశ్ (99.6శాతం), బీహార్ (88.70), అసోం ( 85.92)
- గ్రామీణ జనాభా అత్యల్పంగా గల రాష్ర్టాలు - గోవా (37.83శాతం), మిజోరాం (48.49శాతం), తమిళనాడు (51.55శాతం)
- గ్రామీణ జనాభా అత్యధికంగా గల కేంద్రపాలిత ప్రాంతా లు -అండమాన్ నికోబార్ దీవులు (64.33శాతం), దాద్రానగర్ హవేలీ (53.38శాతం), పుదుచ్చేరి (31.69 శాతం)
- గ్రామీణ జనాభా అత్యల్పంగా గల కేంద్రపాలిత ప్రాంతాలు - ఢిల్లీ (2.50 శాతం), చండీగఢ్ (2.75), లక్షదీవులు (21.92శాతం)
- దేశ పట్టణ జనాభా - 31.16శాతం
- పట్టణ జనాభా అత్యధికంగా గల రాష్ర్టాలు - గోవా (62.17), మిజోరాం (51.51), తమిళనాడు (48.45)
- పట్టణ జనాభా అత్యల్పంగా గల రాష్ట్రాలు - హిమాచల్‌ప్రదేశ్ (10.04 శాతం), బీహార్ (11.30 శాతం), అసోం (14.08 శాతం)
- పట్టణ జనాభా అత్యధికంగా గల కేంద్రపాలిత ప్రాంతాలు - ఢిల్లీ (97.50 శాతం), చండీగఢ్ (97.25 శాతం), లక్షదీవులు (78.08 శాతం)
- పట్టణ జనాభా అత్యల్పంగా గల కేంద్రపాలిత ప్రాంతా లు -అండమాన్ నికోబార్ దీవులు (35.67 శాతం), దాద్రానగర్ హవేలీ (46.62 శాతం), పుదుచ్చేరి (68.31 శాతం)
జనసాంద్రత - 382 (చ.కి.మీ)
- జనసాంద్రత అత్యధికంగా గల రాష్ర్టాలు - బీహార్ (1102), పశ్చిమబంగా (1029), కేరళ ( 859 )
- జనసాంద్రత అత్యల్పంగా గల రాష్ర్టాలు - అరుణాచల్‌ప్రదేశ్ (17), మిజోరాం (52), జమ్ముకశ్మీర్ (56)
- అత్యధిక జనసాంద్రత గల రాష్ర్టాలు- ఢిల్లీ (11,297), చండీగఢ్ (9,252), పుదుచ్చేరి (2,598)
- అత్యల్ప జనసాంద్రత గల రాష్ర్టాలు- అండమాన్ నికోబార్ దీవులు (46), దాద్రానగర్ హవేలీ (698), లక్షదీవులు (2,031)
- అత్యధిక జనసాంద్రత గల జిల్లా - నార్త్ ఈస్ట్ ఢిల్లీ (29,486)
- అత్యల్ప జనసాంద్రత గల జిల్లా - లాహుల్&స్పితి, హిమాచల్‌ప్రదేశ్ (2)
- స్త్రీ, పురుష నిష్పత్తి : 940
- అత్యధిక స్త్రీ, పురుష నిష్పత్తి గల రాష్ర్టాలు - కేరళ (1084), తమిళనాడు (995), ఆంధ్రప్రదేశ్ (993)
- అత్యల్ప స్త్రీ, పురుష నిష్పత్తి గల రాష్ర్టాలు - హర్యానా (877), జమ్ము కశ్మీర్( 883), సిక్కిం (889)
- అత్యధిక స్త్రీ, పురుష నిష్పత్తి గల కేంద్రపాలిత ప్రాంతాలు - పుదుచ్చేరి (1,038), లక్షదీవులు ( 946), అండమాన్ నికోబార్ దీవులు (878)
- అత్యల్ప స్త్రీ, పురుష నిష్పత్తి గల కేంద్రపాలిత ప్రాంతాలు - డామన్ డయ్యూ (618), దాద్రానగర్ హవేలీ (775), చండీగఢ్ (818)
- అత్యధిక స్త్రీ, పురుష నిష్పత్తి గల జిల్లా - మహే (1184), పుదుచ్చేరి
- అత్యల్ప స్త్రీ, పురుష నిష్పత్తి గల జిల్లా - డామన్ డయ్యూ (534)
దేశ అక్ష్యరాస్యత - 74.04 శాతం
- అత్యధిక అక్ష్యరాస్యత గల రాష్ర్టాలు - కేరళ (93.91 శాతం), మిజోరాం (91.58 శాతం), త్రిపుర (87.75 శాతం)
- అత్యల్ప అక్ష్యరాస్యత గల రాష్ట్రాలు - బీహార్ (63.82 శాతం), అరుణాచల్‌ప్రదేశ్ (66.95 శాతం), తెలంగాణ (64.04 శాతం)
- అత్యధిక అక్ష్యరాస్యత గల కేంద్రపాలిత ప్రాంతాలు - లక్షదీవులు (92.28 శాతం), డామన్ డయ్యూ (87.07 శాతం), పుదుచ్చేరి (86.55 శాతం)
- అత్యల్ప అక్ష్యరాస్యత గల కేంద్రపాలిత ప్రాంతాలు - దాద్రానగర్ హవేలీ (77.65శాతం), అండమాన్ నికోబార్ దీవులు (86.27శాతం), ఢిల్లీ (86.34శాతం)
- అత్యధిక అక్ష్యరాస్యత గల జిల్లా - సెర్చిప్ (97.91 శాతం), మిజోరాం
- అత్యల్ప అక్ష్యరాస్యత గల జిల్లా - అలీరాజ్‌పూర్ (36.10 శాతం),మధ్యప్రదేశ్
- 0-6 బాలల జనాభా - 15,87,89,287
- మొత్తం జనాభాలో బాలల (0-6)జనాభా శాతం - 13.12
- 0-6 బాలల జనాభా అత్యధికంగా గల రాష్ర్టాలు - ఉత్తరప్రదేశ్ (2.97 కోట్లు), బీహార్ (1.85 కోట్లు), మహారాష్ట్ర (1.28 కోట్లు)
- 0-6 బాలల జనాభా అత్యల్పంగా గల రాష్ర్టాలు - సిక్కిం (61 వేలు), గోవా (1.39 లక్షలు), మిజోరాం (1.65 లక్షలు).
- 0-6 బాలల జనాభా అత్యధికంగా గల జిల్లా - థానె (13.27 లక్షలు), మహారాష్ట్ర.
- అత్యల్పంగా బాలల (0-6) జనాభా గల జిల్లా - దిబాంగ్ వ్యాలీ (1.08లక్షలు), అరుణాచల్‌ప్రదేశ్
- 0-6 బాలల లింగ నిష్పత్తి - 919
- 0-6 బాలల లింగ నిష్పత్తి అత్యధికంగా గల రాష్ర్టాలు - అరుణాచల్ ప్రదేశ్ (972), మేఘాలయ (970), మిజోరాం(970)
- 0-6 బాలల లింగ నిష్పత్తి అత్యల్పంగా గల రాష్ర్టాలు - హర్యానా (834), పంజాబ్ (846), జమ్ము కశ్మీర్ (862)
- ఎస్సీల జనాభా - 16.66 కోట్లు
- మొత్తం జనాభాలో ఎస్సీల శాతం - 16.2
- ఎస్సీలు అత్యధికంగా గల రాష్ట్రం - పంజాబ్ (28.9 శాతం)
- ఎస్సీలు అత్యల్పంగా గల రాష్ట్రం - మిజోరాం (0.03 శాతం)
- ఎస్సీలు అత్యధికంగా గల కేంద్రపాలిత ప్రాంతం- చండీగఢ్ (17.5శాతం)
- ఎస్సీలు అత్యల్పంగా గల కేంద్రపాలిత ప్రాంతం - దాద్రా నగర్ హవేలీ (1.9 శాతం)
- ఎస్సీలు అత్యధికంగా గల జిల్లా - కుచ్ బీహార్ (50.1 శాతం),
- ఎస్సీలు అత్యల్పంగా గల జిల్లా -లవ్డతాళై (0.01 శాతం), మిజోరాం
- జనాభాలో ఎస్టీల జనాభా - 8.43 కోట్లు
- మొత్తం జనాభాలో ఎస్టీల శాతం - 8.2
- ఎస్టీలు అత్యధికంగా గల రాష్ట్రం- మిజోరాం (94.5 శాతం)
- ఎస్టీలు అత్యల్పంగా గల రాష్ట్రం -గోవా(0.04 శాతం)
- ఎస్టీలు అత్యల్పంగా గల కేంద్రపాలిత ప్రాంతం - అండమాన్ నికోబార్ దీవులు (8.3 శాతం)
- ఎస్టీలు అత్యధికంగా గల జిల్లా - సెర్చిప్ (98.1 శాతం), మిజోరాం
- ఎస్టీలు అత్యల్పంగా గల జిల్లా - హథ్రస్ (0.01 శాతం), ఉత్తరప్రదేశ్.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section