Type Here to Get Search Results !

Vinays Info

::జనగణన - 2011::

2011 జన గ‌ణ‌న‌
సముద్ర తీరరేఖ
- అతి పొడవైన తీరరేఖ గల రాష్ట్రం -గుజరాత్ (1054కి.మీ)
- అతి తక్కువ తీరరేఖ గల రాష్ట్రం - గోవా ( 36కి.మీ)
- మూడు సముద్రాల కలయికతో కూడిన తీరరేఖ కలిగిన రాష్ట్రం - తమిళనాడు
- దేశంలో ఎక్కువ తీరరేఖ గల నగరం - చెన్నై
- దేశంలో పొడవైన బీచ్ -చెన్నై మెరీనా బీచ్ (13 కి.మీ)
- తీరరేఖ, అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ర్టాలు - గుజరాత్, పశ్చిమబంగా
- వ్యాపారపరంగా భారతదేశ ప్రాదేశిక జలాల పరిధి - 200 నాటికల్ మైళ్లు (సుమారు 320 కి.మీ విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో దొరికే వనరులన్నీ దేశానికే చెందుతాయి).
దీవులు
- దేశంలో మొత్తం దీవులు - 247 (బంగాళాఖాతంలో 203, మిగిలినవి అరేబియా సముద్రం, మన్నార్ సింధూశాఖల్లో ఉన్నాయి).
- బంగాళాఖాతంలోని అండమాన్ దీవుల్లో పెద్ద దీవి- గ్రేట్‌నికోబార్
- అండమాన్ దీవుల సముదాయంలో కేవలం 36 దీవుల్లో మాత్రమే జనజీవనం కలదు.
- భూమధ్య రేఖకు సమీపంలో ఉన్న దీవి - గ్రేట్ నికోబార్
- అరేబియా సముద్రంలో లక్షదీవులు కలవు. ఇందులో 36 దీవులు ఉన్నప్పటికీ, 10 దీవుల్లో మాత్రమే జనజీవనం ఉంది. వీటి వైశాల్యం 32 చ.కి.మీ.
- లక్షదీవుల్లో పెద్దదీవి -మినికాయ్ దీవి
- ప్రపంచంలో అతిపెద్ద నది ఆధారిత దీవి- మజూరీ దీవి (అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో కలదు)
దేశ వయో వృద్ధ జనాభా (2011 ప్రకారం)

- మొత్తం దేశ జనాభాలో - 10.39 కోట్లు
- దేశ జనాభాలో వృద్ధుల శాతం - 8.06 శాతం
- వృద్ధ పురుషులు - 5.11కోట్లు (8.2శాతం)
- వృద్ధ మహిళలు - 5.28 కోట్లు (9శాతం)
- 2001-2011 మధ్య పెరిగిన వృద్ధ జనాభా - 35.5 శాతం
- 2001లో - 7.6 కోట్లు , 2011లో 10.39కోట్లు
- అత్యధిక వృద్ధ జనాభా గల రాష్ర్టాలు - కేరళ (12.6 శాతం), గోవా(11.2శాతం), తమిళనాడు (10.4శాతం), పంజాబ్ (10.3శాతం), హిమాచల్‌ప్రదేశ్ (10.2శాతం)

- అత్యల్ప వృద్ధ జనాభా గల రాష్ర్టాలు - అరుణాచల్ ప్రదేశ్ (4.6శాతం), మేఘాలయ (4.7శాతం), నాగాలాండ్ (5.2శాతం), మిజోరాం (6.3శాతం)
- అత్యధిక వృద్ధ జనాభా గల కేంద్రపాలిత ప్రాంతాలు - లక్షదీవులు, ఢిల్లీ, అండమాన్ నికోబార్‌దీవులు
- అత్యల్ప వృద్ధజనాభా గల కేంద్రపాలిత ప్రాంతాలు- దాద్రానగర్ హవేలీ, ఢిల్లీ, డామన్ డయ్యూ

- స్త్రీ, పురుష నిష్పత్తి - 1033/1000
- గ్రామాల్లో ఇతరులపై ఆధారపడిన వృద్ధులు - 15.1శాతం
- పట్టణాల్లో ఇతరులపై ఆధారపడిన వృద్ధులు - 12.4శాతం
- మొత్తం అక్ష్యరాస్యత - 44శాతం పురుషులు (59శాతం), స్త్రీలు (28శాతం)
- గ్రామాల్లో పని చేసే వృద్ధులు - పురుషులు (66శాతం), స్త్రీలు ( 28శాతం)
- పట్టణాల్లో పనిచేసే వృద్ధులు - పురుషులు (46శాతం), స్త్రీలు (11శాతం)
జనాభా లెక్కలు (2011)- వికలాంగులు
- వైకల్యం గురించి 1872 జనాభా లెక్కల నుంచి 1931వరకు పేర్కొన్నారు.
- 1941 నుంచి 1971 జనాభా లెక్కల్లో వైకల్యం గురించి పేర్కొనలేదు.
- 1981 జనాభా లెక్కల్లో మూడు రకాల వైకల్యం గురించి పేర్కొన్నారు.
- 1991 జనాభా లెక్కల్లో వైకల్యం గురించి పేర్కొనలేదు.
- 2001 జనాభా లెక్కల్లో ఐదు రకాల వైకల్యం గురించి పేర్కొన్నారు.
- 2011 జనాభా లెక్కల్లో ఎనిమిది రకాల వైకల్యం గురించి పేర్కొన్నారు.
- ఇందులో.. 1) అంధులు (18.8శాతం), 2) బధిరులు (18.9శాతం), 3) మూగ (7.5శాతం), 4) కదలిక లేనివారు (20.30శాతం), 5) మానసిక వైకల్యం (5.6 శాతం), 6) బుద్ధిమాంద్యం(2.7శాతం), 7) బహుళ వైకల్యం(18.4శాతం), 8) ఇతర వైకల్యం (7.9శాతం)
- 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం వికలాంగులు - 2,68,10,557
- 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో
వికలాంగుల శాతం - 2.21శాతం
- 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో వికలాంగ పురుషులు 2.41శాతం, మహిళలు 2.01శాతం
కానివారు
- అత్యధిక వైకల్యం గల రాష్ర్టాలు - ఉత్తరప్రదేశ్ (41.57లక్షలు), మహారాష్ట్ర (29.63లక్షలు), బీహార్ (23.31లక్షలు)
- అత్యల్ప వైకల్యం గల రాష్ర్టాలు - మిజోరాం (15,160), సిక్కిం (18,187), అరుణాచల్ ప్రదేశ్ (26,734)
- అత్యధిక వైకల్యంగల కేంద్రపాలిత ప్రాంతాలు - ఢిల్లీ (2,34,882), పుదుచ్చేరి ( 30,189)
- అత్యల్ప వైకల్యంగల కేంద్రపాలిత ప్రాంతాలు - లక్షదీవులు (1,615), డామన్ డయ్యూ (2,196)
వివిధ మతస్తుల జనాభా వివరాలు (2011)

- మతాల వారీగా జనాభా లెక్కలను ఆగస్టు 25, 2015న 2011 జనాభా గణన ఆధారంగా రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ విడుదల చేశారు.
- దేశ జనాభాలో హిందువుల జనాభా శాతం - 79.8 (96.63కోట్లు)
- ముస్లిం జనాభా శాతం - 14.2 (17.22కోట్లు)
- క్రిస్టియన్ల జనాభా శాతం - 2.30 (2.78 కోట్లు)
- 2001 -2011 మధ్య దేశ జనాభా 17.64 శాతం పెరిగితే, హిందువుల జనాభా వృద్ధి 16.8శాతం, ముస్లిం జనాభావృద్ధి రేటు 24.6 శాతం నమోదైంది.

- జాతీయస్థాయిలో మొత్తం జనాభాలో ముస్లింల శాతం 2001లో 13.4 శాతం ఉండగా, 2011లో 14.2 శాతానికి పెరిగింది.
- అసోంలో అత్యధిక స్థాయిలో 30.9 శాతం నుంచి 34.2శాతానికి పెరిగింది.
- ముస్లింలు అధికంగా పెరిగిన ఇతర రాష్ర్టాల్లో ఉత్తరాఖండ్ (2శాతం), కేరళ(1.9శాతం), పశ్చిమబంగా (1.8శాతం), గోవా (1.6శాతం), జమ్ముకశ్మీర్ (1.3శాతం) ఉన్నాయి.
- ముస్లింల జనాభాలో మేఘాలయ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌లలో 0.1శాతం పెరుగుదల నమోదైంది.
- మణిపూర్‌లో మాత్రమే ముస్లిం జనాభా 8.8 శాతం నుంచి 8.4 శాతానికి తగ్గింది.

- గత దశాబ్ద కాలంలో హిందూ జనాభా 0.7 శాతం తగ్గితే, ముస్లింల జనాభా 0.8 శాతంగా పెరిగింది.
- దేశంలో అత్యధికంగా ముస్లింలు జమ్ముకశ్మీర్‌లో 68.3 శాతం, అసోంలో 34.2శాతం, పశ్చిమబంగాలో 27శాతం.
- గత దశాబ్ద కాలంలో ముస్లింల జనాభా తగ్గిన ఏకైక రాష్ట్రం - మణిపూర్
- అత్యధికంగా హిందువులు 28 రాష్ర్టాల్లో ఉన్నారు.


- అత్యధికంగా హిందువులు ఉన్న రాష్ట్రం - హిమాచల్ ప్రదేశ్ (95.17)
- అత్యల్పంగా హిందువులు ఉన్న రాష్ట్రం - మిజోరాం (1.35)
- అత్యధికంగా ముస్లింలు ఉన్న రాష్ట్రం - జమ్ముకశ్మీర్ 68.31శాతం
- అత్యధికంగా ముస్లింలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతం - లక్షద్వీప్ (98.58శాతం)
- అత్యధికంగా క్రిస్టియన్లు ఉన్న రాష్ట్రం - నాగాలాండ్ (87.93శాతం)
- అత్యల్పంగా క్రిస్టియన్లు ఉన్న రాష్ట్రం - బీహార్ (0.02శాతం)
- అత్యధికంగా సిక్కులు ఉన్న రాష్ట్రం - పంజాబ్ (57.69శాతం)
58

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section