Type Here to Get Search Results !

Vinays Info

Flag Code of India(జాతీయ జెండా నియమాలు) 2022 యొక్క ముఖ్య లక్షణాలు

Flag Code of India(జాతీయ జెండా నియమాలు) 2022 యొక్క ముఖ్య లక్షణాలు

  • భారత జాతీయ జెండా భారతదేశ ప్రజల ఆశలు మరియు ఆకాంక్షలను సూచిస్తుంది. ఇది మన జాతీయ ఆత్మగౌరవానికి చిహ్నం మరియు జాతీయ జెండా పట్ల సార్వత్రిక అభిమానం, గౌరవం మరియు విధేయత.
  • ఈ జాతీయ జెండా భారతదేశ ప్రజల భావొద్వేగాలు మరియు మనస్సులో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించింది.
  • ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, 2002 డిసెంబర్ 30, 2021 నాటి ఆర్డర్ ప్రకారం సవరించడింది. దీని ప్రకారం పాలిస్టర్ లేతా మెషీన్ మేడ్ ఫ్లాగ్తో తయారు చేసిన జాతీయ జెండాను అనుమతించటం జరిగింది. ప్రస్తుతం జాతీయ జెండాను చేతితో నేసిన లేదా యంత్రంతో తయారు చేసిన పత్తి / పాలిస్టర్/ ఉన్ని / సిల్క్ మరియు ఖాదీ వంటి వాటితో తయారు చేయాలి. 
  • పబ్లిక్, ప్రవేట్ సంస్థ లేదా విద్యా సంస్థ సభ్యుడు జాతీయ జెండా యొక్క గౌరవానికి అనుగుణంగా అన్ని రోజులలో ఏ సందర్భాలలో అయినా జాతీయ జెండాను ఎగురవేయవచ్చు / ప్రదర్శించవచ్చు.
  • జాతీయ జెండాను పబ్లిక్ భవనాలపై అన్ని రోజులలో వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా,సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు అన్ని రోజులలో ఎగురవేయాలి మరియు నెమ్మదిగా కిందికి దించాలి.
  • ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా-2002, 2022 జూలై 20 నాటి ఆర్డర్ మరియు ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, 2002 యొక్క పార్ట్ 2 లోని 2.2 పేరాలోని క్లాజ్ (xi) ప్రకారం మరింత సవరించబడింది.
  • జెండా బహిరంగ ప్రదేశంలో ప్రదర్శించిననూ లేదా ప్రజా సభ్యుని ఇంటి యందు ఎగరవేసిననూ దానిని పగలు మరియు రాత్రి ఎగరవేయవచ్చు.
  • జాతీయ జెండా ధీర్ఘచతురస్రాకారంలో ఉండాలి. జెండా పరిమాణం, ఎత్తు (వెడల్పు) కి పొడవు నిష్పత్తి 3:2 ఉండాలి.
  • జాతీయ జెండాను ప్రదర్శించినప్పుడల్లా అది గౌరవ స్థానాన్ని ఆక్రమించాలి మరియు స్పష్టంగా కనపడాలి. దెబ్బతిన్న మరియు చెదిరిన జెండాను ప్రదర్శించకూడదు.
  • ఏదైనా ఇతర జెండా లేదా జెండాలతో ఏకకాలంలో ఒకే స్థానం నుండి జెండాను ఎగురవేయకూడదు.
  • జాతీయ పతాకంతో పాటు మరే ఏ ఇతర జెండాను అదే స్థాయిలో సమానంగా ఎగురవేయకూడదు.
  •  వస్తువులను చుట్టడానికి, స్వీకరించడానికి లేదా పంపిణీ చేయడానికి జాతీయ జెండాను ఉపయోగించకూడదు.
  • 13,08, 2022 సూర్యోదయం మొదలు జాతీయ జెండాను ప్రత్యేక స్థానాలయందు ఎగురవేసి తేదీ॥15.08.2022 సూర్యాస్తమయ సమయానికి జాతీయ జెండాను నెమ్మదిగా క్రిందికి దించి, అగౌరవపరచకుండా, తగిన స్థానంలో జాగ్రత్తగా భద్రపరచవలెను.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section