Type Here to Get Search Results !

Vinays Info

ఆమ్లాలు-క్షారాలు(Acids and Bases) | Chemistry | Vinays Info

కొన్ని పదార్థాలు ఇతర పదార్థాలతో కలిసినప్పుడు వాటి రంగులో మార్పును సూచిస్తాయి. అలాంటి పదార్థాలను ‘సూచికలు(Indicators)’ అని అంటారు.

పసుపు పూసిన కాగితం ఒక ‘సహజ సూచిక’ మందారపువ్వులు, మామిడి ఆకులు, బీట్‌రూట్‌ గన్నేరు పూల రసాల నుంచి కూడా సహజ సూచికలను తయారు చేయవచ్చు.

లిట్మస్‌, లైకేన్‌ అనే థాలోఫైటా వర్గానికి చెందిన మొక్కల నుంచి సేకరించిన రంజనం తటస్థ ద్రావణంలో లిట్మస్‌ రంగు ముదురు ఊదారంగు.

హైడ్రాంజియా, పిటూనియా, జిరేనియం వంటి మొక్కల రంగు పూల ఆకర్షక పత్రాలను కూడా సూచికలుగా ఉపయోగిస్తారు.

Acids(toc)

ఆమ్లాలు(Acids)

  • నీలి లిట్మస్‌ను ఎరుపు రంగులోకి మార్చే పదార్థాలను ‘ఆమ్లాలు’ అని అంటారు.Hint : Blue-Acid-Red(BAR)
  • ఇవి రుచికి పుల్లగా ఉంటాయి.
  • జంతువులు, మొక్కల్లో ఉండే ఆమ్లాలను సహజ ఆమ్లాలు అని అంటారు.
  • చీమ కుట్టినప్పుడు మంటగా అనిపించడానికి కారణం అది విడుదల చేసే ఫార్మిక్‌ ఆమ్లం.
  • ఆమ్లాలు మిథైల్‌ ఆరెంజ్‌ సూచిక లేదా మందార పూల రసాన్ని ఎరుపు రంగులోకి మారుస్తాయి.
  • ఫినాఫ్తలిన్‌ ఆమ్లాలతో రంగులేకుండా ఉంటుంది.

కొన్ని ఆమ్లాలు అవి ఉండే పదార్థాలు

  • ఎసిటిక్‌ ఆమ్లం- వెనిగర్‌
  • ఓలిక్‌ ఆమ్లం- ఆలివ్‌ ఆయిల్‌
  • సిట్రిక్‌ ఆమ్లం- నిమ్మ, నారింజ
  • స్టీరిక్‌ ఆమ్లం- కొవ్వు పదార్థాలు
  • బ్యుటిరిక్‌ ఆమ్లం- వెన్న
  • టార్టారిక్‌ ఆమ్లం- ద్రాక్ష, చింతపండు
  • లాక్టిక్‌ ఆమ్లం- మజ్జిగ, పెరుగు
  • పామాటిక్‌ ఆమ్లం- పామాయిల్‌
  • ఆగ్జాలిక్‌ ఆమ్లం- పాలకూర, టమాట
  • ఎస్కార్టిక్‌ ఆమ్లం- ఉసిరి
  • మాలిక్‌ ఆమ్లం- ఆపిల్‌
  • యూరిక్‌ ఆమ్లం- మూత్రం
  • సహజ ఆమ్లాలతో పాటు కొన్ని రసాయన ఆమ్లాలు ఉన్నాయి. ఉదా: సల్ఫ్యూరిక్‌ ఆమ్లం, హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం, నత్రికామ్లం
  • లాలాజలం, దోసకాయ, శీతల పానీయాలు వంటివి ఆమ్లాలను కలిగి ఉంటాయి.
  • రాగి పాత్రలో ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచినప్పుడు పాత్ర లోపల నీలి ఆకుపచ్చ పొరలు ఏర్పడుతాయి. నిల్వ ఉంచిన పదార్థాల్లో ఉన్న ఆమ్లం రాగితో చర్య జరిపి నీలి ఆకుపచ్చ పొరలను ఏర్పరుస్తుంది.
  • దీనిని నివారించడానికి ‘తగరపు పూత’ పూస్తారు.
  • పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలైన CO2, SO2, NO2 వంటివి వాతావరణంలోని తేమతో చర్య జరిపి ఆమ్లాలను ఏర్పరుస్తాయి. ఇవి వర్షపు నీటితో కలిసి ఆమ్లవర్షాలుగా పడుతాయి.
  • ఆమ్ల వర్షాల వల్ల తాజ్‌మహల్‌ వంటి కట్టడాలకు హాని కలుగుతుంది.
  • కొన్ని సూచికలు ఆమ్ల, క్షార యానకంలో వేర్వేరు వాసనలను ప్రదర్శిస్తాయి. వీటిని సువాసన సూచికలు అంటారు. ఉదా: ఉల్లిపాయలు, వెనీలా, సుగంధ ద్రవ్యం, లవంగ నూనె
  • ఆమ్లాలు లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్‌ వాయువును విడుదల చేస్తాయి.2Hcl+Zn -> Zncl2 + H2
  • ఆమ్లాలను కార్బొనేట్లు, బైకార్బొనేట్లతో చర్య జరిపినప్పుడు CO2, లవణాలను ఏర్పరుస్తాయి. Na2 CO3 +2Hcl -> 2Nacl + H2O + CO2
  • ఆమ్లాలు లోహ ఆక్సైడ్‌లతో చర్య జరిపి లవణం, నీరును ఏర్పరుస్తాయి.Na2O + 2Hcl -> 2Nacl + H2O
  • విలీన ఆమ్లం తయారు చేసేటప్పుడు నీటికి నెమ్మదిగా ఆమ్లాన్ని కలపాలి.

ఆమ్లాలు - కొన్ని ఉపయోగాలు

  • పచ్చళ్ల తయారీలో- ఎసిటిక్‌ ఆమ్లం
  • పులిహోర తయారీలో- సిట్రిక్‌ ఆమ్లం
  • శీతల పానీయాల తయారీలో- కార్బోనిక్‌ ఆమ్లం
  • సిరామరకలను తొలగించడానికి- ఆగ్జాలిక్‌ ఆమ్లం
  • ఎరువుల తయారీ, బ్యాటరీల్లో- సల్ఫ్యూరిక్‌ ఆమ్లం
  • మందులు, రంగుల తయారీలో- హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం
  • పేలుడు పదార్థాల తయారీలో- నత్రికామ్లం

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section