Type Here to Get Search Results !

Vinays Info

ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం | World Computer Literacy Day

 ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం - డిసెంబర్ 2

ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం | World Computer Literacy Day


ఉద్దేశ్యం:

  • కంప్యూటర్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాల గురించి అవగాహన పెంచడం ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం (World Computer Literacy Day) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.


చరిత్ర:

  • దిల్లీకి చెందిన రాజేంద్ర ఎస్‌.పవార్‌, విజయ్‌ కె.తడని లు IIT Delhiలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు.
  • 1981లోనే రానున్న కాలంలో కంప్యూటర్లే ప్రపంచాన్ని శాసిస్తాయనే విషయాన్ని గుర్తించి...కంప్యూటర్‌ వినియోగం నేర్పించేందుకు NIIT(National Institute of Information Technology) అనే సంస్థను నెలకొల్పారు. 1981 డిసెంబర్ 2న డిల్లీలోనే మొదటి శాఖను ప్రారంభించారు.
  • దీని ద్వారా విద్యార్థులకు కంప్యూటర్‌ శిక్షణ నివ్వటం ప్రారంభించారు. 2000 నాటికి ప్రపంచంలోని 40 దేశాల్లో రెండు వేల శాఖలు విస్తరించారు.
  • 2001లో NIIT తన 20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవాన్ని ప్రారంభించింది. 
  • ఈ క్రమంలో 2001 డిసెంబరు 2న ఒకే రోజు ప్రపంచ వ్యాప్తంగా లక్ష మందికి కంప్యూటర్‌ శిక్షణనిచ్చారు. అదే రోజును ప్రపంచ కంప్యూటర్‌ అక్షరాస్యత దినోత్సవంగా ప్రపంచం గుర్తించింది.


ఇతర అంశాలు:

  • దేశంలో 100 శాతం కంప్యూటర్ అక్షరాస్యత సాదించిన తొలి గ్రామం - చామ్రవట్టం (కేరళ)
  • భారత దేశంలో కంప్యూటర్ అక్షరాస్యత కేవలం 6.5%.
  • అందరికి కంప్యూటర్‌ విద్య అందించాలనే లక్ష్యంతో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2002లో ప్రభుత్వ బడుల్లో కంప్యూటర్‌ శిక్షణను ప్రవేశ పెట్టింది. 2008 నుంచి కంప్యూటర్‌ విద్యను NIIT ద్వారా పూర్తిగా ఆధునీకరించింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section