Type Here to Get Search Results !

Vinays Info

Integrated Defence Factory at Zaheerabad

Integrated Defence Factory: దేశంలోనే తొలి రక్షణ వ్యవస్థల కేంద్రం ఎక్కడ ఏర్పాటు కానుంది?

VEM Technologies
తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ సమీపంలోని ఎల్గోయి వద్ద దాదాపు 511 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే తొలి సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రం ఏర్పాటుకు వీఈఎం(వెమ్‌) టెక్నాలజీస్‌ కంపెనీ ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి  కంపెనీకి, తెలంగాణ ప్రభుత్వానికీ మధ్య అక్టోబర్‌ 24న ఒప్పందం కుదిరింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఒప్పందం కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, వెమ్‌ టెక్నాలజీ అధ్యక్షుడు వెంకట్‌రాజు, డీఆర్‌డీవో చైర్మన్‌ సతీశ్‌రెడ్డి, డీఆర్‌డీవో మాజీ చైర్మన్‌ డాక్టర్‌ వీకే సారస్వత్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పాల్గొన్నారు. క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేసేందుకు అనువుగా ఉన్న ఈ కేంద్రం కోసం వెమ్‌ టెక్నాలజీస్‌ రూ.వెయ్యికోట్ల పెట్టుబడి పెట్టనుందని ఐటీ మంత్రి తెలిపారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section