బడిలో గంట మోగింది - Badilo Ganta Mogindi - Popular Telugu Rhymes | Children Rhymes | Bala Geyalu
బడిలో గంట మోగింది
బిర,బిర బడికి వెళ్ళాము
ప్రార్థన శ్రద్దగా చేసాము
క్రమశిక్షణతో మెలిగాము
పాఠాలు పట్టుగా చదివాము
గేయాలు బాగా పాడాము
కధలు చక్కగా విన్నాము
బొమ్మలతో ఆటలాడాము
మద్యాహ్నా బువ్వ తిన్నాము
కబుర్లు ఎన్నో చెప్పుకున్నాము
అందరూ ఒకటై మెలిగాము
మరలా గంట మోగింది
చక,చక ఇంటికి వెళ్ళాము