తెలంగాణ భాషా దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సెప్టెంబరు 9న తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుపబడుతున్న దినోత్సవం. తెలంగాణ రచయిత కాళోజీ నారాయణరావు 100వ జయంతి సందర్భంగా.. కాళోజీ పుట్టినరోజైన సెప్టెంబరు 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
కార్యక్రమాలు
కాళోజీ జయంతి రోజున తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు తోపాటు జిల్లా కేంద్రాల్లో రాష్ట్రవ్యాప్తంగా భాషా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులకు తెలంగాణ భాషపై చర్చాగోష్ఠులు, వ్యాసరచన, ఉపన్యాస, కవితా పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణలో భాషా, సాహిత్యరంగంలో విశేషకృషి చేసిన వారికి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నుండి రాష్ట్రస్థాయి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
కాళోజీ సాహిత్య పురస్కార గ్రహీతలు
2015 - అమ్మంగి వేణుగోపాల్, రచయిత, సాహితీ విమర్శకుడు.
- 2016 - గోరటి వెంకన్న, ప్రజాకవి, రచయిత, గాయకుడు.
- 2017 - డా. సీతారం
- 2018 - అంపశయ్య నవీన్
- 2019 - కోట్ల వెంకటేశ్వరరెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, హోంశాఖ మంత్రి మెహమూద్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి, తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షుడు బాద్మి శివకుమార్, మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణ, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, కాళోజీ ఫౌండేషన్‌కు చెందిన నాగిళ్ల రామశాస్త్రి పాల్గొన్నారు.
2020 - రామా చంద్రమౌళి, కవి, రచయిత. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పురస్కారం అందజేశాడు. సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, డైరెక్టర్ మామిడి హరికృష్ణ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
2021 - పెన్నా శివరామకృష్ణ శర్మ