వైరస్‌లు (Viruses) అతి సూక్ష్మమైన జీవరాశులు. కేవలం కొన్ని నానోమీటర్ల పరిమాణంలో ఉంటాయి (సుమారు 15 నుంచి 600 నానోమీటర్లు).
- మానవులే కాక మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు, బాక్టీరియా ఇలా అన్ని రకాల జీవుల మీద దాడి చేస్తాయి.
- వైరస్‌లు పూర్తిగా అతిథేయి మీద ఆధారపడతాయి. అతిథేయి వెలుపల ఇవి నిర్జీవంగానూ, అతిథేయి శరీరంలో సజీవంగానూ ఉంటాయి.
- సుమారు 119 వైరస్ ప్రజాతులు మానవులలో వ్యాధులను కలుగజేస్తాయి.
- సాధారణంగా వైరస్‌లు గాలి, నీరు, కీటకాలు కుట్టడం వల్ల గాని, జంతువులు కరవడం వల్ల గాని, లైంగిక సంపర్కం ద్వారా గాని మానవులకు సోకుతాయి.
కొన్ని ముఖ్యమైన వైరల్ వ్యాధులు:
సాధారణ జలుబు (Common cold):
- జలుబుకు కారణమైన వైరస్‌ను ‘రైనోవైరస్’ (Rhinovirus) అంటారు.
- శ్వాసనాళంపై భాగంలో వైరస్ దాడి చేయడం వల్ల కలిగే జబ్బు.
- ఈ వైరస్‌లు గాలి ద్వారా మానవునికి సోకుతాయి.
- తుమ్ములు, దగ్గు, కళ్లు ఎరుపెక్కడం, ముక్కు కారడం, తలనొప్పి, జ్వరం రావడం జరుగుతుంది.
- దీనిని ‘ఫ్లూ జ్వరం’ (Flu fever) అని కూడా అంటారు.
- పలు ‘ఆర్థోమిక్సో వైరస్‌లు ఫ్లూనకు కారణం. గాలి ద్వారా ఈ వైరస్‌లు వ్యాపిస్తాయి.
- మానవులలో సాధారణంగా ఫ్లూనకు కారణమయ్యే వైరస్‌లు H1N1, H3N2లు.
- ఊపిరితిత్తులు, నాసికా భాగం, గొంతు భాగం ఈ వ్యాధికి గురవుతాయి.
- అధిక జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, దగ్గు, కండరాల నొప్పులు కలుగుతాయి.
1. బర్డ్ ఫ్లూ (Bird flu):
- దీనిని ‘ఏవియన్ ఇన్‌ఫ్లూయంజా’ అంటారు. H5N1 వైరస్ వల్ల పక్షులకు వచ్చు వ్యాధి.
- పక్షుల నుంచి ఈ వ్యాధి మానవునికి సంక్రమించవచ్చు. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి కూడా సంక్రమించవచ్చు.
- వ్యాధి సోకిన వ్యక్తిలో సాధారణ ఫ్లూ వంటి లక్షణాలు కలుగుతాయి.
- H1N వైరస్ దీనికి కారణం. ఇది ప్రాణాంతక వ్యాధి. గాలి ద్వారా సోకుతుంది.
- మానవుని శ్వాసకోశాలు ఈ వ్యాధికి గురవుతాయి.
- జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి ఈ వ్యాధి లక్షణాలు. ఒళ్లు నొప్పులు, నీరసం కూడా ఉంటాయి. కొంతమందికి వాంతులు, విరేచనాలు కలుగుతాయి.
- వైద్య పరిభాషలో ‘వారిసెల్లా’ (Varicella) అని అంటారు. ఈ వ్యాధిని ‘అమ్మవారు’ అని కూడా పిలుస్తారు.
- ‘వారిసెల్లా జోస్టర్’ వైరస్ ద్వారా సంక్రమిస్తుంది. ఇది అంటు వ్యాధి.
- జ్వరం, దురద, బొబ్బల వంటి రాష్‌లు ఈ వ్యాధి లక్షణాలు.
- ‘టీకా మందు’ వాడి ఈ వ్యాధి నుంచి కాపాడుకోవచ్చు.
- ‘పొంగు వ్యాధి’ అని అంటారు. గాలి ద్వారా సంక్రమిస్తుంది.
- ఈ వ్యాధికి కారణం‘మారిబిల్లీ వైరస్.’
- ఈ అంటు వ్యాధి ప్రధానంగా చిన్న పిల్లలకు సోకుతుంది.
- ఎక్కువ జ్వరం రావడం, కళ్ళు ఎర్రబడడం, దద్దుర్లు ఏర్పడడం, చిన్న చిన్న తెల్ల మచ్చలు (కోప్లిక్ మచ్చలు) నోటి లోపల కనిపించడం జరుగుతాయి. ఈ మచ్చలు తట్టు ఇన్‌ఫెక్షన్ కు సంకేతాలు.
- ‘టీకా మందు’ ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు.
- ‘మిక్సో వైరస్ పెరోటిడస్’ అను వైరస్ దీనికి కారణం.
- ఈ వైరస్ వల్ల పెరోటిడ్ అనబడు లాలాజల గ్రంథులు ఇన్‌ఫెక్షన్‌కు గురవుతాయి.
- లాలాజల గ్రంథుల వాపు, జ్వరం, తలనొప్పి, నీరసం, ఆకలి మందగించడం, బుగ్గలు ఉబ్బడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
- టీకా మందును ఉపయోగించి వ్యాధిని నివారించవచ్చు.
- ఈ వ్యాధిని ‘జర్మన్ మీజల్స్’ అని కూడా వ్యవహరిస్తారు.
- ఇది కూడా ‘పొంగు వ్యాధి’, ‘రుబెల్లా వైరస్’ (Rubella virus) దీనికి కారణం.
- స్వల్ప జ్వరం, శరీరంపై దద్దుర్లు, కందిన ఎరుపు రంగు పొక్కులు ఏర్పడతాయి.
- ‘టీకామందు’ ఉపయోగించి ఈ వ్యాధిని నివారించవచ్చు.
MMR వ్యాక్సిన్:
తట్టు, గవదబిళ్ళలు, రుబెల్లా వ్యాధుల బారి నుంచి రక్షించుకోవడానికి కలిసికట్టుగా ఉత్త్పత్తి చేసిందే ఈ ‘ట్రిపుల్ వ్యాక్సిన్.’
పోలియో వ్యాధి (Polio):
- ‘శిశు పక్షవాతం’ అని కూడా అంటారు. పిల్లల్లో ఎక్కువగా ఈ వ్యాధి కనిపిస్తుంది.
- ‘పోలియో మైలిటస్’ వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
- కలుషిత నీరు, ఆహారం ద్వారా ఈ వైరస్ మానవునికి సోకుతుంది.
- ఈ వైరస్ తాకిడికి నాడీ వ్యవస్థలో భాగమైన చాలక నాడులు దెబ్బతింటాయి. కాళ్ళు, చేతులు చచ్చుబడడం, పక్షవాతానికి గురికావడం ఈ వ్యాధి లక్షణం.
- ‘ఓరల్ పోలియో వ్యాక్సిన్’ (OPV), ‘ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్’ల ద్వారా ఈ వ్యాధిని సమూలంగా నాశనం చేయవచ్చు.
- ‘పిచ్చికుక్క వ్యాధి’ (లేదా) ‘జలభీతి వ్యాధి’ (Hydrophobia) అని కూడా అంటారు.
- ‘లిస్సా వైరస్’ ఈ వ్యాధికి కారణం.
- ఇతర జంతువుల నుంచి మానవునికి సంక్రమిస్తుంది.
- ఈ వ్యాధి సోకిన కుక్కలు, నక్కలు, తోడేళ్లు, పిల్లులు, ఎలుగుబంట్లు మొదలగు జంతువులలో ఈ వైరస్ రక్తంలో ఉంటుంది. ఇలాంటి జంతువుల నుండి కాని లేదా కుక్క మనిషిని కరచినపుడు దాని లాలాజలం నుంచి కాని ఈ వైరస్‌లు మానవుని శరీరంలోకి ప్రవేశించి తొలుత కండరాలు, ఆపైన వెన్నుపాము మీద దాడిచేసి నాశనం కావిస్తాయి.
- జ్వరం, చికాకు, భయం వంటి లక్షణాలు కలుగుతాయి. వెన్నుపాముపై దాడి వల్ల గొంతు, ఛాతీ కండరాలు బిగుతుగా మారుతాయి.
- భయం కలగడం, గొంతు నొప్పి, ఏమీ మింగలేకపోవడం జరుగుతుంది. నీరు తాగడానికి భయపడే పరిస్థితులు కూడా నెలకొంటాయి. ఈ స్థితిని ‘హైడ్రోఫోబియా’ అంటారు.
- డెంగ్యూకు కారణమైన వైరస్‌ను ‘ఫ్లావీ వైరస్’ అంటారు.
- ఆడ ‘ఏడిస్ ఈజిప్టై’ దోమకాటు వల్ల మానవ శరీరంలోకి ఈ వైరస్ ప్రవేశించి డెంగ్యూ వ్యాధిని కలుగ జేస్తుంది.
- అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కీళ్లు, కండరాల నొప్పి, అలసట, వికారం, వాంతు లు, శోషరస వ్యవస్థ దెబ్బతినటం, చర్మంపై దద్దుర్లు, ముక్కు, చిగుళ్ల నుంచి రక్తస్రావం, రక్తంలోని ప్లేట్‌లెట్‌ల సంఖ్య తగ్గడం వంటి లక్షణాలు సంభవిస్తాయి.
- డెంగ్యూ చికిత్సకు ప్రత్యేకంగా మందులు లేవు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని దోమలు చేరకుండా చూసుకోవడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు.
- చికున్‌గున్యాకు కారణమైన వైరస్ ‘ఆల్ఫా వైరస్’. ఇది ‘టోగా విరిడే’ (Toga viridae) కుటుంబానికి చెందినది.
- ‘ఆడ ఏడిస్ ఈజిప్ట్’ దోమ కాటు ద్వారా ఈ వైరస్ మానవుని శరీరంలోకి ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తుంది.
- అకస్మాత్తుగా జ్వరం, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, తీవ్రమైన తలనొప్పి సంభవిస్తాయి. కాళ్లు, చేతులు ముఖ్యంగా మోకాళ్లు నొప్పికి గురవుతాయి. కళ్లు ఎర్రబడడం, శరీరం మీద దద్దుర్లు ఏర్పడతాయి. లింఫ్ నోడ్స్ వాపుకు గురవుతాయి. ఇది చికున్ గున్యా లక్షణం. ఒకొక్కసారి నడవడం కూడా భారమవుతుంది.
- వైద్యుని పర్యవేక్షణలో చికిత్స పొందాలి. పారాసెటిమాల్ వంటి మందులు తాత్కాలిక ఉపశమనానికి వాడవచ్చు.
- పలు రకాల వైరస్‌లు ఈ వ్యాధికి కారణం. వీటిలో ముఖ్యమైనవి హెపటైటిస్ ఎ, బి, సి. వీటిలో హెపటైటిస్-బి అధిక వ్యాప్తిలో ఉంది.
- హెపటైటిస్-బి వల్ల కాలేయం ఇన్‌ఫెక్షన్‌కు గురవుతుంది
- కాలేయపు వాపు, వాంతులు, పచ్చ కామెర్లు ఈ వ్యాధి లక్షణాలు.
- ఈ వ్యాధి ముదిరితే కాలేయం గట్టిపడిపోయి లివర్ కాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
- ఈ వ్యాధి కారక వైరస్‌లు శరీర ద్రవాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తాయి.
- సెక్స్, రక్తమార్పిడి, సూదులు, సిరంజిల మూలంగా వ్యాపిస్తాయి. తల్లి నుంచి బిడ్డకు కూడా ఇది సంక్రమించవచ్చు. కలుషితమైన నీరు, ఆహారం ద్వారా కూడా వ్యాప్తి చెందవచ్చు.
- మానవ స్వేదం, మూత్రం, మలం, తల్లి పాలలో కూడా ఈ వైరస్ ఉంటుంది.
- మన దేశంలో మొదటిసారిగా ‘హెపటైటిస్-బి’ నిర్మూలనకు వ్యాక్సిన్ కనుగొన్న సంస్థ ‘శాంతా బయోటెక్నిక్స్’, హైదరాబాద్.
- వ్యాక్సిన్ పేరు ‘Shanvac-B’ (షాన్‌వాక్-బి).
- ఇది ప్రాణాంతకమైన వ్యాధి. దీనిని ‘ఎబోలా హిమోరేజిక్ జ్వరం’ (లేదా) ‘ఎబోలా’ అని వ్యవహరిస్తారు. ఫిలో వైరస్ ఈ వ్యాధికి కారణం. ఇవి‘ఫిలోవిరిడే’ కుటుంబానికి చెందుతాయి.
- ఈ వైరస్ సోకిన వారిలో 90 శాతం మంది మృత్యువాతకు గురవుతారు.
- రక్తం, వీర్యం, లాలాజలం, చెమట, మూత్రం, మలం వంటి శరీర ద్రవాల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఆహారం, నీరు కూడా ప్రవేశ మార్గాలుగా ఉపయోగపడవచ్చు.
- జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు, వాంతులు, విరేచనాలు, అంతర్గత రక్తస్రావం, చర్మంపై దద్దుర్లు రావడం జరుగుతుంది.
- ఎయిడ్స్ కారక వైరస్ ‘హెచ్.ఐ.వి.(HIV)’. దీనిని‘రిట్రో వైరస్’ అని కూడా అంటారు.
- అసురక్షిత లైంగిక సంపర్కం, రక్తమార్పిడి, తల్లిపాలు, కలుషిత సిరంజీల ద్వారా ప్రధానంగా ఈ వైరస్ వ్యాపిస్తుంది.
- రోగ నిరోధక శక్తిలో కీలకమైన CD4 కణాల మీద ఏఐగ దాడి చేస్తుంది. వీటి సంఖ్య క్షీణించే కొద్దీ, ఇతర వ్యాధి కారకాలు శరీరంలోకి ప్రవేశించి అభివృద్ధి చెందుతాయి.
- శరీరం నుంచి HIV ని పూర్తిగా తొలగించే మందులేవి లేవు. కాని HIVని నియంత్రించే మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని ‘యాంటీ రిట్రో వైరల్ మందులు’ అంటారు. వీటిలో ముఖ్యమైనవి- Azidothymidine, Zidovudine, Lamivudine మొదలగునవి.
AIDS నిర్ధారణ పరీక్షలు:
1) ELISA పరీక్ష
2) Western blot పరీక్ష
3) PCR పరీక్ష