Type Here to Get Search Results !

Vinays Info

అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం (ప్రపంచ వారసత్వ దినోత్సవం)

అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం - International Historic Monuments Day (ప్రపంచ వారసత్వ దినోత్సవం-World Heritage Day) ప్రతి ఏట ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఐక్యరాజ్యసమితిలోని సభ్యదేశాలు వారసత్వ సంపద పరిరక్షణకోసం ఒకరికొకరు వివిధ అంశాలలో పరస్పరం సహకరించుకోవాలన్న ప్రధానలక్ష్యంతో ఈ ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏర్పాటుచేయబడింది.

ప్రపంచ వారసత్వ దినోత్సవం-World Heritage Day
యితర పేర్లుప్రపంచ వారసత్వ దినోత్సవం
జరుపుకొనేవారుఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు
జరుపుకొనే రోజుఏప్రిల్ 18
ఆవృత్తివార్షిక

ప్రారంభం 

ప్రపంచ దేశాలలోని వారసత్వ సంపద పరిరక్షణ అనే అంశంపై 'ఐక్యరాజ్య సమితి' (యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్), 'అంతర్జాతీయ పురాతన కట్టడాలు, స్థలాల పరిరక్షణ సంఘం' సంయుక్త ఆధ్వర్యంలో ఆఫ్రికాలోని ట్యూనీషియాలో 1982, ఏప్రిల్ 18న ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు వారసత్వ సంపద పరిరక్షణకు చేయవలసిన పనులు, నిర్వహించవలసిన కార్యక్రమాల గురించి సలహాలు, సూచనలు ఇచ్చారు. అలా సదస్సు ప్రారంభమైన ఏప్రిల్‌ 18వ తేదీని 'ప్రపంచ వారసత్వ దినోత్సవం'గా ప్రకటించాలని యునెస్కోకి ప్రతిపాదనలు పంపగా,. 1983లో ఆమోదించి ఏప్రిల్ 18వ తేదిని ప్రపంచ వారసత్వ దినోత్సవంగా ప్రకటించింది.

భారతదేశంలో

భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లోని వారసత్వ పరిరక్షణ అంశాల ఆధారంగా 1984, జనవరి 27న అప్పటి భారతదేశ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చైర్మన్‌గా భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ (ఇండియన్ నేషనల్ ట్రస్టు ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ -ఇంటాక్) అనే సంస్థ ఏర్పాటుచేయబడింది. ఈ ఇంటాక్ సంస్థకు దేశవ్యాప్తంగా 190 చాప్టర్లు ఉన్నాయి. దీనికితోడుగా, భారతదేశ వారసత్వ సంపద విలువ, వాటి పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కలిపించేందుకు 'భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ', 'రాష్ట్ర పురావస్తు శాఖ'లు దేశంలో ప్రతి సంవత్సరం వారసత్వ వారంను కూడా నిర్వహిస్తున్నాయి.

ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో భారతదేశ ప్రదేశాలు

భారతదేశం నుండి ఇప్పటివరకు 30 ప్రదేశాలు యూనెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో భారత్ నుండి స్థానం సంపాదించాయి.

సాంస్కృతిక ప్రదేశాలు (24)

  1. ఆగ్రా కోట (1983)
  2. అజంతా గుహలు (1983)
  3. ఎల్లోరా గుహలు (1983)
  4. తాజ్ మహల్ (1983)
  5. కోణార్క సూర్య దేవాలయం (1984)
  6. మహాబలిపురం వద్ద గల కట్టడాల సముదాయం (1984)
  7. గోవా చర్చులు, కాన్వెంట్లు (1986)
  8. ఫతేపూర్ సిక్రీ (1986)
  9. హంపి వద్ద గల కట్టడాల సముదాయం (1986)
  10. ఖజురహో కట్టడాలు (1986)
  11. ఎలిఫెంటా గుహలు (1987)
  12. గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ (1987)
  13. పట్టడకళ్ కట్టడాల సముదాయం (1987)
  14. సాంచిలోని బౌద్ధ కట్టడాలు (1989)
  15. హుమాయూన్ సమాధి (1993)
  16. కుతుబ్ మీనార్ కట్టడాలు (1993)
  17. భారతీయ పర్వత రైల్వేలు (1999)
  18. బోధ గయాలోని మహాబోధి ఆలయ సముదాయం (2002)
  19. భింబెట్కా రాతి గృహాలు (2003)
  20. చంపానేర్ పవాగాద్ ఆర్కియాలజికల్ పార్క్ (2004)
  21. ఛత్రపతి శివాజీ టెర్మినస్ (గతంలో విక్టోరియా టెర్మినస్) (2004)
  22. ఎఱ్ఱకోట (2007)
  23. జైపూర్ జంతర్ మంతర్ (2010)
  24. రాజస్థాన్ హిల్ ఫోర్ట్స్ (2013)

సహజసిద్ధమైన ప్రదేశాలు(Natural Places) (6)

  1. కజీరంగా జాతీయవనం (1985)
  2. కియోలాడియో జాతీయ పార్క్ (1985)
  3. మానస్ జాతీయ అభయారణ్యం (1985)
  4. సుందర్బన్స్ జాతీయ పార్క్ (1987)
  5. నందాదేవి, వాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ (1988)
  6. పశ్చిమ కనుమలు (2012)


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section