Type Here to Get Search Results !

Vinays Info

బాల్ శక్తి పురస్కారాలు-2021 | Bal Shakti Awards

 బాల్ శక్తి పురస్కారాలు-2021 | Bal Shakti Awards

అసాధారణమైన సామర్థ్యాల ఆవిష్కరణలు, విద్యావిషయక విజయాలు, క్రీడలు, కళలు-సంస్కృతి, సామాజిక సేవ, ధైర్యం వంటి రంగాలలో విశేషమైన విజయాలు సాధించిన చిన్నారులకు ఏటా కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన్‌మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’ కింద ‘బాల్ శక్తి పురస్కారాల’ను ప్రదానం చేస్తోంది.

ఈ అవార్డుకు 2021 ఏడాది వివిధ విభాగాల్లో దేశవ్యాప్తంగా 32 మంది చిన్నారులు ఎంపికయ్యారు. అవార్డు విజేతలకు ఒక పతకంతో పాటు, రూ.లక్ష నగదు, ప్రశంసా పత్రం అందిస్తారు.

ఇద్దరు తెలుగు చిన్నారులు...

2021 ఏడాది బాల్ శక్తి పురస్కాలకు ఇద్దరు తెలుగు చిన్నారులు ఎంపికయ్యారు. వీరిద్దరిలో విశాఖ నగరంలోని లాసన్‌‌సబే కాలనీకి చెందిన 12 ఏళ్ల బాలిక అమేయ లగుడు కాగా, మరోకరు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన 13 ఏళ్ల బాలుడు చదలవాడ హేమేష్.

అమేయ: శాస్త్రీయ నృత్యంలో అత్యద్భుత ప్రతిభ కనబరిచినందుకు గాను అమేయకు బాల్ శక్తి పురస్కార్ దక్కింది. నాలుగేళ్ల వయసు నుంచి అమేయ భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుంటోంది. ఇప్పటికే 8 అంతర్జాతీయ, 9 జాతీయ అవార్డులు, 18 రాష్ట్రస్థాయి అవార్డులు సొంతం చేసుకుంది. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, సిలికానాంధ్ర సంస్థ 6,117 మందితో ఏర్పాటు చేసిన అతిపెద్ద కూచిపూడి నృత్య కార్యక్రమంలో భాగమై గిన్నిస్ రికార్డు సైతం సాధించింది.


హేమేష్: అల్జీమర్స్‌తో బాధపడుతున్న తన అమ్మమ్మ ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు హేమేష్ తయారు చేసిన స్మార్ట్ రిస్ట్ బ్యాండ్ పతకాన్ని తెచ్చిపెట్టింది. రోగుల పల్స్, రక్తపోటును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఏదైనా అసాధారణ పరిస్థితి ఎదురైనప్పుడు డాక్టర్‌తోపాటు సంరక్షకులకు స్మార్డ్ రిస్ట్ బ్యాండ్ అలర్ట్ పంపిస్తుంది. రోగి ఆరోగ్య స్థితిని ప్రదర్శించడమే కాకుండా, రోజువారీ నివేదికలను ఆటోమేటిక్‌గా పంపిస్తుంది.

బాల్ శక్తి పురస్కారాలు-2021

సంఖ్య

పేరు

రాష్ట్రపతి

విభాగం

1

అమేయ లగుడు

ఆంధ్రప్రదేశ్

కళలు, సంస్కృతి

2

వ్యోమ్ అహుజా

ఉత్తరప్రదేశ్

కళలు, సంస్కృతి

3

హృదయ ఆర్ కృష్ణన్

కేరళ

కళలు, సంస్కృతి

4

అనురాగ్ రామోలా

ఉత్తరాఖండ్

కళలు, సంస్కృతి

5

తనూజ్ సమద్దర్

అస్సాం

కళలు, సంస్కృతి

6

వెనిష్ కీషమ్

మణిపూర్

కళలు, సంస్కృతి

7

సౌహర్ద్య దే

పశ్చిమ బెంగాల్

కళలు, సంస్కృతి

8

జ్యోతి కుమారి

బీహార్

ధైర్యం

9

కున్వర్ దివ్యాన్ష్ సింగ్

ఉత్తరప్రదేశ్

ధైర్యం

10

కామేశ్వర్ జగన్నాథ్ వాగ్మారే

మహారాష్ట్ర

ధైర్యం

11

రాకేశ్‌కృష్ణ కె

కర్ణాటక

ఆవిష్కరణ

12

శ్రీ‌నాబ్ మౌజేష్ అగర్వాల్

మహారాష్ట్ర

ఆవిష్కరణ

13

వీర్ కశ్యప్

కర్ణాటక

ఆవిష్కరణ

14

నామ్య జోషి

పంజాబ్

ఆవిష్కరణ

15

ఆర్కిత్ రాహుల్ పాటిల్

మహారాష్ట్ర

ఆవిష్కరణ

16

ఆయుష్ రంజన్

సిక్కిం

ఆవిష్కరణ

17

హేమేష్ చదలవాడ

తెలంగాణ

ఆవిష్కరణ

18

చిరాగ్ భన్సాలీ

ఉత్తరప్రదేశ్

ఆవిష్కరణ

19

హర్మన్‌జోత్ సింగ్

జమ్మూ,కశ్మీర్

ఆవిష్కరణ

20

మొహద్ షాదాబ్

ఉత్తరప్రదేశ్

విద్య

21

ఆనంద్

రాజస్థాన్

విద్య

22

అన్వేష్ శుభం ప్రధాన్

ఒడిశా

విద్య

23

అనుజ్ జైన్

మధ్యప్రదేశ్

విద్య

24

సోనిత్ సిసోలేకర్

మహారాష్ట్ర

విద్య

25

ప్రసిద్ధి సింగ్

తమిళనాడు

సామాజిక సేవ

26

సవితా కుమారి

జార్ఖండ్

క్రీడలు

27

అర్షియా దాస్

త్రిపుర

క్రీడలు

28

పాలక్ శర్మ

మధ్యప్రదేశ్

క్రీడలు

29

మహ్మద్ రఫీ

ఉత్తరప్రదేశ్

క్రీడలు

30

కామ్య కార్తికేయన్

మహారాష్ట్ర

క్రీడలు

31

ఖుషి చిరాగ్ పటేల్

గుజరాత్

క్రీడలు

32

మంత్ర జితేంద్ర హర్ఖని

గుజరాత్

క్రీడలు


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section