1. అగ్ని-1 క్షిపణిని ఏ దేశాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించారు? పాకిస్థాన్.
2. సమగ్ర నిర్ధేశిక క్షిపణి అభివృద్ధి కార్యక్రమం (IGMDP)లో భాగంగా జరిపే పరీక్షలను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) చాందీపూర్ కేంద్రం నుంచి నిర్వహిస్తున్నది. అయితే ఈ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశా.
3. ఏ దేశం ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని 2000-2500 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అగ్ని-2 క్షిపణిని అభివృద్ధి చేశారు? పశ్చిమ చైనా, ఆసియా.
4. భారతదేశం చేపట్టిన క్షిపణి కార్యక్రమం పేరేమిటి? ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (IGMDP).
5. భారతదేశం అమ్ముల పొదిలోని మధ్యంతర శ్రేణి (ఇంటిగ్రేటెడ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ (IRBM ) బాలిస్టిక్ క్షిపణి ఏది? అగ్ని
6. 1989లో మొట్టమొదటిసారిగా పరీక్షించిన అగ్ని-1 క్షిపణి ఎంత దూరంలోని లక్ష్యాలను చేధించగలదు? 700-80 కిలోమీటర్లు.
7. ఒక అణ్వస్త్రాన్ని మోసుకుపోగల అగ్ని-1పేలోడ్ సామర్థ్యం ఎంత? 1000 కిలోలు.
8. 3500-5000 కిలోమీటర్ల పరిధి ఉన్న అగ్ని-3 క్షిపణి భారతదేశ అణు రక్షణ కార్యక్రమంలోని అతి ముఖ్యమైన అస్త్రం. ఈ క్షిపణిని ఏ దేశాన్ని పరిగణలోకి తీసుకుని వృద్ధి చేశారు? చైనా.
9. అగ్ని క్షిపణులను ఛేదించగల లక్ష్యాలు ఏ కోవలోకి వస్తాయి? ఉపరితలం నుంచి ఉపరితలం లక్ష్యాలు.
11. దగ్గరి పరిధి ఉపరితలం నుంచి ఉపరితలం క్షిపణి శ్రేణి పేరు? పృథ్వి.
12. పృథ్వి క్షిపణి నౌకాదళ రూపాంతరం పేరు? ధనుష్.
13. పృథ్వి-1 క్షిపణి పరిధి ఎంత? 150 కిలోమీటర్లు.
14. పృథ్వి-1 ఎన్ని కిలోల అణు వార్‌హెడ్ (అణ్వస్త్రం)ను మోసుకెళ్లగలదు? 1000.
15. పృథ్వి-1ను త్రివిధ దళాలలో ఏ దళానికి ఉద్దేశించి రూపొందించారు? భారత సైన్యం (ఆర్మీ).
16. భారత వాయుసేన కోసం అభివృద్ధి పరిచిన పృథ్వి రకం ఏది? పృథ్వి-2.
17. పృథ్వి-2 పేలోడ్ పరిధి ఎంత? 500 కిలోలు, 250 కిలోమీటర్లు.
18. భారత సైన్యం (ఆర్మీ), వాయుసేన (ఎయిర్‌ఫోర్స్) రెండింటికీ సేవలందిస్తున్న పృథ్వి ?క్షిపణుల పేర్లు? పృథ్వి-2, పృథ్వి-3
19. పృథ్వి శ్రేణిలోని ఏ క్షిపణికి జలాంతర్గాముల కోసం అభివృద్ధి చేశారు? సాగరిక (పరిధి 700 కిలోమీటర్లు)
20. పృథ్వి-3 పరిధి, పేలోడ్ సామర్థ్యాలు వరుసగా? 1000 కిలోలు, 350 కి.మీ
21. శత్రువు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను మార్గ మధ్యంలోని నిర్వీర్యం చేయనున్న క్షిపణి ఏది? ప్రద్యుమ్న
22. భారతదేశం తలపెట్టిన క్షిపణి కార్యక్రమంలో అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్?
ఆకాష్ క్షిపణి ప్రాజెక్ట్
23. భూమి (ఉపరితలం) నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఆకాష్ క్షిపణి పరిధి ఎంత? 30 కి.మీ.
24. మాక్ 2.5 (మ్యాక్ 2.5) వేగంతో దూసుకుపోయే ఆకాష్ క్షిపణి ఏ రకానికి చెందింది? సూపర్ సోనిక్ క్షిపణి
25. సూర్య క్షిపణి లక్షిత పరిధి ఎంత? 8000-12000 కిలోమీటర్లు.
26. 1998లో మొదలై 2006లో ముగిసిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ప్రాజెక్ట్‌ను భారతదేశం, ఏ దేశం కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? రష్యా
27. బ్రహ్మోస్ పూర్తి పేరు? బ్రహ్మపుత్ర (భారత్), మాస్క్‌వా (రష్యా) ఈ రెండూ రెండు దేశాలకు చెందిన ప్రధాన నదులు. వీటిపేరు మీద బ్రహ్మోస్‌ను పిలుస్తారు.
28. అమెరికాకు చెందిన సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి హార్పూన్ కంటే మూడున్నర రెట్ల వేగంతో లక్ష్యాన్ని ఛేధించగల, బ్రహ్మోస్ క్షిపణి ప్రత్యేకత ఏమిటి? ఈ క్షిపణిని జలాంతర్గాములు, యుద్ధనౌకలు విమానాల నుంచే కాక ఉపరితలం నుంచి కూడా ప్రయోగించవచ్చు. ప్రస్తుతం బ్రహ్మోస్ ప్రపంచంలోకెల్లా అత్యంత వేగమైన క్రూయిజ్ క్షిపణి.
29. ప్రస్తుతం లేబొరేటరీ పరీక్షల్లో ఉన్న బ్రహ్మోస్-2 ఏ రకానికి చెందిన క్షిపణి?
హైపర్ సోనిక్ రకం, మాక్ 6-8 వేగంతో దూసుకెళ్లే ఈ రకం క్షిపణి ధ్వని వేగం కన్నా 8 రెట్లు వేగంతో ప్రయాణిస్తుంది.
30. బ్రహ్మోస్-1 క్షిపణికి ఎన్ని కిలోమీటర్ల రేంజ్ పరిధి ఉంది? 290
31. ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే 'ఆకాష్ క్షిపణి, అలాగే బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి ఈ రెండింటికీ గమనానికి ఉపయోగించే టెక్నాలజీ ఏది? ర్యాంజెట్
32. ఆకాష్ క్షిపణిని ప్రయోగించేందుకు వాడే యుద్ధ ట్యాంకు ఏది? టి-72
33. తొమ్మిది కి.మీ పరిధి, 5.5 కేజీల పేలోడ్‌తో ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణి పేరు? త్రిశూల్ (ప్రస్తుతం ఈ క్షిపణి ప్రాజెక్టు ఆగిపోయింది)
34. భారత్‌లో ఉన్న ట్యాంక్ విధ్వంసకర క్షిపణి ఏది? నాగ్
35. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ పని చేసే థర్డ్ జనరేషన్ నాగ్ క్షిపణి పరిధి ఎంత? 3-7 కిలోమీటర్లు.
36. భారత సైన్యం కోసం అభివృద్ధి చేసిన షార్ట్ రేంజ్ (600 కిలోమీటర్లు) హైపర్‌సోనిక్,
ఉపరితలం నుంచి ఉపరితలంపై ప్రయోగించే క్షిపణి ? శౌర్య
37. శౌర్య క్షిపణి జలాంతర్గాముల కోసం కూడా అభివృద్ధి చేశారు. ఇలా నౌకాదళం కోసం రూపాంతరం చేసిన 'శౌర్య'ను ఏ పేరుతో వ్యవహరిస్తున్నారు? సాగరిక
38. షినాకా రాకెట్ వ్యవస్థకూ, పృథ్వి క్షిపణి శ్రేణికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు డిఆర్‌డిఓ రూపొందించిన, 150 కిలోమీటర్ల పరిధి ఉన్న క్షిపణి పేరేమిటి? ప్రహార్
39. ఇప్పటివరకూ పృథ్వీ శ్రేణిలో ఎన్ని క్షిపణులను పరీక్షించారు? 3
40. 1988లో భారతదేశం మొదటిసారి తన సొంత పరిజ్ఞానంతో రూపొందించిన ఏ క్షిపణిని శ్రీహరికోటలోని షార్ రాకెట్ కేంద్రం నుంచి పరీక్షించింది? పృథ్వీ
41. ప్రస్తుతం మన శాస్త్రవేత్తల పరిశోధనలో ఉన్న అగ్ని-5 క్షిపణి పరిధి ఎన్ని కిలోమీటర్లు? 5000
42. 5000 కిలోమీటర్ల పైన పరిధి ఉన్న క్షిపణులను ఏ విధంగా వర్గీకరిస్తారు?
ఖాండాంతర బాలిస్టిక్ క్షిపణులు (ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ -ICBM )
43. ప్రస్తుతం భారతదేశం అమ్ముల పొదిలో ఉన్న ఐసిబిఎమ్ పేరేమిటి?
ఏమీ లేవు
44. శ్రీహరికోటలోని రెండు లాంచ్ ప్యాడ్‌ల నుంచి ఏటా ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగించవచ్చు? 6
45. ఇన్‌శాట్ పూర్తి పేరు? ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్
46. మెట్‌శాట్ అంటే ఏమిటి? వాతావరణ ఉపగ్రహం
47. 1988లో ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ వ్యవస్థలో ప్రస్తుతం ఎన్ని ఉపగ్రహాలు వాడుకలో ఉన్నాయి? 10.
48. ఇన్‌శాట్ శ్రేణి ఉపగ్రహాలలో ఇస్రో ఇప్పటివరకూ ఎన్నింటిని ప్రయెగించింది? 24
49. ఎడ్యుశాట్ ఉపగ్రహం ప్రధాన లక్ష్యం? దూరవిద్య
50. మొట్టమొదటి ఇన్‌శాట్ ఉపగ్రహాన్ని (ఇన్‌శాట్ 1-ఎ) రోదసీలోకి ప్రయోగించిన తేదీ?
1982, ఏప్రిల్ 10
51. ఇన్‌శాట్ శ్రేణికి చెందిన ఉపగ్రహాలు ప్రధానంగా ఏ రకానికి చెందుతాయి? జియోస్టేషనరీ.
52. భారతదేశంలో ఏకైక ఉపగ్రహ ప్రయోగ కేంద్రం పేరు? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్-శ్రీహరికోట).
53. వ్యవసాయం, పట్టణ ప్రణాళిక రూపకల్పన, సముద్రతీర ప్రాంత పటాల రూపకల్పన మొదలుకొని టెలిమెడిసిన్ వరకూ వివిధ రంగాల్లో ఉపయోగించే ఉపగ్రహ వ్యవస్థ పేరు?
ఐఆర్‌ఎస్ ఉపగ్రహ వ్యవస్థ.
54. ఇన్‌శాట్, ఐఆర్‌ఎస్ ఉపగ్రహ వ్యవస్థల సేవలు రెండింటినీ కలుపుకుని ప్రభుత్వం ఒక నూతన పథకాన్ని ప్రారంభించింది. దాని పేరేమిటి?
విలేజ్ రిసోర్స్ సెంటర్. విఆర్‌సిలు దేశవ్యాప్తంగా 500 కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి.
55. ఇప్పటివరకూ ఇస్రో ప్రయోగించిన 44 పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పిఎస్‌ఎల్‌వి) ప్రయోగాల్లో విఫలమైనవి ఎన్ని? 3
56. ఇప్పటివరకూ ఇస్రో ప్రయోగించిన 12 జిఎస్‌ఎస్‌వి (జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ ) ప్రయోగాల్లో ఎన్ని విజయవంతమైయ్యాయి? 7
57. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ అలాగే ఈ-కామర్స్, ఈ-గవర్నెన్స్ వంటి సేవలకు మూలస్తంభమైన (వెరీ స్మాల్ అపెర్చూర్ టెర్మినల్ -విశాట్) పరిజ్ఞానం ఏ ఉపగ్రహ వ్యవస్థ ద్వారా నడుస్తుంది? ఇన్‌శాట్ వ్యవస్థ.
58. భారతీయ అంతరిక్ష శాఖ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్), డాట్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్), భారత వాతావరణ శాఖ, ఆకాశవాణి, దూరదర్శన్‌ల ఉమ్మడి సంయుక్త సంస్థ ఏర్పడిన ఉపగ్రహ వ్యవస్థ ఏది? ఇన్‌శాట్ వ్యవస్థ.
59. ఇన్‌శాట్ వ్యవస్థలోని ఉపగ్రహాల్లో ప్రస్తుతం ఉన్న ఉపగ్రహాల సంఖ్య ఎంత? 11
60. శాట్‌కామ్ అంటే ? శాటిలైట్ కమ్యూనికేషన్ పరిజ్ఞానం.
61. శాట్‌కామ్ పరిజ్ఞానం ప్రధానమైన గ్రామ్‌శాట్ కార్యక్రమం ఉద్దేశించిన లక్ష్యం ఏమిటి?
రాష్ట్ర స్థాయిలో రాజధానిని, జిల్లాలను, బ్లాకులను (మండలాలను) అనుసంధానం చేయటం.
62. 2011, ఏప్రిల్ 20న ప్రయోగించిన పిఎల్‌ఎల్‌వి-16 ఏయే ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టింది? రిసోర్స్‌శాట్-2, యూత్‌శాట్, ఎక్స్-శాట్.
63. రిసోర్స్‌శాట్-1కు కొనసాగింపుగా ప్రయోగించిన ఉపగ్రహం పేరు? రిసోర్స్‌శాట్-2.
64. డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) సేవలు ఏ ఉపగ్రహ శ్రేణి ద్వారా అందిస్తున్నారు?
ఇన్‌శాట్ 4 శ్రేణి.
65. పూర్తిగా వాతావరణ అంచనాలకే అంకితమైన అపగ్రహం పేరు? కల్పన-1.
66. 1981, మే 31న సార్ సెంటర్ శ్రీహరికోట నుంచి ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం పేరు? ఆర్‌ఎస్-డి1
67. 1981, నవరంబర్ 20న ప్రయోగించిన భాస్కర-2 ఏ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించారు? వోల్గాగ్రాడ్, రష్యా
68. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొంది 1988, మార్చి 17న సోవియట్ యూనియన్‌లో బైకనూర్ కాస్మోడ్రోం నుంచి నింగికెగసిన మొట్టమొదటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం పేరు?
ఐఆర్‌ఎస్-1ఎ
69. సముద్ర అధ్యయనానికి ఉపయోగించే ఐఆర్‌ఎస్-పి4 ఉపగ్రహానికి ఉన్న మరో పేరు? ఓషన్‌శాట్.
70.ఐఆర్‌ఎస్ శ్రేణిలోని ఐఆర్‌ఎస్-పి6కు ఉన్న మరో పేరు? రిసోర్స్‌శాట్-1
source : నవతెలంగాణ దినపత్రిక