Type Here to Get Search Results !

Vinays Info

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం | International Nurses Day

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మే 12న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. వైద్యరంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారు.ప్రజల ఆరోగ్యరక్షణలో నర్సులు అందించిన తోడ్పాటును ఈ దినోత్సవంనాడు గుర్తుచేసుకుంటారు.

ఫ్లోరెన్స్ నైటింగేల్ 1820, మే 12న ఇటలీలో జన్మించింది. 1853న లండన్‌ లోని ఓ స్త్రీల ఆస్పత్రిలో సూపరిండెంట్‌గా చేరిన నైటింగేల్, 1854లో క్రిమియా యుద్ధంలో టర్కీలో గాయపడిన సైనికులకు సేవలు చేయడానికి నర్సుల బృందాన్ని తీసుకొని వెళ్ళింది. 1859లో 'నోట్స్‌ ఆన్‌ నర్సింగ్‌' అనే పుస్తకాన్ని ప్రచురించిన నైటింగేల్‌, ప్రపంచంలోనే మొదటి నర్సుల శిక్షణ కాలేజీని కూడా స్థాపించింది. నైటింగేల్‌ సేవలను గుర్తించిన 'ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నర్సెస్‌' సంస్థ 1965 నుండి నైటింగేల్‌ పుట్టినరోజైన మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రకటించారు.

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం | International Nurses Day

 

Post a Comment

2 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. https://vinaysinfo.blogspot.com/2020/05/international-nurses-day.html

    ReplyDelete
  2. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
    https://vinaysinfo.blogspot.com/2020/05/international-nurses-day.html

    ReplyDelete

Top Post Ad

Below Post Ad

Ads Section