Type Here to Get Search Results !

Vinays Info

జిల్లా పరిషత్ నిర్మాణం -విధులు

కేంద్రస్థాయిలో పట్టణ ప్రభుత్వాలను 3 మంత్రిత్వశాఖలు నియంత్రిస్తున్నాయి. అవి.. మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్‌మెంట్ (పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ): 1985లో రాజీవ్‌గాంధీ దీన్ని ఏర్పాటు చేశారు. ఇది దేశంలోని పట్టణ ప్రభుత్వాలను నియంత్రిస్తుంది.మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (రక్షణ మంత్రిత్వ శాఖ): ఇది కంటోన్మెంట్ బోర్డులను నియంత్రిస్తుంది.మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్: ఇది కేంద్రపాలిత ప్రాంతాల్లోని పట్టణ ప్రభుత్వాలను నియంత్రిస్తుంది.

జిల్లా పరిషత్

- పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నతస్థాయి సంస్థ జిల్లా పరిషత్
- జిల్లాలోని ప్రాదేశిక నియోజకవర్గాల నుంచి ఎన్నికయ్యే జడ్పీటీసీలతో జిల్లా పరిషత్ నిర్మితమవుతుంది.
- ప్రతి మండల పరిషత్‌ను ఒక జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గంగా (జడ్పీటీసీ) పరిగణిస్తారు.
- జడ్పీటీసీ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికపై నిర్వహిస్తారు.
- జడ్పీ స్థానాల్లో కొన్నింటిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు కేటాయిస్తారు.
- జడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకొని నిర్ణయిస్తారు.
- జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్లు కల్పిస్తారు.
- మొత్తం స్థానాల్లో 1/3వ వంతు మహిళలకు, 1/3వ వంతు బీసీలకు కేటాయిస్తారు.
- జడ్పీటీసీకి పోటీచేసే సాధారణ అభ్యర్థులు రూ.5000, ఎస్సీ, ఎస్టీలు రూ.2500 డిపాజిట్‌గా చెల్లించాలి. - జడ్పీటీసీగా పోటీచేసే అభ్యర్థి వ్యయపరిమితి రూ.2 లక్షలు.
- జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్లను జడ్పీటీసీలు ఎన్నుకుంటారు.
- ఎక్స్ అఫీషియో సభ్యులకు ఈ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేదు.
- జడ్పీ చైర్మన్ పదవికి రిజర్వేషన్లు వర్తిస్తాయి.
- రాష్ర్టాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు నిర్ణయిస్తారు.
- వైస్ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు వర్తించవు.
- జిల్లా పరిషత్ చైర్మన్ నెలసరి గౌరవ వేతనం తెలంగాణలో రూ.1,00,000, ఆంధ్రప్రదేశ్‌లో రూ.40,000.
- జడ్పీటీసీ గౌరవవేతనం తెలంగాణలో రూ.10,000, ఆంధ్రప్రదేశ్‌లో రూ.6,000.
- జిల్లా పరిషత్‌కు చైర్మన్ అధ్యక్షులు. చైర్మన్ లేకపోతే వైస్ చైర్మన్ అధ్యక్షులు.
- చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు బహిరంగ ఓటు విధానంలో అంటే చేతులెత్తడం ద్వారా జరుగుతాయి.
- సమానంగా ఓట్లు వచ్చినప్పుడు లాటరీ పద్ధతిలో ఎన్నుకుంటారు.
- జడ్పీ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన జరుగుతున్నందున విప్ జారీచేయవచ్చు.
- జిల్లాలోని మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ), జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, కో ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు, గ్రంథాలయ సంస్థల చైర్మన్, కలెక్టర్ శాశ్వతమైన ఆహ్వానిత సభ్యులు.
- మైనార్టీలకు చెందిన ఇద్దరు సభ్యులను కో ఆప్ట్ చేసుకోవచ్చు.
- జిల్లాలోని ఎమ్మెల్యేలు, లోక్‌సభ సభ్యులు, ఓటర్లుగా ఉన్న రాజ్యసభ, విధానపరిషత్ సభ్యులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా సభలో పాల్గొనవచ్చు. కానీ ఓటుహక్కు ఉండదు.
- చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు.
- చైర్మన్, వైస్ చైర్మన్లపై పదవీకాలంలో ఒక్కసారి మాత్రమే ఈ తీర్మానం పెట్టాలి.
- 2/3వ వంతు సభ్యుల సంతకాలతో నోటీసును కలెక్టర్, సీఈవోలకు అందించాలి. ఆ నోటీసును రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌కు కూడా ఒక కాపీని పంపించాలి.
- సగానికంటే ఎక్కువ మంది హాజరై సాధారణ మెజారిటీతో ఆమోదించాలి.
- కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు నిధులను విడుదల చేసేటప్పుడు జిల్లాను యూనిట్‌గా ఎంపికచేసి బదిలీ చేస్తారు.
- జిల్లా పరిషత్, జిల్లాలోని పంచాయతీరాజ్ సంస్థలన్నింటినీ సమన్వయం చేయాలి.

విధులు

1. జిల్లా సమగ్ర అభివృద్ధికి కావాల్సిన ప్రణాళికలు రూపొందించడం
2. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య అభివృద్ధి విషయంలో అసమానతలను రూపుమాపడం
3. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నిరోధించడం
4. పట్టణాల్లోని సౌకర్యాలను గ్రామీణ ప్రాంతాల్లోనూ కల్పించడం
5. చిన్నతరహా, కుటీర పరిశ్రమల అభివృద్ధి
6. వ్యవసాయం, సాగు, తాగునీరు అంశాలపై దృష్టి కేంద్రీకరించడం

డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ (డీఆర్సీ)

- జడ్పీ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై సమీక్షించడానికి ఏర్పాటుచేసే సమావేశమే డీఆర్సీ సమావేశం.
- జడ్పీ సాధారణ సమావేశాలకు హాజరయ్యే వారంతా ఈ సమావేశాలకు హాజరవుతారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఈ సమావేశాలకు అధ్యక్షులు.
- ప్రభుత్వ పథకాల అమలుతీరు, సాధారణ సమస్యలు, జిల్లా అవసరాల దృష్ట్యా డీఆర్సీ చేసే తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తారు.
- రెండంచెల పంచాయతీరాజ్ విధానాన్ని అనుసరిస్తున్న రాష్ర్టాలు- జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, అసోం, ఒడిశా.
- నాలుగంచెల విధానాన్ని అనుసరిస్తున్న ఏకైక రాష్ట్రం-పశ్చిమబెంగాల్
- క్షేత్ర పంచాయత్ అనే మాధ్యమిక వ్యవస్థగల రాష్ట్రం- ఉత్తరప్రదేశ్
- జనపరిషత్ అనే మాధ్యమిక వ్యవస్థ కలిగిన రాష్ట్రం- మధ్యప్రదేశ్
- ఆంచలిక పరిషత్ అనే మాధ్యమిక వ్యవస్థను కలిగిన రాష్ట్రం- పశ్చిమ బెంగాల్
- గుజరాత్, రాజస్థాన్ వంటివి తాలూకా/బ్లాక్ పంచాయ తీలకు అధిక ప్రాధాన్యమిచ్చాయి. మహారాష్ట్ర, తమిళనాడు జిల్లాలకు అధిక ప్రాధాన్యమిచ్చాయి.74వ రాజ్యాంగ సవరణ - నగర పంచాయతీలు పూర్వరంగం
- పట్టణ పరిపాలనకు పునాది అయిన వ్యవస్థ మున్సిపాలిటీ.
- మున్సిపాలిటీ అనేది మున్సిపీయం అనే రోమన్ పదం నుంచి ఉద్భవించింది. అంటే సంఘటితత్వం అని అర్థం.
- సింధు నాగరికతను పట్టణ నాగరికతగా పేర్కొనవచ్చు. ప్రణాళికాబద్ధమైన రోడ్లు, ఇండ్ల నిర్మాణం ఉంది.
- కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో పాటలీపుత్ర పట్టణాన్ని వర్ణించాడు.
- మెగస్తనీస్ తన ఇండికా అనే గ్రంథంలో పాటలీపుత్ర పట్టణ ప్రణాళిక గురించి వివరించాడు.
- మౌర్యులు, గుప్తులు, మొగల్‌లు నగరపాలనకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు.
- షేర్షా సూర్ గ్రాండ్ ట్రంక్ రోడ్డును నిర్మించాడు.
- క్రీస్తు పూర్వం 500 నాడే భారతదేశంలో 16 నగర రాజ్యాలు ఉన్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తున్నది.
- ఆనాటి స్థానిక వ్యవస్థలను సభలు, సమితులు అని పిలిచేవారు.
- 30 మందితో కూడిన నగరపాలక సంస్థ ప్రజలకు కావాల్సిన అవసరాలన్నింటిని తీర్చేది.
- ఆధునిక కాలంలో 1687లో మొదటిసారిగా మద్రాస్ పట్టణానికి తొలి మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. 1726లో బొంబాయి, కలకత్తాలు కూడా కార్పొరేషన్లుగా ఏర్పడినాయి.
- 1793 చార్టర్ చట్టం ప్రకారం నగరపాలక సంస్థలకు చట్టబద్ధతను కల్పించారు.
- దేశంలో మొదటి పట్టణాభివృద్ధి సంస్థ అయిన ఢిల్లీ 1964లో ఏర్పాటయ్యింది.
- దేశంలో వివిధ ప్రాంతాల్లో సాయుధ బలగాల స్థావరాలు ఉన్నాయి. వాటిని కంటోన్మెంట్స్ అంటారు. ఈ సాయుధ దళాలకు పౌరసదుపాయాలను కల్పించడానికి కేంద్రప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డులను ఏర్పాటు చేస్తుంది.
- కేంద్రస్థాయిలో పట్టణ ప్రభుత్వాలను 3 మంత్రిత్వశాఖలు నియంత్రిస్తున్నాయి. అవి..
1. పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ: 1985లో రాజీవ్‌గాంధీ దీన్ని ఏర్పాటు చేశారు. ఇది దేశంలోని పట్టణ ప్రభుత్వాలను నియంత్రిస్తుంది.
2. రక్షణ మంత్రిత్వశాఖ: ఇది కంటోన్మెంట్ బోర్డులను నియంత్రిస్తుంది.
3. మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్: ఇది కేంద్రపాలిత ప్రాంతాల్లోని పట్టణ ప్రభుత్వాలను నియంత్రిస్తుంది.

స్థాయీ సంఘాలు

- ప్రతి జిల్లా పరిషత్‌లో 7 స్థాయీ సంఘాలు పనిచేస్తాయి. స్థాయీ సంఘాల్లో సభ్యుల సంఖ్య అయా జిల్లాల్లోని జడ్పీటీసీ సభ్యుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.
- ముఖ్యంగా నిర్మాణాలు, సాధారణ అభివృద్ధి, సంక్షేమం, విద్య, మహిళ, బలహీనవర్గాల సంక్షేమం, అభివృద్ధి పనులకు సంబంధించిన సంక్షేమ సంఘాలు పనిచేస్తాయి.
- స్థాయీ సంఘాలు రెండు నెలలకు ఒకసారి తప్పనిసరిగా సమావేశం కావాలి. స్థాయీ సంఘాలు కేవలం సలహా సంఘాలు మాత్రమే.
- జిల్లా పరిషత్ సమావేశాలు నెలకోసారి తప్పనిసరిగా జరగాలి. పార్లమెంటు, శాసనసభ సమావేశాలను దృష్టిలో ఉంచుకొని జడ్పీ సమావేశాలు నిర్వహించాలి.
- జిల్లా పరిపాలనలో అత్యంత కీలక అధికారి అయిన కలెక్టర్ సాధారణ పరిపాలనా విభాగానికి చెందుతారు. రాష్ర్ట ప్రభుత్వానికి జిల్లాలో కలెక్టర్ కండ్లు, చెవులు, చేతులుగా పనిచేస్తాడు.
- రాష్ర్ట ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించే కలెక్టర్ జిల్లా మెజిస్టీరియల్ బాధ్యతలను కూడా నిర్వహిస్తారు.

డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డ్

- జిల్లా ప్రణాళికా బోర్డు రాజ్యాంగబద్ధమైనది.
- డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డ్ మొత్తం సభ్యుల సంఖ్య 30.
- జిల్లా పరిషత్ చైర్మన్, డ్రిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డు చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
- డ్రిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డు కార్యదర్శి జిల్లా కలెక్టర్.
- నలుగురు సభ్యుల్ని రాష్ర్ట ప్రభుత్వం నియమిస్తుంది.
- 24 మంది సభ్యులు జిల్లాలోని గ్రామీణ, పట్టణ, జనాభా నిష్పత్తిని అనుసరించి పురపాలక, నగరపాలక సంస్థలకు చెందిన సభ్యులు, పంచాయతీరాజ్ సంస్థల ప్రతినిధులే (సర్పంచ్‌లు) నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిన ఎన్నుకుంటారు.
- ప్రణాళికా బోర్డు తమ నివేదికను రాష్ర్ట ప్రభుత్వానికి సమర్పిస్తుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section