Type Here to Get Search Results !

Vinays Info

పట్టణ, నగరపాలక సంస్థలు

ghmc-office

- ప్రకరణ 243(వై): ఆర్థికసంఘం నియామకం

1. ఆర్థిక సంఘం నిర్మాణం, సభ్యుల నియామకం, వారి అర్హతలు, పదవీకాలం మొదలైనవాటికి సంబంధించి రాష్ర్ట శాసన నిర్మాణశాఖ చట్టాలను రూపొందించవచ్చు.
2. ఈ నిబంధన ప్రకారం ప్రతి రాష్ర్టానికి ఒక రాష్ర్ట ఆర్థిక సంఘం ఉండాలి.
3. ఆర్థికసంఘంలో ఒక అధ్యక్షుడు, నలుగురు సభ్యులు ఉంటారు.
4. వీరిని గవర్నర్ నియమిస్తారు.
5. వీరు తమ రాజీనామాలను గవర్నర్‌కు సమర్పించాలి. పదవీకాలం గవర్నర్ సూచించిన (నిర్ణయించిన) మేరకు, అంటే ఐదేండ్ల వరకు ఉంటుంది.
6. రాష్ర్ట ప్రభుత్వానికి, మున్సిపాలిటీల మధ్య ఆర్థిక వనరులను పంపిణీ చేస్తుంది.
7. మున్సిపాలిటీలకు ఇవ్వాల్సిన సహాయక గ్రాంటులను సకాలంలో అందేటట్లు చూస్తుంది.
8. రాష్ర్ట ఆర్థిక సంఘం తన నివేదికను గవర్నర్‌కు సమర్పిస్తుంది.
9. గవర్నర్ ఆ నివేదికను రాష్ర్ట శాసన నిర్మాణశాఖకు సమర్పిస్తారు.

ప్రకరణ 243(జడ్): ఆడిటింగ్

1. మున్సిపాలిటీలు చేసే ఖర్చు రికార్డు చేస్తుంది.
2. వాటి ఆడిటింగ్‌లకు సబంధించి తగిన శాసనాలను రాష్ర్టశాసన నిర్మాణశాఖ రూపొందిస్తుంది.
-ప్రకరణ 243(జడ్ ఎ): మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణ రాష్ర్ట ఎన్నికల సంఘం బాధ్యత
1. మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల నిర్వహణ, నియంత్రణ పర్యవేక్షణకు సంబంధించి అధికారాలను 243(కె) ప్రకారం ఏర్పాటైన రాష్ర్ట ఎన్నికల సంఘం కలిగి ఉంటుంది.

-ప్రకరణ 243(జడ్ బి): కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపజేయడం

1. ఈ విభాగంలోని అంశాలు రాష్ర్టపతి ఉత్తర్వుల మేరకు కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తిస్తాయి.
nప్రకరణ 243(జడ్ సి): ఈ విభాగం నుంచి కొన్ని ప్రాంతాలకు మినహాయింపు ఉంటుంది.
1. 244(1) ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాలు 244(2) ప్రకారం షెడ్యూల్డ్ తెగల ప్రాంతంలో ఈ విభాగం వర్తించదు.
2. పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లా కొండప్రాంతాల కోసం ఏర్పాటైన గూర్ఖాహిల్ కౌన్సిల్ ప్రాంతానికి ఈ విభాగం వర్తించదు.
4. 244(1), 244(2) షెడ్యూల్డ్, ఆదివాసీ ప్రాంతాలకు ఈ విభాగాన్ని వర్తింపచేస్తూ పార్లమెంట్ శాసనాలను రూపొందించవచ్చు.
అవి రాజ్యాంగ సవరణగా పరిగణించరు.

-ప్రకరణ 243(జడ్ డి): జిల్లా ప్రణాళికా సంఘం

1. ఈ నిబంధన ప్రకారం ప్రతి జిల్లాకు ఒక జిల్లా ప్రణాళికా సంఘం ఉండాలి.
2. ఇది జిల్లాలోని, పంచాయతీ మున్సిపాలిటీల పథకాలను క్రోడీకరించి మొత్తం జిల్లా సమగ్రాభివృద్ధికి అవసరమైన జిల్లా
-ముసాయిదా అభివృద్ధి ప్రణాళికను తయారు చేస్తుంది.
3. రాష్ర్ట శాసన నిర్మాణశాఖ జిల్లా ప్రణాళిక సంఘాలకు సంబంధించి శాసనాలను రూపొందించవచ్చు.
4. జిల్లా ప్రణాళిక సంఘం మొత్తం సభ్యుల్లో 4/5వ వంతు పంచాయతీ, మున్సిపాలిటీల సభ్యులై ఉండాలి.
5. జిల్లా పంచాయతీ సభ్యులు, మున్సిపాలిటీ సభ్యులు వారిని ఎన్నుకుంటారు.
6. అలా ఎన్నుకున్నవారిలో మున్నిపాలిటీలు, జిల్లా పంచాయతీలకు ఎంతమంది ఉండాలనేది ఆ జిల్లాలోని గ్రామీణ ప్రాంత జనాభా పట్టణ ప్రాంత జనాభా నిష్పత్తిపై ఆధారపడి ఉంటుంది.
7. జిల్లా ప్రణాళికా సంఘం ద్వారా రూపొందిన జిల్లా ముసాయిదా అభివృద్ధి ప్రణాళికను ఆ సంఘ అధ్యక్షుడు గవర్నర్‌కు సమర్పిస్తారు. గవర్నర్ రాష్ర్ట శాసనసభకు సమర్పిస్తారు.

-ప్రకరణ 243(జడ్ ఇ): మెట్రోపాలిటన్ ప్రణాళికా సంఘం

1. ప్రతి మెట్రోపాలిటన్ ప్రాంతానికి ఒక మెట్రోపాలిటన్ సంఘాన్ని ఏర్పాటు చేయాలి.
2. మెట్రో పాలిటన్ ఏరియా సమగ్రాభివృద్ధికి అవసరమైన మెట్రో ముసాయిదా అభివృద్ధి ప్రణాళికను ఒక సంఘం రూపొందిస్తుంది.
3. ఆ రాష్ర్ట శాసన నిర్మాణశాఖ మెట్రోపాలిటన్ ప్రణాళికా సంఘానికి సంబంధించిన వివిధ చట్టాలను రూపొందించవచ్చు.
4. మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీలోని మొత్తం సభ్యుల్లో 2/3వ వంతు సభ్యులు, మెట్రోపాలిటన్ ప్రాంతపరిధిలోని మున్సిపాలిటీ సభ్యులు, పంచాయతీల అధ్యక్షులై ఉండాలి.
5. మెట్రోపాలిటన్ ప్రాంత పరిధిలోని మున్సిపాలిటీ సభ్యులు, పంచాయతీ అధ్యక్షులు వీరిని ఎన్నుకుంటారు.
6. వీరు ఎంతమంది ఉండాలనేది ఆ మెట్రోపాలిటన్ ఏరియాలోని పంచాయతీ మున్సిపాలిటీల జనాభా నిష్పత్తిపై ఆధారపడి ఉంటుంది.
7. ఎంపీపీసీలకు నగర మేయర్ చైర్మన్‌గా ఉంటారు.
8. మున్సిపల్ చైర్మన్ సభ్యకార్యదర్శి.
9. మున్సిపాలిటీ వ్యవహారాల్లో అనుభవం ఉన్న నలుగురు సభ్యులను రాష్ర్టప్రభుత్వం నియమిస్తుంది.
10. మొత్తం సభ్యుల్లో 2/3వ వంతు సభ్యులను గ్రామపంచాయతీ అధ్యక్షులు, మున్సిపాలిటీ కార్పొరేషన్ ప్రతినిధులు ఎన్నుకుంటారు.
11. మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ రూపొందించిన ముసాయిదా అభివృద్ధి ప్రణాళికను దాని అధ్యక్షులు, గవర్నర్‌కు సమర్పిస్తారు.
12. మెట్రోపాలిటన్ నగరాలను మహానగరాలు అంటారు. బాగా అభివృద్ధి చెంది ఒకే ప్రాంతంలోని కొన్ని మున్సిపాలిటీలు, పంచాయతీలను కలిపి మహానగరాలు అంటారు.13.ప్రస్తుతం దేశంలో 35 మెట్రోపాలిటన్ నగరాలు ఉన్నాయి. గ్రేటర్ నగరాలు 6 ఉన్నాయి. అవి..
-ముంబై (దేశంలో అతిపెద్ద కార్పొరేషన్), కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్.
-ప్రకరణ 243(జడ్ ఎఫ్): పాత శాసనాల కొనసాగింపు
1. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఏడాదిలోపు అన్ని రాష్ర్టాల్లో పూర్వపు శాసనాల ప్రకారమే నగరపాలక సంస్థలు అమల్లో ఉంటాయి. (1993, ఏప్రిల్ 24 నుంచి 1994, ఏప్రిల్ 24లోపు).
2. 74వ సవరణ తర్వాత మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా రాష్ర్టప్రభుత్వాలు స్థానిక సంస్థల్లో మార్పులు చేయవచ్చు.
-ప్రకరణ 243(జడ్ జి): మున్సిపల్ ఎన్నికలపై న్యాయస్థానం జోక్యంపై పరిమితులు
1. నగరపాలక వ్యవస్థలోని నియోజక వర్గాల ఏర్పాటు, సీట్ల కేటాయింపునకు సంబంధించి ఏ న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీలులేదు.
2. నగరపాలక సంస్థల ఎన్నికల వివాదాల విచారణ నిమిత్తం ఆ రాష్ర్ట శాసన నిర్మాణశాఖ ఒక ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయవచ్చు.

పట్టణ, నగరపాలక సంస్థలు

-1950లో హైదరాబాద్ నగరపాలక సంస్థలను ఏర్పాటు చేసి 1951 నుంచి పనిచేయడం ప్రారంభమైంది.
-1955లో హైదరాబాద్, సికింద్రాబాద్‌లను విలీనం చేసి నగర కార్పొరేషన్‌గా చేశారు.
-మొదటి మేయర్ మాడపాటి హనుమంతరావు.
-తెలుగు రాష్ర్టాల్లో మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
-మున్సిపల్ ఎన్నికల్లో విప్ జారీచేయవచ్చు.
-చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్‌లపై అవిశ్వాసతీర్మానం పెట్టవచ్చు.
-పదవిలోకి వచ్చిన నాలుగేండ్ల తర్వాత మాత్రమే అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఇటీవల రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
-హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా రాష్ర్ట ప్రభుత్వ జీవోను అనుసరించి ఎక్స్ అఫీషియో సభ్యులూ ఓటింగ్‌లో పాల్గొనవచ్చు.-మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవులకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.
-రాష్ట్రాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లు నిర్ణయిస్తారు.
-డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్లకు రిజర్వేషన్లు వర్తించవు.
-తెలుగు రాష్ర్టాల్లోని మున్సిపాలిటీలను కింది విధంగా విభజించారు.
1. సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీలు - రూ. 4 కోట్లు మించి ఆదాయం ఉన్నవి
2. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలు - రూ. 3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల మధ్య ఆదాయం ఉన్నవి
3. ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీలు - రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల మధ్య ఆదాయం ఉన్నవి
4. సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీలు - రూ. కోటి నుంచి రూ. 2 కోట్ల మధ్య ఆదాయం ఉన్నవి
5. థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీలు - రూ. కోటి లోపు ఆదాయం ఉన్నవి
ghmc-office1
ghmc-office2
ghmc-office3

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section