ఆసరా (సామాజిక భద్రతా పింఛన్లు)
-ప్రారంభం: 2014, నవంబర్ 8న మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో సీఎం కేసీఆర్ ప్రారంభించారు.-అమలు: 2014, అక్టోబర్ 1
-ఎవరెవరికి: వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నేతపనివారు, కల్లుగీత కార్మికులు, హెచ్‌ఐవీ, పైలేరియా వ్యాధిగ్రస్తులు, ఒంటరి మహిళలకు (మొత్తం 9 వర్గాల వారికి)
-గమనిక: 2015, మార్చి 19 నుంచి మహిళా బీడి కార్మికులకు ఆర్థిక సాయం అందించడానికి రూ. 1000 పింఛను ఇస్తున్నారు. 2017, ఏప్రిల్ నుంచి ఒంటరి మహిళలకు కూడా పింఛను ఇస్తున్నారు.
-పాత పింఛను పథకంలో వృద్ధులు, వితంతువులు, నేతపనివారు, కల్లుగీత కార్మికులు, హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ. 200 చొప్పున ఇచ్చేవారు. వీరితోపాటు పైలేరియా బాధితులు, ఒంటరి మహిళలు, బీడి కార్మికులకు రూ. 1000 పింఛను ఇస్తున్నారు. వికలాంగులకు గతంలో రూ. 500 ఉన్న పింఛనును రూ. 1500లకు పెంచారు.
-65 ఏండ్లు నిండిన వృద్ధులు, చేనేత కార్మికులు, 50 ఏండ్లు నిండిన కల్లుగీత కార్మికులు, వికలాంగులు వయస్సుతో నిమిత్తం లేకుండా 40 శాతం అంగవైకల్యం ఉన్నవారు, 18 ఏండ్లు నిండిన ఒంటరి మహిళలు అర్హులు.
-వృద్ధులు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ రోగులకు గులాబీ, వితంతువులకు నీలం, వికలాంగులకు లేత ఆకుపచ్చ రంగుల్లో ముద్రించిన కార్డులను అందజేస్తారు.
-అత్యధిక పింఛన్లు పొందే జిల్లాలు- నిజామాబాద్ (26,4037), జగిత్యాల (2,16,336)
-అతి తక్కువ పింఛన్లు పొందే జిల్లాలు- కుమ్రం భీం (51,206), జోగుళాంబ (51,206), వనపర్తి (72,080)

కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకం
-రాష్ట్రంలోని నిరుపేద దళిత, గిరిజన, మైనార్టీ, ఓబీసీలకు చెందిన యువతుల వివాహాలకు ఆర్థిక సాయం అందించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు 2014, అక్టోబర్ 2 నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. 18 ఏండ్లు నిండిన యువతులకు ఈ పథకం వర్తిస్తుంది. గ్రామాల్లో రూ. 1.50 లక్షలలోపు, పట్టణాల్లో రూ. 2 లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు.-పథకం ప్రారంభంలో రూ. 51,116 ఆర్థిక సాయం అందించేవారు. 2017, మార్చి 13న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ పథకం ఆర్థిక సాయాన్ని రూ. 75,116లకు పెంచారు. 2018, మార్చి 18న రూ. 1,00,116కు పెంచారు.
షీ క్యాబ్స్
-2015, సెప్టెంబర్ 8న రాష్ట్ర ప్రభుత్వం షీ క్యాబ్స్ పేరిట కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. దీన్ని మహిళా డ్రైవర్లను ప్రోత్సహించడం కోసం ప్రవేశపెట్టారు.-ప్రతి క్యాబ్‌కు రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం సబ్సిడీని సమకూరుస్తుంది.
మహిళల హెల్ప్‌లైన్ 181
-మహిళల రక్షణ కోసం, అత్యాచారాలకు వ్యతిరేకంగా వెంటనే స్పందించడానికి సమీకృత మహిళా హెల్ప్‌లైన్ 181ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది 24 గంటలు పనిచేస్తుంది. మహిళలు ఎలాంటి హింసకు గురైనా దీనిద్వారా తక్షణమే స్పందించడానికి పోలీసు, హాస్పిటల్, నిర్భయ సెంటర్లకు తక్షణమే సమాచారం తెలియజేస్తారు.షీ టీమ్స్
-ఈవ్ టీజింగ్‌కు ముగింపు పలకాలనే ఉద్దేశంతో 2014, అక్టోబర్ 24న షీ బృందాలను ఏర్పాటు చేశారు. మహిళలు, యువతులు, విద్యార్థినులను రక్షించండం ఈ బృందాల లక్ష్యం.ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం
-గర్భిణులు, బాలింతలు పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పుడు జన్మించే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తద్వారా మాతాశిశు మరణాల రేటు, తక్కువ బరువుతో జన్మించే పిల్లల సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి కార్యక్రమాన్ని 2015, జనవరి 1న ప్రారంభించింది.-మొత్తం 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 31,711 అంగన్‌వాడీ కేంద్రాలు, 3989 మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమం అమలవుతుంది.
-ఈ కార్యక్రమం కింద గర్భిణులు, బాలింతలకు ఒకపూట పూర్తి భోజనం ద్వారా 1052 కిలో కేలరీల శక్తి అందిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం ఒక్కొక్కరికి రోజుకి రూ. 15 ఖర్చు చేస్తుంది.
-నెలకు 30 రోజులు గుడ్లు 25 రోజులపాటు సంపూర్ణ భోజనం, రోజూ 200 మిల్లీ లీటర్ల పాలు అందిస్తున్నారు.
డిజిటల్ తెలంగాణ
-కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ తెలంగాణను 2015, జూలై 1న ప్రారంభించింది. దీని ఉద్దేశం డిజిటల్ పరిజ్ఞానంతో పౌరులకు నైపుణ్యం కల్పించడం.-సాంకేతిక పరిజ్ఞానాన్ని అందింపుచ్చుకునే విధంగా తగిన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తేవడం, సాంకేతికతను జోడించి పౌర సేవలను అందుబాటులోకి తీసుకురావడం ప్రధాన ఉద్దేశం.
స్వచ్ఛ తెలంగాణ - స్వచ్ఛ హైదరాబాద్
-రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ తెలంగాణ - స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని 2015, మే 16 సీఎం కే చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ సమీపంలో ప్రారంభించారు.-ఈ కార్యక్రమాన్ని 2015, మే 6 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించారు.
-హైదరాబాద్‌ను అందమైన నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్వచ్ఛ తెలంగాణ - స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ప్రారంభించారు.
-ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 200 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ నుంచి రూ. 75 కోట్లు మంజూరు చేసింది.

తెలంగాణకు హరితహారం
-జాతీయ అటవీ విధానం ప్రకారం రాష్ట్ర అటవీ విస్తీర్ణాన్ని 24.55 శాతం నుంచి 33 శాతానికి పెంచాలనే ఉద్దేశంతో తెలంగాణకు హరితహారం కార్యక్రమం ప్రారంభించారు.-రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలను నాటి, వాటిని సంరక్షించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని సీఎం కే చంద్రశేఖర్‌రావు 2015, జూలై 3న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చిలుకూరు బాలాజీ ఆలయం వద్ద ప్రారంభించారు.
-మొత్తం 230 కోట్ల మొక్కల్లో అటవీ ప్రాంతంలో 100 కోట్ల మొక్కలు, సామాజిక అడవుల కింద 120 కోట్ల మొక్కలు, హైదరాబాద్ నగర పరిధిలో 10 కోట్ల మొక్కలు నాటారు.
-ప్రతి నియోజకవర్గంలో ఏటా 40 లక్షల చొప్పున, ప్రతిగ్రామంలో 40 వేల చొప్పున మొక్కలు నాటుతారు. ఇందుకోసం ప్రతి ఏటా జూలై మొదటి వారంలో వనమహోత్సవం నిర్వహించి, మొక్కలు నాటుతారు.
-రెండో విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం కే చంద్రశేఖర్‌రావు 2016, జూలై 8న నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద ప్రారంభించారు.
-మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం కే చంద్రశేఖర్‌రావు 2017, జూలై11న కరీంనగర్ జిల్లా మానేరు డ్యాం తీరం వద్ద ప్రారంభించారు.

కేసీఆర్ కిట్
-ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, నిరుపేద గర్భిణులకు ఆసరాగా ఉండటం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్‌ను 2017, జూన్ 2న ప్రారంభించింది.-ఈ పథకం కింద ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు చేయించుకుంటే మగ శిశువుకు రూ. 12 వేలు, ఆడ శిశువుకు రూ. 13 వేల నగదును పలు దఫాలుగా అందిస్తారు.
-కేసీఆర్ కిట్‌లో మొత్తం 16 వస్తువులు ఉంటాయి. వీటి విలువు దాదాపు రూ. 2000.
-ప్రభుత్వ దవాఖానల్లో కనీసం రెండుసార్లు పరీక్షలు చేయించుకుంటే మొదటి దఫా రూ. 3,000లను బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. అదే దవాఖానలో ప్రసవిస్తే ఆడబిడ్డకు రూ. 5,000, మగబిడ్డకు రూ. 4000 ఖాతాలో వేస్తారు. బిడ్డకు మూడు నెలల కాలంలో టీకాలు వేయించిన తర్వాత రూ. 2 వేలు ఖాతాలో వేస్తారు. బిడ్డ 9 నెలల కాలంలో ఇప్పించాల్సిన టీకాలను తీసుకున్న తర్వాత రూ. 3 వేలు ఖాతాలో వేస్తారు.

మిషన్ కాకతీయ
-వేల ఏండ్లపాటు పంట పొలాలను సస్యశ్యామలం చేసి, కొన్ని దశాబ్దాలుగా పూడుకుపోయిన దాదాపు 46వేలకు పైగా చెరువులను మళ్లీ పునరుద్ధరించడమే ప్రధాన లక్ష్యంగా మిషన్ కాకతీయ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది.-నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం పాతచెరువులో మిషన్ కాకతీయ కార్యక్రమం పైలాన్‌ను సీఎం కే చంద్రశేఖర్‌రావు 2015, మార్చి 12న ప్రారంభించారు.
-నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చందుపట్ల పెద్దచెరువులో మిషన్ కాకతీయ పనులను సీఎం కేసీఆర్ 2015, ఏప్రిల్ 26న ప్రారంభించారు.
-ఐదేండ్లలో రూ. 20,000 కోట్ల అంచనా వ్యయంతో 46,431 చెరువులను పునరుద్ధరించాలనేది లక్ష్యం.



-రాష్ట్రంలో చెరువులు ఎక్కువగా పాత మెదక్ జిల్లా (7941), ఆ తర్వాత పాత మహబూబ్‌నగర్ జిల్లా (7480)లో ఉన్నాయి. అతి తక్కువగా పాత రంగారెడ్డి జిల్లాలో 285 చెరువులు ఉన్నాయి.
మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టే కార్యక్రమాలు
-పూడికల తొలిగింపు, నీటి నిల్వ సామర్థ్యం పెంపు
-పూడిక మట్టి పొలాల్లో పునర్వినియోగం
-చెరువులకు సంబంధించిన పిల్లకాలువల పునరుద్ధరణ
-గట్లు, తూములు, అడ్డుకట్టలకు మరమ్మతులు
-అవసరమైన చోట్ల ఫీడర్ చానళ్లను రీసెక్షన్ చేయడం, పూడిక తీయడం