Type Here to Get Search Results !

Vinays Info

గవర్నర్ జనరల్స్-Governer Generals

లార్డ్ కానింగ్ (1856-62)

-ఇతనికాలంలో 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది.
-బ్రిటిష్ ఇండియా చివరి గవర్నర్ జనరల్, మొదటి వైస్రాయ్.
-1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ పదవి వైస్రాయ్‌గా మారింది.
-ఈ చట్టం ద్వారా భారతదేశాన్ని పరిపాలించే అధికారం ఈస్టిండియా కంపెనీ నుంచి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుంది.
-డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్యసంక్రమణ సిద్ధాంతాన్ని 1859లో రద్దు చేశారు.
-కలకత్తా, బొంబాయి, మద్రాస్ యూనివర్సిటీలు 1857లో స్థాపించారు.
-ఇతడు భారత ప్రభుత్వంలో పోర్ట్‌ఫోలియో పద్ధతిని ప్రవేశపెట్టాడు (కార్యనిర్వాహక మండలిలోని ఒక్కో సభ్యుడికి ఒక్కో పరిపాలనా శాఖను కేటాయించడం).
-యూరోపియన్ సైనికులు చేపట్టిన తెల్ల తిరుగుబాటును అణచివేశాడు.
-1859లో కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ జారీ చేశారు. ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్) అమలులోకి వచ్చింది.
-భారత హైకోర్టు చట్టం 1861లో జారీ చేశారు.

సర్ జాన్ లారెన్స్ (1864-69)

-ఇతడు నీటిపారుదల పథకాలను ప్రారంభించాడు.
-యూరప్‌తో టెలిగ్రాఫిక్ కమ్యూనికేషన్, సముద్ర టెలిగ్రాఫ్ విధానం ప్రారంభమయ్యాయి.
-కలకత్తా, బొంబాయి, మద్రాస్ హైకోర్టులు 1865లో ప్రారంభమయ్యాయి.
-మొదటి అడవుల సంరక్షణ చట్టాన్ని 1865లో జారీ చేశాడు.
-సివిల్ సర్వీస్ పరీక్షల్లో పాల్గొనడానికి గరిష్ఠ వయస్సును 23 ఏండ్ల నుంచి 21 ఏండ్లకు 1866లో కుదించాడు.

లార్డ్ లిట్టన్ (1876-80)

-1877లో దేశంలో విపరీతమైన కరువు ఉన్నప్పుడు ఇతను ఢిల్లీలో గ్రాండ్ దర్బార్‌ను ఏర్పాటు చేశాడు.
-రాయల్ టైటిల్స్ చట్టాన్ని ఆమోదించి, విక్టోరియా మహారాణిని కైజర్-ఇ-హింద్‌గా ప్రకటించాడు.
-1876లో సివిల్ సర్వీసుల గరిష్ఠ వయస్సు పరిమితిని 21 నుంచి 19కి తగ్గించాడు.
-భారత ఆయుధాల చట్టాన్ని (1878) జారీ చేశాడు.
-భారత పత్రికల చట్టం (వెర్నాక్యులర్ ప్రెస్‌యాక్ట్ - 1878)ని జారీచేసి, దేశీయ పత్రికలపై అనేక ఆంక్షలు విధించాడు.
-ఇతని పరిపాలనా కాలంలో 29 వస్తువులపై దిగుమతి సుంకాలను రద్దు చేశాడు.
-భారతదేశ వైస్రాయ్‌ల్లో ఇతను ప్రముఖ నవలాకారుడు, కవిగా సాహితీ ప్రపంచానికి సుప్రసిద్ధుడు. ఇతనిని సాహిత్య ప్రపంచంలో Owen Meredith అని అంటారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section