Type Here to Get Search Results !

Vinays Info

కరెంట్ అఫైర్స్


పెట్టుబడి పథకం రైతుబంధు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పెట్టుబడి పథకానికి మార్చి 22న రైతుబంధు అని పేరు పేట్టారు.

క్వాలిటీ ఆఫ్ లివింగ్‌లో హైదరాబాద్ ఫస్ట్

క్వాలిటీ ఆఫ్ లివింగ్ నగరాల జాబితాలో దేశంలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. క్వాలిటీ ఆఫ్ లివింగ్ రేటింగ్ - 2018 పేరుతో రూపొందించిన జాబితాను మెర్సర్ విడుదల చేసింది. తక్కువ నేరాల శాతం, ఏ కాలంలోనైనా వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ రేటింగ్ ఇచ్చారు. చివరి స్థానంలో న్యూఢిల్లీ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ 142వ ర్యాంకులో ఉంది.

తెలంగాణకు ఐదో ర్యాంకు

2015-16ల మధ్య కాలానికి దేశ వ్యాప్తంగా మహిళలు, పురుషులు స్థితిగతులపై జరిగిన అధ్యయనంలో తెలంగాణ 5వ స్థానంలో నిలిచింది.

తెలంగాణ విద్యార్థికి అరుదైన గౌరవం

సూర్యుడిపై ఉన్న ఉష్ణోగ్రతను అధ్యయనం చేయడానికి నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) త్వరలో రాకెట్‌ను ప్రయోగించనున్నది. ఈ ప్రయోగాన్ని వీక్షించడానికి ప్రపంచ దేశాల నుంచి 110 మందిని ఎంపిక చేసింది. వారిలో రాష్ర్టానికి చెందిన విద్యార్థి అబీర్ మనీష్ గోదాగోమంకర్ ఉన్నారు.

కల్యాణలక్ష్మి సాయం పెంపు

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పేరిట నిరుపేద ఆడపిల్ల పెండ్లికి అందజేస్తున్న ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు 75,116గా ఉన్న మొత్తాన్ని రూ. 1,00,116 కు పెంచుతున్నట్టు ప్రకటించింది.

Hippopotamus

ఏకైక తెల్ల ఖడ్గమృగం మృతి

భూమిపై మిగిలిన ఒకే ఒక తెల్లని మగ ఖడ్గమృగం సుడాన్ మృతిచెందింది. అనారోగ్యంతో బాధపడుతున్న సుడాన్ మృతిచెందిందని కెన్యాలోని ఓఐ పెజెతా కన్జర్వెన్సీ తెలిపింది. వయోభారం, కాలికి సోకిన ఇన్ఫెక్షన్ కారణంగానే సుడాన్ మృతిచెందిందని వెల్లడించింది.

నివాస నగరాల జాబితాలో వియన్నా టాప్

ప్రపంచంలో నివాసానికి అనుకూలమైన నగరాలతో రూపొందించిన మెర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ జాబితాలో వియన్నా మొదటి స్థానంలో నిలిచింది. జ్యూరిచ్, మ్యూనిచ్, హాంకాంగ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కాగా, ఆసియాలో సింగపూర్ అత్యుత్తమ సిటీగా నిలిచింది.

మయన్మార్ అధ్యక్షుడి రాజీనామా

మయన్మార్ అధ్యక్షుడు హితిన్ క్యా తన పదవికి మార్చి 21న రాజీనామా చేశారు. ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్న మియింట్ స్వే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

బ్లాక్‌హోల్‌కు హాకింగ్ పేరు

బ్లాక్ హోల్ ఓపికస్ నక్షత్రాలను రష్యా వ్యోమగాములు కనుగొన్నారు. ఈ కృష్ణ బిలానికి ప్రఖ్యాత బ్రిటిష్ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ పేరు పెట్టారు.

ఆస్ట్రేలియా 457 వీసా రద్దు

విదేశీ నిపుణులకు జారీచేసే 457 వీసా పథకాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం రద్దు చేసింది. అమెరికా తరహాలోనే ఆస్ట్రేలియా కూడా తమ పౌరులకే తొలి ప్రాధాన్యం ఇచ్చేలా ఆస్ట్రేలియా ఫస్ట్ విధానాన్ని ప్రారంభించింది. 457 వీసాను రద్దు చేస్తే దాని స్థానంలో టెంపరరీ స్కిల్ షార్టేజ్ (టీఎస్‌ఎస్) అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చారు.

వీ ఆర్ సిక్స్‌కు పీఆర్ అవార్డు

అమెరికాలో మైనార్టీలుగా ఉన్న సిక్కుల్లో అవగాహన కల్పించడానికి నిర్వహించిన వీ ఆర్ సిక్స్ ప్రచారానికి అమెరికా అత్యున్నత పురస్కారం పబ్లిక్ రిలేషన్ వీక్ అవార్డు దక్కింది. మైనార్టీ కమ్యూనిటీపై సిక్కులకు అవగాహన కల్పించేందుకు గత ఏడాది ఏప్రిల్‌లో నేషనల్ సిక్ క్యాంపెయిన్ (ఎన్‌ఎస్‌సీ) అనే స్వచ్ఛంద సంస్థ ఈ ప్రచారాన్ని ప్రారంభించింది.

గ్లోబల్ టీచర్ ఆండ్రియా

గ్లోబల్ టీచర్ బహుమతిని బ్రిటన్ ఉపాధ్యాయురాలు ఆండ్రియా జాఫిరాకో మార్చి 20న అందుకున్నారు.

చైనా నుంచి పాక్ క్షిపణి వ్యవస్థ కొనుగోలు

శత్రు దేశాల క్షిపణులను గుర్తించి ధ్వంసం చేసేందుకు పాకిస్థాన్ చైనా నుంచి అత్యంత శక్తిమంతమైన క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసింది.

Brahmos

భారత్-ఫ్రాన్స్ నౌకా విన్యాసాలు

మార్చి 15-19 వరకు గోవా తీరంలో భారత్, ఫ్రాన్స్‌లు సంయుక్తంగా నావికా విన్యాసాలు నిర్వహించాయి. వరుణ్-18 పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్‌కు చెందిన జేడీ వియన్నే జలాంతర్గామి, భారత్‌కు చెందిన కల్వరీ పీ8-1, ఐఎన్‌ఎస్ ముంబై, ఐఎన్‌ఎస్ ట్రికండ్ లేదా మిగ్-29 కే యుద్ధ విమానాలు పాల్గొన్నాయి.

బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం

బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని రాజస్థాన్‌లోని పోఖ్రాన్ టెస్ట్ రేంజ్ నుంచి మార్చి 21న విజయవంతంగా పరీక్షించారు. భారత్, రష్యాలు కలిసి సంయుక్తంగా రూపొందించిన ఈ క్షిపణి 2006 నుంచి భారత సైన్యానికి సేవలందిస్తున్నది. దీని పరిధి 290 కి.మీ.

భారత్‌లో జర్మనీ అధ్యక్షుడు

జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టీన్‌మీర్ ఇటీవల భారత్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా ఉగ్రవాదం, పేదరికం, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఆర్థిక అంశాలపై చర్చించారు.

ఆయుష్మాన్ భారత్‌కు గ్రీన్ సిగ్నల్

కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల మేర ఆరోగ్య బీమా అందించే ఆయుష్మాన్ భారత్ పథకానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందులోభాగంగా దీనికోసం 2020 వరకు రూ. 85,217 కోట్లు కేటాయించింది.

ఢిల్లీలో వాణిజ్య మంత్రుల సమావేశం

డబ్ల్యూ టీవో వాణిజ్య మంత్రుల సమావేశం మార్చి 22, 23 తేదీల్లో ఢిల్లీలో జరిగింది. ఇందులో 50 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

రిటైర్‌మెంట్@62

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును మార్చి 1న 62 ఏండ్లకు పెంచారు. ఇప్పటివరకు ఇది 60 ఏండ్లుగా ఉంది. ప్రస్తుతం 48.41 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు.

సర్పంచ్‌గా ఎంబీబీఎస్ విద్యార్థిని

రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 24 ఏండ్ల ఎంబీబీఎస్ విద్యార్థిని షహనాజ్‌ఖాన్ పోటీచేసి విజయం సాధించారు. ఆమె భరత్‌పూర్ జిల్లాలోని టువాల కమాన్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

పాక్ పరేడ్‌లో భారత అధికారులు

మార్చి 23న పాకిస్థాన్ డే సైనిక పరేడ్‌కు భారత దౌత్యవేత్తలు, సైనికాధికారులు హాజరయ్యారు. పరేడ్‌కు భారత అధికారులను పిలువడం ఇదే తొలిసారి. పాక్‌లో భారత రాయబారి బిసారియా, డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్, రక్షణ, సైనిక సలహాదారు బ్రిగేడియర్ సంజయ్ విశ్వాస్ పరేడ్‌లో పాల్గొన్నారు. హిందూజా కుటుంబం బ్రిటన్‌లోని బ్రిటిష్ ఆసియన్లలో అత్యంత ధనిక కుటుంబంగా నిలిచింది. 2017లో ఈ కుటుంబ సంపద విలువ 22 బిలియన్ పౌండ్లు. హిందూజా కుటుంబానికి ఈ తరహా గుర్తింపు లభించడం ఇది వరుసగా ఐదోసారి.

Pankaj-Advani

ఏషియన్ బిలియర్డ్స్ విజేత అద్వానీ

మార్చి 24న ఏషియన్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ విజేతగా పంకజ్ అద్వానీ నిలిచాడు. రన్నరప్ భాస్కర్. పంకజ్ అద్వానీకి ఇది 11వ ఏషియన్ బిలియర్డ్స్ టైటిల్.
మహిళల ఏషియన్ బిలియర్డ్స్ టైటిల్ విజేత ఆమికమిని (ఇండియా), రన్నరప్‌గా సిరిపా పార్న్ (థాయ్‌లాండ్) నిలిచారు.

మను బాకర్‌కు రెండు స్వర్ణాలు

షూటింగ్ జూనియర్ ప్రపంచకప్‌లో మనుబాకర్ సింగిల్స్, జట్టు విభాగాల్లో స్వర్ణ పతకాలను నెగ్గింది.

ఇండియన్ వెల్స్ విజేత డెల్‌పాట్రో

ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ మాస్టర్ టైటిల్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను అర్జెంటీనా క్రీడాకారుడు డెల్‌పాట్రో గెలుచుకున్నాడు. ఫైనల్‌లో డెల్‌పాట్రో.. స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌ను ఓడించాడు.

రొనాల్డో హ్యాట్రిక్‌ల రికార్డ్

సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో హ్యాట్రిక్‌ల రికార్డు సృష్టించాడు. లా లీగా (స్పెయిన్) చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో రియల్ మాడ్రిడ్ 6-3 గోల్స్‌తో గిరోనా క్లబ్‌పై ఘన విజయం సాధించింది. రియల్ మాడ్రిడ్ తరఫున రొనాల్డో నాలుగు గోల్స్ చేశాడు. రొనాల్డో 50 హ్యాట్రిక్స్‌లో 41 సార్లు మూడేసి, ఏడుసార్లు నాలుగు, రెండుసార్లు ఐదు గోల్స్ చేశాడు.

ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రీ విజేత వెటెల్

ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రీ విజేతగా ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) నిలిచాడు. లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానంలో నిలిచాడు. కెరీర్‌లో 200వ రేసులో పాల్గొన్న వెటెల్ 48వ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

ప్రపంచకప్‌కు ఆఫ్ఘనిస్థాన్

ప్రపంచ క్వాలిఫయింగ్ టోర్నీ విజేతగా ఆఫ్ఘనిస్థాన్ జట్టు నిలిచింది. ఫైనల్‌లో వెస్టిండీస్ జట్టుపై విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా మొహమ్మద్ షహజాద్ ఎంపికయ్యాడు. 

FOLLOW US ON | FB | TWITTER | GOOGLE+ | YOUTUBE

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section