Type Here to Get Search Results !

Vinays Info

ఓబీసీలు-మండల్ కమిషన్ సిఫారసులు

 వెనుకబడిన తరగతులు
-ప్రభుత్వం గుర్తించిన ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందనివారిని వెనుకబడిన తరగతుల (Backward Classes) వారు అని అంటారు. వారిని కేంద్రంలో ఓబీసీ కులాలుగా, రాష్ట్రంలో బీసీ కులాలుగా పరిగణిస్తారు.
-బహుజనులు అనే పదాన్ని మొదట బుద్ధుడు బౌద్ధ భిక్షవులనుద్దేశించి తెలిపారు.
-బహుజన్ అంటే అనేక మంది ప్రజలు అని అర్థం.
-సామాజిక శాస్ర్తాల తత్వవేత్తల అభిప్రాయం ప్రకారం ద్విజులు (బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు) కాకుండా మిగిలినవారు బీసీలకు చెందినవారు.
-బీసీలు అంటే సమాజంలో సాంఘికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలు అని అర్థం.
-వెనుకబడిన తరగతులు అనే పదం తొలిసారి 1921లో మైసూర్ సంస్థానంలో ఉపయోగించబడింది.
-భారతదేశంలో తొలిసారిగా 1931లో కుల ప్రాతిపదికగా జనాభా గణన జరుపగా బీసీల జనాభా 51.68 శాతం.
-భారత రాజ్యాంగంలో 16వ భాగంలో 340 నిబంధన ప్రకారం రాష్ట్రపతి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులవారి అధ్యయనం కోసం కమిషన్ ఏర్పాటుచేయాలి.
-వెనుకబడిన తరగతులకు ఎవరు చెందుతారని భారత రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపర్చలేదు.
-కేంద్ర ప్రభుత్వం ఓబీసీ వర్గాల అధ్యయనం కోసం 1953, జనవరి 29న దత్తాత్రేయ బాలకృష్ణ కాలేల్కర్ కమిషన్‌ను ఏర్పాటుచేసింది.
-కాలేల్కర్ కమిషన్ దేశంలో ఓబీసీ వర్గాల గురించి సమగ్రంగా అధ్యయనం చేసి 1955 మార్చి 30న సమగ్ర నివేదికను అందజేసింది. ఈ కమిషన్ వెనుకబడిన కులాలు 2,399 అని, అందులో బాగా వెనుకబడిన కులాలు 837 అని నివేదికలో పేర్కొంది.  
కాలేల్కర్ కమిటీ నివేదిక-అంశాలు -అక్షరాస్యత బాగా తక్కువ, ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం లేకపోవడం
-సంప్రదాయంగా వస్తున్న కులాల్లో తక్కువస్థాయి సామాజిక జీవన పరిస్థితులు.
-షెడ్యూల్డ్ కులాలు, తెగల జాబితాలో చేరనివారు.
-వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో ప్రాతినిధ్యం లేని కులాలు
-1953కు ముందు గుర్తించని కులాలు
-1961 జనాభా లెక్కలు కుల ప్రాతిపదికన జరగాలని సూచన
-ఓబీసీ వర్గాలవారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సూచన
-కాలేల్కర్ కమిషన్ నివేదికను కేంద్రం 1956 సెప్టెంబర్ 3న పార్లమెంటుకు సమర్పించింది.
-మహిళలను కూడా ఓబీసీలో చేర్చడంతో ఈ కమిషన్ సమర్పించిన నివేదికను పార్లమెంటు ఆమోదించలేదు.
-ఈ కమిషన్‌ను మొదటి ఓబీసీ కమిషన్ అంటారు.

మండల్ కమిషన్

-మొరార్జీదేశాయ్ ప్రభుత్వం 1978లో ఓబీసీ వర్గాల అధ్యయనం కోసం బిందేశ్వరి ప్రసాద్ మండల్ నేతృత్వంలో కమిషన్‌ను నియమించింది.
-ఈ కమిషన్ 1979, జనవరి 1 నుంచి 1980, డిసెంబర్ 31 వరకు ఓబీసీ వర్గాలను అధ్యయనం చేసి తన నివేదికను సమర్పించింది.
కమిషన్ ముఖ్య సిఫారసులు
-4 సామాజిక, 3 విద్యకు సంబంధించిన అంశాలు, 4 ఆర్థికాంశాలను (మొత్తం 11 అంశాలు) ప్రామాణికంగా పరిశీలించి మొత్తం 40 సిఫారసులు చేసింది.
-ఓబీసీ వర్గాలుగా 3,743 కులాలను గుర్తించింది.

-దేశంలో ఓబీసీ కులాలు 52 శాతం ఉన్నాయని ప్రకటించింది.
-ఓబీసీ వర్గాల వారికి విద్యా ఉద్యోగావకాశాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసింది.
-BP మండల్ కమిషన్ సిఫారసు ప్రకారం 1990 సెప్టెంబర్ 7న వీపీ సింగ్ హయాంలో కేంద్ర ప్రభుత్వం బీసీలకు 27 శాతం రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చింది.
-ఓబీసీ వర్గాల వారికి 27 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ఇందిరాసహానీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో రిజర్వేషన్లు సబబే అని ప్రకటించిన కోర్టు, మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సూచించింది. ఓబీసీ వర్గాల్లో క్రీమీలేయర్ విధానం అమలుపర్చాలని 1993లో తీర్పు వెల్లడించింది.
-రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని ఎం.ఆర్.బాలా జీ Vs కర్ణాటక ప్రభుత్వం 1963, దేవదాసన్ Vs తమిళనాడు 1964 కేసుల్లో సుప్రీంకోర్టు ప్రకటించింది.
-ఇందిరాసహానీ కేసులో వెలువడిన సుప్రీంకోర్టు తీర్పును మండల్ కమిషన్ కేసుగా పేర్కొంటారు.
-మండల్ కమిషన్ కేసులోని క్రీమీలేయర్ అంశాన్ని అధ్యయనం చేయడం కోసం 1993లో బీహార్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామనందన్ ప్రసాద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయగా 11 ప్రమాణాలతో పరిశీలన చేసి క్రిమీలేయర్ విధానం అమలు చేయాలని సిఫారసు చేస్తూ 1993 మార్చి 10న నివేదిక సమర్పించింది.
-2013, మే 16 నుంచి బీసీల్లో క్రీమీలేయర్ పరిమితి రూ. 6 లక్షలుగా అమలులో ఉంది.
-1990, ఆగస్టు 13 జస్టిస్ జీవన్‌రెడ్డితో కూడిన 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం జాతీయ, రాష్ట్ర స్థాయిలో బీసీలకు కమిషన్లు ఏర్పాటుచేయాలని తెలిపింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్లు ఏర్పాటుచేశాయి.

జాతీయ ఓబీసీ కమిషన్


-ఇందిరాసహానీ కేసులో సుప్రీంకోర్టు 1992లో శాశ్వత ప్రాతిపదికగా బీసీ కమిషన్ ఏర్పాటుచేయాలని సూచించింది.
-భారత రాజ్యాంగంలోని 340 నిబంధనను అనుసరించి 1993 ఏప్రిల్ 2న జాతీయ బీసీ కమిషన్ చట్టం ప్రకారం శాసనబద్దమైన సంస్థగా ఏర్పాటైంది.
-ఓబీసీ కమిషన్ రాజ్యాంగబద్దమైన సంస్థ కాదు.

నిర్మాణం


-ఈ కమిషన్‌లో ఒక చైర్మన్, ముగ్గురు సభ్యులు, ఒక సభ్య కార్యదర్శి ఉంటారు.
-కమిషన్ చైర్మన్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకానికి కావాల్సిన అర్హతలుండాలి.
-ఒక సభ్యుడు సామాజికవేత్త, ఇద్దరు సభ్యులు బీసీ కులాలకు చెందినవారై ఉండాలి.
-కేంద్రప్రభుత్వ కార్యదర్శి హోదాకు తగిన వ్యక్తి సభ్య కార్యదర్శిగా ఉంటాడు.
-ఓబీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీకాలం 3 ఏండ్లు. వీరు రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా నియమించబడతారు.

ఓబీసీ కమిషన్ విధులు


-కమిషన్ సివిల్ కోర్టు అధికారాలను కలిగి ఉంటుంది.
-బీసీల జాబితాలో కొత్తగా కులాలను చేర్చే అంశాన్ని పరిశీలిస్తుంది.
-చట్టం అమల్లోకి వచ్చినప్పటినుంచి ప్రతి 10 ఏండ్లకు ఒకసారి బీసీల జాబితాలో పేర్కొన్న కులాలను పునఃసమీక్ష చేస్తుంది.
-కమిషన్ సివిల్ కోర్టు లాగా పనిచేస్తూ ఏ వ్యక్తినైనా తన ముందు విచారణకు హాజరవ్వాలని ఆదేశిస్తుంది. అవసరమైతే ప్రమాణపత్రాలను సాక్ష్యంగా స్వీకరించి, డాక్యుమెంట్లను సమర్పించాలని ఆదేశిస్తుంది.
-ఓబీసీ కమిషన్ వార్షిక నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. ఆ నివేదికను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు అందజేస్తుంది.

-జస్టిస్ ఎస్. రత్నవేలు పాండ్యన్ కేంద్రంలో 5వ వేతన సంఘం చైర్మన్‌గా విధులు నిర్వహించారు.
-జస్టిస్ రామనందన్ ప్రసాద్ కమిటీ సూచనల మేరకే క్రీమీలేయర్ విధానం జరుగుతున్నది.FOLLOW US ON | FB | TWITTER | GOOGLE+ | YOUTUBE

Top Post Ad

Below Post Ad

Ads Section