వినయ్స్ ఇన్ఫో : రాష్ట్రంలో 21 నగరపంచాయతీలను మున్సిపాలిటీలుగా హోదా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు శనివారం పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ జీవో విడుదలచేశారు. నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా ఏర్పాటుచేయాలని కోరుతూ ఇటీవల పలువురు ప్రజాప్రతినిధులు పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావును కలిశారు. ఈ విషయంపై అధ్యయనం చేసిన కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో 21 నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా హోదా పెంచుతూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలను గ్రేడ్లవారీగా వర్గీకరణపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.
కొత్త మున్సిపాలిటీలు ఇవే:
1.బడంగ్‌పేట,
2.పెద్దఅంబర్‌పేట,
3.నర్సంపేట,
4.సత్తుపల్లి
5.గజ్వేల్
6.వేములవాడ,
7.కల్వకుర్తి,
8.ఇబ్రహీంపట్నం,
9.హుజూర్‌నగర్,
10.జమ్మికుంట,
11.నాగర్‌కర్నూలు,
12.పరకాల,
13.హుజూరాబాద్,
14.మధిర,
15.హుస్నాబాద్,
16.బాదేపల్లి,
17.అచ్చంపేట,
18.అయిజ,
19.దేవరకొండ,
20.కొల్లాపూర్,
21అందోల్-జోగిపేట.
కొత్త మున్సిపాలిటీలు ఇవే:
1.బడంగ్‌పేట,
2.పెద్దఅంబర్‌పేట,
3.నర్సంపేట,
4.సత్తుపల్లి
5.గజ్వేల్
6.వేములవాడ,
7.కల్వకుర్తి,
8.ఇబ్రహీంపట్నం,
9.హుజూర్‌నగర్,
10.జమ్మికుంట,
11.నాగర్‌కర్నూలు,
12.పరకాల,
13.హుజూరాబాద్,
14.మధిర,
15.హుస్నాబాద్,
16.బాదేపల్లి,
17.అచ్చంపేట,
18.అయిజ,
19.దేవరకొండ,
20.కొల్లాపూర్,
21అందోల్-జోగిపేట.
Social Plugin