- ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన - ముఖ్యమైన అంశాలు
- హైదరాబాద్ సంస్థానం భారత్‌లో వీలినమైన తేది 1948 సెప్టెంబర్ 17.
- తెలంగాణ ప్రాంతంలో ముల్కీ ఉద్యమం ప్రారంభమైన తేది 1952 ఆగస్టు 5.
- భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ను నియమించిన తేది 1953 డిసెంబర్ 22.
- 1960లో ప్రాంతీయ సంఘం తొలి తెలంగాణ అధ్యక్షుడిగా పని చేసిన వారు - కె.అచ్యుత రెడ్డి.
- తొలి దశ రాజకీయ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం 1968.
- తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం విద్యార్థులందరూ కలిసి ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడిన తేది 1969 జనవరి 13.
- మర్రి చెన్నారెడ్డిని ‘తెలంగాణ ప్రజా సమితి’ (టీపీఎస్) అధ్యక్షుడిగా ఎన్నుకున్న తేది 1969 మే 22.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరు సూత్రాల పథకాన్ని రూపొందించి, అమలు పరచాలని నిర్ణయించిన తేది 1973 సెప్టెంబర్ 21.
- భారతదేశంలో మొదటిసారిగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ను ‘ఫజల్ అలీ’ నేతృత్వంలో ఏర్పాటు చేశారు.
- 1974 మే 3న ఆరు సూత్రాల పథకంలో భాగంగా 32వ రాజ్యాంగ సవరణ ద్వారా 371-(డి), 371(ఈ) అధికరణలను కొత్తగా చేర్చారు.
- 610 జీవోను పరిశీలించడానికి ఎన్.టి. రామారావు హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ‘సుందరేశన్’ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి కన్వీనర్‌గా 1990లో ‘తెలంగాణ ఫోరం’ ఏర్పడింది.
- తెలంగాణ సాధన సమితిని ఏర్పాటు చేసిన సంవత్సరం 1997.
- తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన తేది 2001 ఏప్రిల్ 27.
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ దీక్ష ప్రారంభించిన తేది 2009 నవంబర్ 29.
- మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జేఏసీని ఏర్పాటు చేసిన తేది 2009 డిసెంబర్ 4.
- ప్రత్యేక తెలంగాణ సమస్యను పరిష్కరించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసిన తేది 2010 ఫిబ్రవరి 3.
- శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను కేంద్ర హోం శాఖకు సమర్పించిన తేది 2010 డిసెంబర్ 30.
- మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ‘మిలియన్ మార్‌చ’ నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన తేది 2011 మార్చి 10.
- మలిదశ తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె ప్రారంభమైన తేది 2011 సెప్టెంబర్ 13.
- హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో జేఏసీ ‘తెలంగాణ మార్‌చ’ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన రోజు 2012 సెప్టెంబర్ 30.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అంశంపై చర్చ చేపట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి 2013 మార్చి 21న జేఏసీ చేపట్టిన ఉద్యమ కార్యక్రమం పేరు - సడక్ బంద్.
- హైదరాబాద్ రాజధానితో కూడిన పది జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రకటించిన తేది 2013 జూలై 30.
- నాటి కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని పార్లమెంట్‌లో ప్రకటించిన రోజు 2013 ఆగస్టు 5.
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి 2013 ఆగస్టు 6న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ - ఆంటోని కమిటీ.
- ఉద్యోగ సంఘాల నాయకుడు అశోక్‌బాబు నేతృత్వంలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో 2013 సెప్టెంబర్ 21న సమైక్యాంధ్ర సభను నిర్వహించిన ప్రదేశం - ఎల్.బి. స్టేడియం, హైదరాబాద్.
- కేంద్ర హోం-శాఖ తెలంగాణ బిల్లును రూపొందించిన తేది - 2013 అక్టోబర్ 3.
- సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో సమైక్యసభ జరుగుతుండగా ‘జై తెలంగాణ’ అని నినదించిన కానిస్టేబుల్ పేరు - శ్రీనివాస్.
- [18/01, 9:23 PM] VINAY KUMAR MUKKANI: తెలంగాణ రాష్ట్ర పునర్విభజన ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రి మండలి అమోదం తెలిపిన రోజు 2013 డిసెంబర్ 5.
- తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రపతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక విమానంలో పంపించిన తేది 2013 డిసెంబర్ 12.
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపిన రోజు 2014 ఫిబ్రవరి 18.
- కె. చంద్రశేఖర్‌రావు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు 2014 జూన్ 2. ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల సంఖ్య 11 మంది.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించారు.
- కేసీఆర్ ఒక వైపు ఉద్యమాన్ని నడిపిస్తూనే మరో వైపు రాజకీయ పార్టీలపై ఒత్తిడి తేవడానికి మేధోమథన సదస్సును నిర్వహించిన ప్రదేశం - వరంగల్.
- మలిదశ తెలంగాణ ఉద్యమంలో రాయల తెలంగాణ అనే కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చిన నాయకులు - జె.సి.దివాకర్‌రెడ్డి, టి.జి. వెంకటేష్.
- తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యేల సంఖ్య - 87 మంది (మిగతా వారు తమ అభిప్రాయాలను రాత పూర్వకంగా తెలియజేశారు)
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన - ముఖ్యమైన అంశాలు
February 11, 2018
Social Plugin