Type Here to Get Search Results !

Vinays Info

Mandala Parishath

మండల పరిషత్
» ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994, మే 30 నుంచి అమల్లోకి వచ్చింది. దీన్నే 'నూతన పంచాయతీరాజ్ చట్టం' అంటారు.
» ఆంధ్రప్రదేశ్‌లో 668 మండలాలు ఉన్నాయి.
» తెలంగాణలో 454 మండలాలు ఉన్నాయి.
» మండలానికి సంబంధించిన పరిపాలనా విభాగమే మండల పరిషత్తు.
» మండల పరిషత్తును సుమారు 40 వేల జనాభాతో దాదాపు 20, 30 గ్రామాలతో ఏర్పాటు చేస్తారు.
» పంచాయతీరాజ్ కమిషనర్ మండల జనాభాను బట్టి ఆ మండలాన్ని కొన్ని ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజిస్తారు.
» ప్రతి ప్రాదేశిక నియోజకవర్గంలో 3,500 జనాభా ఉంటుంది.
» ప్రతి ప్రాదేశిక నియోజకవర్గం నుంచి MPTC సభ్యుడిని ఆ ప్రాదేశిక నియోజకవర్గ ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు.
» మండల పరిషత్‌లో కనిష్ఠంగా ఏడుగురు, గరిష్ఠంగా 23 మంది MPTC సభ్యులుంటారు.
» MPTC సభ్యులు ఒకరిని అధ్యక్షుడిగా (ఛైర్మన్), ఒకరిని ఉపాధ్యక్షుడిగా (వైస్ ఛైర్మన్), కో-ఆప్టెడ్ సభ్యుడిగా ఒక మైనారిటీ సభ్యుడిని ఎన్నుకుంటారు.
» మండల పరిషత్ కాలపరిమితి అయిదేళ్లు.
» మండల అధ్యక్షుడు, సభ్యుల కాలపరిమితి అయిదేళ్లు.
» ఏదైనా కారణాల వల్ల అధ్యక్ష, ఉపాధ్యక్ష, సభ్యుల స్థానాలు ఖాళీ అయితే తిరిగి ఆరు నెలల్లోగా ఉపఎన్నిక నిర్వహించి భర్తీ చేయాలి.
» శాసనమండలిని విధాన పరిషత్ అని కూడా అంటారు.
» మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు, సభ్యులు, కో-ఆప్టెడ్ సభ్యుడు తమ రాజీనామా లేఖను జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారికి పంపాలి.
» మండల పరిషత్తులో 6 రకాల సభ్యులుంటారు.
       i) మండలంలోని ఆయా ప్రాదేశిక నియోజకవర్గాల నుంచి ప్రజలు ఎన్నుకున్న సభ్యులు (MPTC)
       ii) ఆ మండల పరిధికి చెందిన అసెంబ్లీ సభ్యుడు (MLA)
       iii) ఆ మండల పరిధికి చెందిన విధాన పరిషత్ సభ్యుడు
       iv) మండల పరిధిలో ఉన్న లోక్‌సభ సభ్యుడు
       v) ఆ మండల పరిధిలోని రాజ్యసభ సభ్యుడు
       vi) మైనారిటీ వర్గం నుంచి కో-ఆప్ట్ చేసుకున్న సభ్యుడొకరు
శాశ్వత ఆహ్వానితులుగా
       i) జిల్లా కలెక్టర్
       ii) ఆ మండల పరిషత్ పరిధిలో ఉన్న గ్రామ సర్పంచ్‌లు
       iii) మండల పరిషత్ పరిధి నుంచి జిల్లా పరిషత్‌కు ఎన్నికైన సభ్యుడు
       iv) జిల్లా పరిషత్ ఛైర్మన్
       v) వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ అధ్యక్షుడు
» శాశ్వత ఆహ్వానితులు మండల పరిషత్ సమావేశాలకు హాజరుకావచ్చు కానీ ఓటింగ్‌లో పాల్గొనకూడదు.
» మండల పరిషత్‌కు సంబంధించిన అంశాల్లో ప్రత్యేక నైపుణ్యం కలిగిన వ్యక్తుల్ని సమావేశాలకు ఆహ్వానించవచ్చు.
» ప్రత్యేక ఆహ్వానితులకు కూడా ఓటు హక్కు ఉండదు.

Top Post Ad

Below Post Ad

Ads Section