Type Here to Get Search Results !

Vinays Info

Loksaba and Rajyasaba

లోక్‌సభ
1. సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు.
2. పదవీకాలం సాధారణంగా ఐదు సంవత్సరాలు. పదవీకాలం ముగియకముందే రద్దు కావచ్చు.
3. ద్రవ్యబిల్లుపై ప్రత్యేక అధికారం కలిగి ఉంటుంది.
4. స్పీకర్ ఒక బిల్లును ద్రవ్య బిల్లా కాదా అని నిర్ధారిస్తారు.
5. వాయిదా తీర్మానాన్ని, అవిశ్వాస తీర్మానాన్ని, విశ్వాస తీర్మానాన్ని ఈ సభలో మాత్రమే ప్రవేశపెడుతారు.
6. జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దుచేసే తీర్మానాన్ని లోక్‌సభలో మాత్రమే ఆమోదించాలి.
7. బడ్జెట్‌ను లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి.
8. అన్ని ప్రధానమైన నిర్ణయాలను లోక్‌సభలో ప్రకటిస్తారు.
9. రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలను రూపొందించాలంటే లోక్‌సభలో ప్రత్యేక తీర్మానాన్ని ముందుగా ప్రవేశపెట్టకూడదు.
10. నూతన అఖిలభారత సర్వీసులను ఏర్పాటు చేసే ప్రతిపాదనను లోక్‌సభలో ప్రవేశపెట్టరు.
11. లోక్‌సభకు ఇద్దరు ఆంగ్లో-ఇండియన్ సభ్యులు నామినేట్ అవుతారు.
12. లోక్‌సభ దేశ ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తుంది.

రాజ్యసభ

1. సభ్యులు పరోక్షంగా ఎన్నికవుతారు.
2. ఇది శాశ్వత సభ, సభ్యుల పదవీకాలం ఆరేండ్లు.
3. ద్రవ్య బిల్లుపై ఎలాంటి అధికారాలు ఉండవు. 14 రోజులు నిలుపుదల చేయవచ్చు.
4. చైర్మన్‌కు ద్రవ్య బిల్లా కాదా నిర్ధారించే అధికారం ఉండదు.
5. ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెడుతారు.
6. జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భంలో లోక్‌సభ రద్దయి ఉంటే రాజ్యసభ ఆమోదించాలి.
7. బడ్జెట్‌ను రాజ్యసభలో ప్రవేశపెట్టరాదు.
8. ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించరు.
9. రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలను రూపొందించాలంటే, మొదట రాజ్యసభ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించాలి.
10. నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసే ప్రతిపాదనను రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి.
11. రాజ్యసభకు వివిధ రంగాలకు చెందిన 12 మంది సభ్యులు నామినేట్ అవుతారు.
12. మేధావుల సభ, రాష్ర్టాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది

Top Post Ad

Below Post Ad

Ads Section