Type Here to Get Search Results !

Vinays Info

బాక్టీరియాల బాహ్యస్వరూపం External Characters of Bacteria

బాక్టీరియాల బాహ్యస్వరూపం External Characters of Bacteria

కోకస్

  • గోళాకారంగా ఉండే బాక్టీరియమ్ లను "కోకస్" (Coccus) అంటారు. కణాల సంఖ్య, అమరికలను బట్టి వీటిని ఆరు రకాలుగా విభజించారు.

  • మోనోకోకస్: ఒంటరిగా ఉండే గోళాకార బాక్టీరియమ్.
  • డిప్లోకోకస్: ఒక జత గోళాకార బాక్టీరియాలు.
  • టెట్రాకోకస్: నాలుగు గోళాకార బాక్టీరియాల సమూహం.
  • స్ట్రెప్టోకోకస్: ఒకే వరుసలో గొలుసులాగా అమరి ఉండే గోళాకార బాక్టీరియాలు.
  • స్టాఫిలోకోకస్: క్రమరహితంగా అమరి ఉండే గోళాకార బాక్టీరియాల సమూహం.
  • సార్సినా: ఘనాకారంగఅ అమరి ఉండే ఎనిమిది గోళాకార బాక్టీరియాల సమూహం.

  • బాసిల్లస్
  • దండాకార బాక్టీరియాలను "బాసిల్లస్" (Bacillus) అంటారు. ఇవి తిరిగి మూడు రకాలుగా ఉంటాయి.

  • మోనోబాసిల్లస్: ఒంటరిగా ఉండే దండాకార బాక్టీరియమ్.
  • డిప్లోబాసిల్లస్: ఒక జత దండాకార బాక్టీరియాలు.
  • స్ట్రెప్టోబాసిల్లస్: ఒకే వరుసలో గొలుసులాగా అమరి ఉండే దండాకార బాక్టీరియాలు

  • విబ్రియో
  • కామా (,) ఆకృతిలో ఉండే బాక్టీరియాలను "విబ్రియో" (Vibrio) అంటారు.

  • స్పైరిల్లమ్
  • సర్పిలాకారంలో ఉండే బాక్టీరియాలను "స్పైరెల్లమ్" (Spirillum) అంటారు. నమ్యతను చూపించే స్పైరిల్లమ్ లను "స్పైరోకీట్స్" (Spirochetes) అంటారు. కొన్ని బాక్టీరియాలు పోగు లేదా తంతువు రూపాలలో ఉంటాయి.

Top Post Ad

Below Post Ad

Ads Section