National Curiculam of Framework 2005 | జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం-2005
VINAYS INFO
జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం-2005
🔹సామాజిక ఆర్థిక నేపథ్యాల నుంచి వచ్చిన బాలబాలికలు తమ శారీరక, మనోవైజ్ఞానిక, మేధోపర లక్షణాలకు అనుగుణంగా అభ్యసించి విజయం సాధించడానికి తోడ్పడే విధంగా పాఠ్యప్రణాళిక ఉండాలి.
🔸మారుతున్న సామాజిక అవసరాలకు అనుగుణంగా మార్పుచెందుతూ, దేశ సాంస్కృతిక వైవిధ్యతలను ప్రతిబింబించే పాఠ్యప్రణాళిక రూపకల్పన జరిగితే దేశ పురోగతి జరుగుతుందనడంలో అతిశయోక్తిలేదు.
CF-2005 లక్షణాలు:
1. సంబద్ధత (Releva-cy)
2. సరళత (Flexibility)
3. నాణ్యత (Quality)
👉ఈ మూడు లక్షణాలు పాఠ్యప్రణాళికా చట్రం ప్రధాన దృక్పథంలో ఉండాలనేది ప్రధాన లక్ష్యం.
*💁మౌలిక సూత్రాలు:
👉పాఠశాల బయటి జీవితాన్ని, ఉపాధ్యాయుడు తన బోధనతో విద్యార్థులకు అందించే జ్ఞానంతో అనుసంధానం చేయాలి.
👉విద్యార్థులు కంఠతాపట్టే పద్ధతుల నుంచి అర్థవంతంగా చదవగలిగే పద్ధతులకు పాఠ్యప్రణాళిక మారాలి.
👉విద్యార్థుల సంపూర్ణ వికాసానికి తోడ్పడే శిశుకేంద్ర పాఠ్యాంశాలు రూపొందాలి.
👉పరీక్ష విధానాలు సరళంగా ఉండి, తరగతిగది-జీవితంలో సమన్వయపరచాలి.
👉బాలబాలికలు పాఠ్యపుస్తకాల వలయంలో చిక్కుకోకుండా వారి ప్రజాస్వామిక, పర్యావరణ వికాసానికి కృషిచేయాలి.
*🌷ప్రధాన అంశాలు:*
🔸ప్రొ. యశ్‌పాల్ కమిటీ భావనల ఆధారంగా ఎన్‌సీఎఫ్-2005 రూపొందించబడింది.
🔸బరువు కాని చదువు, భారంలేని విద్య లక్ష్యంగా పాఠ్యప్రణాళిక ఉండాలి.
🔸పాఠశాలలో చేపట్టే వివిధ కార్యక్రమాలు సృజనాత్మకంగా ఉండాలి కానీ, యాంత్రికంగా ఉండకూడదు.
🔸ప్రజాస్వామిక విలువల పట్ల, రాజ్యాంగ సూత్రాలపట్ల నిబద్ధతను పెంపొందించేలా పాఠ్యప్రణాళిక తోడ్పడాలి.
🔸స్వతంత్రంగా ఆలోచించి, పనిచేసి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలను పెంపొందించాలి.
_🔹కొద్దిమంది విద్యార్థులే రాణించే విధంగా కాకుండా అందరూ రాణించేలా ఉండాలి._
_🔸పిల్లల అవసరాలకు తగిన అభ్యసన వాతావరణం కల్పించేందుకు వీలుగా ఉపాధ్యాయునికి స్వయంప్రతిపత్తి ఉండాలి._
_🔹జ్ఞానోత్పత్తి కార్యక్రమంలో పిల్లల్ని భాగస్వాములనుచేసి అభ్యసనం కొనసాగించాలి._
_🔸అభ్యసన ప్రక్రియలో భాగంగా ఏర్పడిన పీరియడ్ కచ్చితంగా 45 ని.లు అమలయ్యేలా చూడాలి._
_🔹అభ్యసన క్రమాన్ని ఆటంకపరిచే పోటీతత్వధోరణిని నిరోధించాలి. దానిస్థానంలో ఆసక్తిని పెంపొందించాలి._
_🔹సహజ అభ్యసన క్రమాన్ని హరించే అంశాలను తరగతిగదిలో నిరోధించాలి._
_🔸తరగతి గదిలో పిల్లలు చర్చించకుండా నిశ్శబ్ధంగా ఉండటం, టీచర్ అడిగే ప్రశ్నకు ఒక్కరే జవాబు చెప్పడం, జవాబు తెలిసినవారినే చెప్పమనడం వంటి అంశాలను నిరోధించాలి._
👉గిరిజన భాషలు, ఇతర భాషల వారికి వారి సొంత భాషల్లో అభ్యసన సౌకర్యాలు కల్పించాలి.
👉1వ తరగతి నుంచి ఆంగ్ల బోధన ప్రవేశపెట్టాలి.
👉బహుభాషా నేపథ్యంలో త్రిభాషకు ప్రాధాన్యమివ్వాలి.
👉మూసపద్ధతిలో విద్యాప్రణాళిక కాకుండా వృత్తి నైపుణ్యాలు పెంపొందించే పని ప్రపంచాన్ని పిల్లలకు పరిచయం చేయాలి.
👉విద్యాప్రణాళిక కేవలం ఫలితాలకోసం కాకుండా ప్రక్రియ ప్రధానమైనదిగా ఉండాలి.
*🌷సెంకడరీ పాఠశాల🌷*
👉9, 10 సెకండరీ స్థాయి పిల్లలకు సృజనాత్మకమైన, ఉత్పత్తిదాయకమైన పనినైపుణ్యాలు అలవర్చాలి.
👉గ్రంథాలయ పుస్తకాల పఠనం, ప్రయోగశాల అనుభవాలు కలిగించాలి.
👉కుట్టుపని, వస్తువుల తయారీ, పారామెడికల్ కోర్సుల వృత్తి విషయాలు చేర్చి నైపుణ్యాలు పెంపొందించాలి.
👉హయ్యర్ సెకండరీ పాఠశాల- +2 స్థాయిలో విద్యార్థులు తమ ఆసక్తులు, అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా భావి జీవితాలకు తగిన కోర్సులను ఎంపికచేసుకునే విద్యా అవకాశాలు కల్పించాలి.
👉వైద్య, ఇంజినీరింగ్ ఇతర కోర్సులకు కావలసిన సంపూర్ణ పరిజ్ఞానాన్ని అందించే విద్యా ప్రణాళిక రూపొందించాలి.
*🌷CF-2005 - భాష🌷*
🔸పాఠశాలల్లో పిల్లల మాతృభాష బోధనా మాధ్యమంగా ఉండాలి.
🔸విద్యార్థుల్లో బహు భాషా జ్ఞానాన్ని పెంపొందించాలి.
🔹త్రిభాషా సూత్రం (తెలుగు, హిందీ, ఇంగ్లిష్)లో భాగంగా భాషా పరిజ్ఞానం ప్రతి విద్యార్థికి అందించాలి.
🔹1వ తరగతి నుంచే ఇంగ్లిష్‌పై అవగాహన కల్పించాలి. అదేవిధంగా మాతృభాషకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
హిందీయేతర రాష్ర్టాల్లో హిందీని ప్రవేశపెట్టాలి.
🔸+2 స్థాయిలో ప్రాచీన (సంస్కృత), విదేశీ భాషల అధ్యయనాన్ని ప్రారంభించాలి.
🔸పిల్లలు తమ సొంతభాషలో ఆలోచనలను, అనుభవాలను వ్యక్తీకరించడానికి అవకాశం కల్పించాలి.
*🌷గణితం🌷*
👉పిల్లల్లో గణిత సామర్థ్యాలు అభివృద్ధిచేయడం, గణితంలో రాణించే చతుర్విధ ప్రక్రియలు (సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగహారం) వచ్చేలా చూడాలి.