*1) పరిమాణం మాత్రమే ఉండి దిశపై ఆధారపడని భౌతక రాశులను ఏమని అంటారు?*
*జ: ఆదిశ రాశులు*
*2) పాద రసం సాంద్రత ఎంత?*
*జ: 13.6 గ్రా / సెం.మీ.*
*3) మనిషి శరీరంలో ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే థర్మామీటర్ ను ఏమంటారు ?*
*జ: క్లినికల్ థర్మామీటర్*
*3) ఏదైనా భౌతిక రాశిని పూర్తిగా వర్ణించడానికి దిశ పరిమాణం రెండూ అవసరమైతే దానిని ఏమని అంటారు?*
*జ: సదిశరాశి*
*4) వస్తువు స్దానంలో నిర్ణీత దిశలో వచ్చే మార్పును ఏమంటారు ?*
*జ: స్దానభ్రంశం*
*5) పైకి విసిరిన వస్తువు కిందకి పడేటప్పుడు అది పొందే త్వరణాన్ని ఏమని అంటారు?*
*జ: గురుత్వరణం*
*6) నిట్ట నిలువుగా విసిరిన రాయి గరిష్ట ఎత్తుకు చేరుకున్నప్పుడు దాని వేగం ఎంత ఉంటుంది ?*
*జ: శూన్యం*
*7) వస్తువు గరిష్ట ఎత్తుని చేరడానికి పట్టే కాలాన్ని ఏమని అంటారు?*
*జ: ఆరోహణ కాలం*
*8) స్వేచ్చా పతన వస్తువు భూమిని చేరడానికి పట్టే కాలాన్ని ఏమంటారు?*
*జ: అవరోహణ కాలం*
*9) తడి టవల్ ను దులిపితే అందులో నుంచి నీటి బిందువులు బయటకు వస్తాయి. అందుకు కారణమేంటి ?*
*జ: జడత్వం*
*10) బనానా ఆయిల్ దేని నుంచి తయారు చేస్తారు ?*
*జ: పెట్రోలియం*
*11) బ్యాటరీలో శక్తి ఏ రూపంలో ఉంటుంది ?*
*జ: రసాయన శక్తి*
*12) థర్మామీటర్ ను మొదట రూపొందించింది ఎవరు ?*
*జ: గెలీలియో గెలిలీ*