Type Here to Get Search Results !

Vinays Info

Bit questions on Five year plannings,పంచవర్ష ప్రణాళికలు బిట్స్

పంచవర్ష ప్రణాళికలు బిట్స్

¤ ప్రపంచంలో ప్రణాళికలు అమలు చేసిన మొదటి దేశం - రష్యా

¤ 'ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా' (1934) గ్రంథ రచయిత - మోక్షగుండం విశ్వేశ్వరయ్య

¤ జాతీయ ప్రణాళికా కమిటీ 1938 అధ్యక్షుడు - నెహ్రూ (కాంగ్రెస్ నియమించింది)

¤ "A Plan for Economic Development" పేరుతో తయారు చేసిన ప్రణాళిక - బొంబాయి ప్లాన్ (1943)

¤ గాంధీ ప్రణాళిక (1944) తయారుచేసింది - శ్రీమన్నారాయణ అగర్వాల్

¤ ఎం.ఎన్. రాయ్ రూపొందించింది - ప్రజా ప్రణాళిక (1945)

¤ సర్వోదయ ప్రణాళికను రూపొందించింది - జయప్రకాశ్ నారాయణ (1950) 
¤ ప్రణాళికా సంఘం ఏర్పాటు - 1950 మార్చి 15

¤ ప్రణాళికా సంఘం అనేది - ఒక రాజ్యాంగేతర, శాసనేతర, సలహా సంస్థ

¤ ఆర్థిక ప్రణాళికలు - ఉమ్మడి జాబితాకు చెందినవి

¤ 'జాతీయ అభివృద్ధి మండలి' (NDC) ఏర్పాటు - 1952 ఆగస్టు 6

¤ ప్రణాళికలను రూపొందించేది ప్రణాళికా సంఘం అయితే ఆమోదించేది - జాతీయ అభివృద్ధి మండలి

¤ సూచనాత్మక ప్రణాళికను అమలు చేసిన మొదటి దేశం - ఫ్రాన్స్ (1947-50)

¤ నిరంతర ప్రణాళికల రూపకర్త - గున్నార్ మిర్డాల్

¤ భారత్‌లో నిరంతర ప్రణాళికలను తయారుచేసింది - లక్డావాలా

¤ 'ప్లానింగ్ ఫర్ ది పూర్' గ్రంథ రచయిత - బి.ఎస్. మిన్హాస్

మొదటి పంచవర్ష ప్రణాళిక (1951-56) 
¤ మొదటి ప్రణాళికకు ఆధారమైన నమూనా - హరడ్ డోమర్ నమూనా

¤ ఈ ప్రణాళికలో ప్రాధాన్యమిచ్చిన రంగం - వ్యవసాయం

¤ వ్యవసాయ రంగానికి చేసిన కేటాయింపులు - 31%

¤ మొదటి ప్రణాళిక వృద్ధిరేటు లక్ష్యం: 2.1% (సాధించింది 3.6%)

¤ కృష్ణమాచారి కమిటీ సిఫారసులతో ప్రారంభించిన పథకం - సమాజ అభివృద్ధి పథకం (1952)

¤ జాతీయ విస్తరణ సేవల పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం - 1953

¤ మొదటి ప్రణాళికలో ఏర్పాటైనవి: సేంద్రియ ఎరువుల కర్మాగారం (జార్ఖండ్), చిత్తరంజన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ (బీహార్), హిందుస్థాన్ షిప్‌యార్డ్ (విశాఖపట్నం), భారతీయ టెలిఫోన్ పరిశ్రమ (బెంగళూర్)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section