Type Here to Get Search Results !

Vinays Info

How to Book Telangana Swagruha Homes in online in Telugu

Top Post Ad

తక్కువ ధరలకే ప్రభుత్వ ఉద్యోగులకు ‘స్వగృహాలు

🔹ప్రభుత్వ ఉద్యోగుల సొంతింటి కలను నిజం చేసేందుకు చౌక ధరల్లో స్వగృహ గృహాలు విక్రయించాలని సర్కారు నిర్ణయించిందని గృహ నిర్మాణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.

♦ మౌలిక సదుపాయాలతో ఎలాంటి న్యాయవివాదాల్లేని గృహాలను సబ్సిడీ ధరలపై అందిస్తున్నామని, ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. శనివారమిక్కడ ఆన్‌లైన్లో ఫ్లాట్లను విక్రయించేందుకు వీలుగా రూపొందించిన వెబ్‌సైట్‌www.tsswagruha.cgg.gov.in ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌, గృహనిర్మాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌, గృహనిర్మాణ సీఈ సత్యమూర్తితో కలిసి ఆవిష్కరించారు.

♦ప్రభుత్వ ఉద్యోగుల కోసం బండ్లగూడ, పోచారంలో మొత్తం 3710 ఫ్లాట్లను విక్రయించనున్నట్లు తెలిపారు. బండ్లగూడలో నిర్మాణం పూర్తయిన వాటికి చదరపు అడుగు రూ.1900, సెమీ ఫినిష్డ్‌కు రూ.1700, పోచారంలో నిర్మాణం పూర్తయిన ఫ్లాట్‌కు చ.అ రూ.1700, సెమీ ఫినిష్డ్‌కు రూ.1500గా నిర్ణయించామని తెలిపారు. రెండు పడక గదుల నిర్మాణం వేగవంతమైందని, ఇప్పటికే 50వేల గృహాలు నిర్మాణంలో ఉన్నట్లు వివరించారు. మహబూబ్‌నగర్‌లో 1600 గృహాల నిర్మాణం దాదాపు పూర్తయ్యాయని చెప్పారు.

♦ హైదరాబాద్‌లో తక్కువ ధరకే గృహాలు లభిస్తున్నందున ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సీఎస్‌ తెలిపారు. విభజన తరువాత స్వగృహపై దాదాపు రూ.1069కోట్ల భారం పడిందని, ఇప్పటికే రూ.670కోట్ల రుణాన్ని తీర్చామని చిత్రారామచంద్రన్‌ తెలిపారు
click here

Below Post Ad