మే 29న ‘ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినం
_'ప్రతి ఒక్కరూ వారు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించడం ఎంతో ముఖ్యం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే వుంది.'_
*■ ముఖ్యంగా మనిషి ఆరోగ్యం జీర్ణ వ్యవస్ధపై ఆధారపడి ఉంటుంది. కొవ్వు పదార్ధాలు కాకుండా, ఎక్కువగా పీచు కలిగిన ఆహార పదార్ధాలను తీసుకోవాలి. తద్వారా జీర్ణ క్రియ సమస్యలు మటుమాయం అవుతాయి’ అని డాక్టర్లు తెలియజేస్తున్నారు.*
*◆ ప్రపంచ జీర్ణ వ్యవస్ధ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సిప్లా కంపెనీ ఆద్వర్యాన నిన్న హైదరాబాద్ లోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఉదయం విలేకరుల సమావేశం నిర్వహించి జీర్ణవ్యవస్ధకు సంబంధించిన ముఖ్య విషయాలను వివరించారు.*
*★ గుండె, ఎముకల ఆరోగ్యం, శరీరంలోని మిగిలిన భాగాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వెనుక జీర్ణ వ్యవస్ధ పనితీరు చాలా ముఖ్యమన్నారు.*
★ జీర్ణ వ్యవస్ధలో వచ్చే మార్పుల ద్వారా గ్యాస్ట్రోఇంటెస్టినల్ సమస్యల వల్ల గుండె మంట, కడుపు నొప్పి, అతిసారం, కడుపు ఉబ్బరం, వికారం, వాంతులు కలుగుతాయని చెప్పారు.
*★ తినే ఆహారంపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని, కొన్ని సార్లు తినే వస్తువులు ఉదర నాళం అసౌకర్యాలకు దారి తీస్తుందని చెప్పారు.*
★ చిరు తిండ్లు, ఘాటైన ఆహారం అధిక కెఫిన్, పంచదార సేవనం, తదితర అనారోగ్యకరమైన ఆహారం వల్ల ఉదర నాళంలో సమస్యలు వస్తాయన్నారు.
*★ అధిక కొవ్వుతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల పేగుల గీతలలో మార్పులు కలిగించి ఉదర నాళంలో కణితులు ఏర్పడేందుకు కారణమవుతుందన్నారు.*
★ ఎక్కువగా పీచు కలిగిన ఆహారపదార్ధాల ను తీసుకోవాలని, ఐబిడి, హెమరాయ్డ్సి, మలబద్ధం కలిగిన వ్యాధులను నివారించ వచ్చని అన్నారు.
*◆ మరో కార్యక్రమంలో జీర్ణ వ్యవస్ధ ప్రక్రియను తగ్గించే అధిక కొవ్వు కలిగిన ఆహారాన్ని పరిమితం చేసుకోవాలని డాక్టర్ సుబ్రహ్మణ్యం సూచించారు.*
*◆ సమయం ప్రకారం ఆహారాన్ని తీసుకోవా లని, పొగ తాగడం, మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ఆరోగ్యవంతమైన ఉదర నాళానికి ఆరోగ్యవంతమైన ఆహారం అవసరమని, తినే ఆహారంలో పీచు పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం, వంటకాల్లో ఆలీవ్ ఆయిల్‌ను వినియోగించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటా మని ఆయన స్పష్టం చేసారు. తీసుకునే ఆహారంలో సరిపడా ప్రొటీన్ ఉండేలా చూసుకోవాలని, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. ఒత్తిడి వల్ల కూడా అల్సర్ రావడానికి అవకాశాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలన్నారు. త్రేన్పులు వచ్చినా, అపాన వాయువులు ఎక్కువగా వచ్చినా గ్యాస్ట్రిక్ సమస్య ఏర్పడిందని అనుకోవడం కేవలం అపోహ అని తెలిపారు. ప్రపంచంలో గ్యాస్ట్రిక్ నివారణకు ఏటా రూ లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నారని డాక్టర్ సుబ్రహ్మణ్యం తెల్పారు*
◆ పసిరకలు,పానిక్రియాస్ సమస్యలతో పాటు మలబద్దకం, మలంలో రక్తం రావడం, కుటుంబ చరిత్రలో కొలన్ క్యాన్సర్ వంటి సమస్యలు, జీర్ణ సంబంధిత ఇబ్బందులుగా వస్తాయని ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరా లజిస్ట్, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ ఆర్.వి.రాఘవేందర్‌రావు తెలిపారు.
★ మొత్తం మీద మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలంటే ,జీర్ణవ్యవస్థలో ప్రధానమైన కాలేయం ను జాగ్రత్త గా కాపాడుకోవాలని ,అలాగే పైన తెల్పిన సూచనలు పాటిస్తే, జీర్ణ సంబంధిత ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు...
🌐సేకరణ:సురేష్ కట్టా-నెల్లూర్ సోషల్ టీచర్