లోక్సభ
▪1954లో లోక్సభ స్పీకర్ జి.వి.మౌలాంకర్ హౌస్ ఆఫ్ పీపుల్కు 'లోక్సభ' అని నామకరణం చేశారు.
▪దీన్ని ప్రజాప్రతినిధుల సభ, ప్రజల సభ, దిగువ సభ అని కూడా వ్యవహరిస్తారు.
▪ ఇది తాత్కాలిక సభ.
▪లోక్సభలో మొత్తం గరిష్ఠ సభ్యుల సంఖ్య 552. (రాష్ట్రాల నుంచి 530 స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 20 స్థానాలు, ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు)
▪ప్రస్తుతం లోక్సభలో మొత్తం సభ్యులు 545.
(530 మంది సభ్యులు రాష్ట్రాల నుంచి, 13 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఉంటే ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు ఉన్నారు)
▪ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు.
▪లోక్సభకు పోటీ చేయడానికి ఉండాల్సిన కనీస వయసు 25 సంవత్సరాలు.
▪లోక్సభ సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు.
▪లోక్సభలో ఒక పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలంటే 10% స్థానాలు కైవసం చేసుకోవాలి.
▪లోక్సభలో తొలి ప్రతిపక్ష నాయకుడు వై.బి.చవాన్.
▪ లోక్సభ సభ్యులను వయోజన ఓటుహక్కుతో ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు.
▪ లోక్సభ రెండు సమావేశాల మధ్య కాల వ్యవధి 6 నెలలకు మించకూడదు.
▪ 5వ లోక్సభ 6 సంవత్సరాలు పనిచేసింది.
▪అవిశ్వాస తీర్మానం ద్వారా మంత్రిమండలిని తొలగించే అధికారం లోక్సభకు ఉంది.
రాజ్యసభ
▪ రాజ్యసభను రాష్ట్రాల మండలి అంటారు.
▪1954లో రాజ్యసభగా నామకరణం చేశారు.
▪రాజ్యసభను పెద్దల సభ, ఎగువ సభ, మేధావుల సభగా వ్యవహరిస్తారు.
▪ ఇది శాశ్వత సభ.
▪ సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు.
▪ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3వ వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. వారి స్థానంలో కొత్తవారు ఎన్నికవుతారు.
▪రాజ్యసభలో గరిష్ఠ సభ్యుల సంఖ్య 250.
▪ వీరిలో 238 మంది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికవుతారు.
▪సాహిత్యం, శాస్త్రం, కళలు, th సామాజిక సేవల్లో ప్రసిద్ధులైన 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు.
▪ ప్రస్తుత రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245.