Type Here to Get Search Results !

Vinays Info

National Safty Day | జాతీయ భద్రతా దినోత్సవం

జాతీయ భద్రతా దినోత్సవం(National Safety Day) - 4 February

ఉద్దేశ్యం(Aim of national Safety Day)

  • జాతీయ భద్రతా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 4న నిర్వహించబడుతుంది. భద్రత, ఆరోగ్యం, వాతావరణం అంశాలపై కార్మికుల్లో అవగాహన కల్పించడంకోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు.

ఇందులో భాగంగా "నేషనల్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ క్యాంపేన్" మార్చి 4 నుండి వారంరోజులు చేపట్టనున్నారు. ఉద్యోగులు, సామాన్య ప్రజలు తమ జీవనవిధానంలో, వృత్తుల్లో భద్రత, ఆరోగ్య రక్షణను ఒక అంతర్గత భాగంగా మలుచుకునేలా చేయడం ఈ క్యాంపెన్ లక్ష్యం.

భారత ప్రభుత్వం, శ్రామిక మంత్రిత్వ శాఖ (లేబర్ మినిస్ట్రీ) 1966 మార్చి 4వ తేదీన జాతీయ భద్రతా మండలి(నేషనల్ సేఫ్టీ కౌన్సిల్)(National Safety Council )ని స్థాపించింది. భద్రత, ఆరోగ్యం పర్యావరణాల పై అవగాహన పెంపొందించడం ఈ మండలి లక్ష్యం. సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, సెమినార్లతో పాటు సేఫ్టీ ఆడిట్లు వంటి కార్యక్రమాలను ఈ మండలి నిర్వహిస్తుంది.

*భద్రతా మండలి అధ్వర్యము లోనే --" రహదారి భద్రతా దినోత్సవాలు , అగ్నిమాపక వారోత్సవాలు , ప్రపంచ పర్యావరణ దినోత్సవాలు " నిర్వహిస్తారు.*

*ప్రతిరోజూ పత్రికల్లో కనిపించే వార్త రోడ్డు ప్రమాదం . మన దేశములో ప్రతియేటా దాదాపు 60 వేల మంది నుండి లక్షమంది వరకు రోడ్డుప్రమా దాలకు గురై మరణించడం,తీవ్రం గా గాయపడడం జరుగుతున్నది . ఈ రోడ్డు ప్రమాదాలలో అత్యధి కం మానవ తప్పిదాలవల్ల జరుగుతున్నవే.వాహనదారు లు అతివేగం గా నడపడం , రహదారుల మీద నడిచేవారు చూపే నిర్లక్ష్యం వంటివి ఈ ప్రమాదాలను సృష్టిస్తున్నాయి.*

వీటితో పాటుగా కర్మాగారాలలో జరిగే ఇతర ప్రమాదాలు , అగ్నిప్రమాదాలు వంటివి నిత్యం సంభవిస్తున్నాయి. పనిచేసేందుకు వెళ్ళిన వారు తిరిగి క్షేమం గా ఇంటికి వస్తారో ... రారో అన్నఆందోళనతో కుటుంబసభ్యులు బతకా ల్సివస్తుంది. కుటుంబ పెద్దకు ప్రమాదము జరిగినా .. ప్రమాదము లో మరణించినా ఇక ఆ కుటుంబము మొత్తము కోలుకోనివిధం గా దెబ్బతుంటుంది.

అందుకే ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత గా భద్రతను పాటించాలి.ప్రతి కార్మికుడూ తాను తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటే , సూచించిన పద్దతులను పాటిస్తే ప్రమాదాలు సంభవించవు . స్వాతంత్రం రాకముందు మన దేశములో పారిశ్రామికీకరణ అంతంత మాత్రమే,  ఆ తరువాత పెరిగిన పరిశ్రమలతో పాటు ప్రమాదాలూ పెరగడం మొదలైనది .

నాడు ప్రముఖ పారిశ్రామిక కేంద్రము ముంబై . కార్మికుల భద్రత గురించి చర్చ అక్కడ మొదలైనది . 1962 లో జరిగిన రాష్ట్ర కార్మిక శాఖామంత్రుల సమావేశములో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన ఆంశాలమీద చర్చ జరిగింది . ప్రమాదాల పట్ల అప్రమత్తత పెంచాలంటే ప్రచారము అవసరమని,అందుకు దానిని నిర్వహించడానికి , కార్మికులలో భద్రత పట్ల అవగాహన పెంచేందుకు ప్రబుత్వపరం గా ఒక సంస్థ అవసరమని గుర్తించారు . ఆ తర్వాత పారిశ్రామిక భద్రత మీద తొలి సమా వేశము 1965 లో ఢిల్లీ లో నిర్వహించారు . కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు , కార్మిక సంఘాలు , ఉద్యోగ సంఘాలు , పలు సంస్థలు పాల్గొన్న ఆ సభలో జాతీయ , రాష్ట్ర స్ఠాయిల్లొ భద్రతామండలి ప్రారంభించాలని నిర్ణయించారు . డిసెంబర్ లో ఆ సమావేశము జరుగగా .. మార్చి 04 -1966 న జాతీయ భద్రతామండలి రూపుదిద్దుకున్నది . కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఆ మండలి ప్రారంభమయిన మార్చి 04 నే జాతీయ భద్రతా దినోత్సవం గా జరపాలని నిర్ణయించారు.

*ఆ రోజు నుండి వారం రోజులు పాటు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తారు . స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన ఈ సంస్థ భద్రత , ఆరోగ్యము , పర్యావరణ అంశాలను దేశములోని వివిధ ప్రాంతాలకు చేరవేయడం ప్రధాన లక్ష్యం గా పెట్టుకుంది . పారిశ్రామిక రంగానికి చెందిన వారినందరినీ ఇందులో భాగస్వాములను చేయడం రెండవ లక్ష్యము . భద్రత కల్పించ డంలో ప్రతి ఒక్కరూ తమవంతు పాత్రను గుర్తెరిగి అనుసరింపచేసేందుకు ఈ సంస్థ కృషిచేస్తుంది.*

ప్రతి పనిలోను ఏదో ఒక ప్రమాదము పొంచివుంటుంది . కొన్ని రకాల ప్రమాదాలు ముందుగా పసికట్టలేము . కాని ప్రమాదాలలో అధికశాతము అజాగ్రత్తవల్ల సంభవించినవే . అవి రహదారి ప్రమాదాలైనా , పారిశ్రామిక ప్రమాదాలైనా ఒకటే . నానాటి ప్రమాదాల సంఖ్య పెరుగున్నందున, ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి, అవి జరిగినపుడు ఎలా స్పందించాలనే అంశాలను చిన్న చిన్న ఫిల్మ్‌ ద్వారా ప్రదర్శించి,ప్రజలను చైతన్యవంతం చేయడం వీరి ప్రధాన లక్ష్యం.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section