నేడు 'ప్రపంచ వివాహ దినోత్సవం' సందర్భంగా..
"భారతీయ వివాహ పధ్ధతి యందలి పవిత్రత, గౌరవం , ఆశయం, ఆదర్శం ప్రపంచమందలి మరి ఏ యితర దేశమందుగాని, మతమునం దుగాని గానజాలము". ....అనిబిసెంటు.
🔻అమెరికాలో మొదలయిన వేడుక ఈ ప్రపంచ వివాహ దినోత్సవం(world marriage Day). వైవాహిక జీవిత ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ సమాజ నిర్మాణానికి ఆధారము, ఆలంబనం అయిన భార్యాభర్తల్ని కుటుంబ పెద్దలుగా భావించి , గౌరవించే సంప్రదాయాన్నీ పాటిం చాలని , దాన్నో సంస్కృతిగా అలవరుచు కోవాలని ' వరల్డ్ మ్యారేజ్ డే' అమూల్యమైన సందేశము అందిస్తోంది.
🔻సమాజానికి మౌలిక పునాది అయిన భార్యాభర్తలను గౌరవించే ప్రత్యేక రోజుగా (ఫిబ్రవరి నెలలో 2వ ఆదివారాన్ని) 1983 నుండి "వరల్డ్ మ్యారేజ్ డే"గా రూపాంతరం చెందినది .
*🔻మతమేదయినా వివాహధర్మ మొకటే ' సహజీవన సౌందర్యం'. పాశ్చాత్య నాగరికతా మోజులో పడి భారత యువత ఎంతగా భ్ర ష్టుపట్టిపోతుందో మనకి తెలియంది కాదు. ప్రేమ పేరుతో వంచనలు, దురాగతాలు అంతు లేకుండా పోతున్నాయి. భాధ్యతగలిగిన పౌరులే కాదు సమాజంలో హోదా,పరువు వున్న వారు కూడా ఈనాడు వివాహేతర సంబంధాలతో విచ్చలవిడి శృంగారాన్ని .. ఇపుడు ఒక స్టేటస్ గా భావిస్తున్నారు. సర్వత్రా నైతిక విలువలు లోపిస్తున్నాయి. యావత్ ప్రపంచంలోనే అత్యధిక యవశక్తి ఉన్నదేశం మన భారతదేశం.యువత సన్మార్గం లో నడుచుకుంటే భారతదేశాన్ని మించిన మరొ దేశంఈ ప్రపంచంలోఉండదంటే అతిశయోక్తి కాదు.*
*🔻సంఘంలో సదాచారాలను, సాంఘిక న్యాయాన్ని విశ్వజనీనంగా ఏర్పాటుచేసి సువ్యవస్థను రూపొందిచిన వారు మన పూర్వీకులు. ప్రపంచంలో ఎక్కడా లేని వివాహ సంస్కృతి మనది. భిన్న కుటుంబం లో పుట్టి, భిన్న వాతావరణం లో పెరిగి, భిన్న అలవాట్లను, అభిప్రాయాలను కలిగి ఉన్న ఇద్దరు మనుషులను ఒక పసుపు తాడు ప్రేమానురాగాలతో ఆజన్మాంతం కట్టిపడేసే పటిష్టమైన వివాహ బంధం మనది. మన పూర్వీకులు మనకందించిన ఈ సంస్కృతీ సంప్రదాయాలను మన ముందుతరాలకు అందిచాల్సిన బాధ్యత మనందరిది.*
*🍥కష్టసుఖాల కలబోత.. ఈ వివాహ బంధం*
🔻వివాహ వ్యవస్థలో ఎన్నో లోపాలున్నాయి.. కోపాలున్నాయి.. గొడవలున్నాయి.. రాజీలున్నాయి.. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి.ఒక ఆడ, ఒక మగ.. ఇద్దర్నీ ఒక్కటి చేసేందుకు ఇంతకంటే బలమైంది.. ఇంతకంటే పవిత్రమైంది.. ఇంతకంటే చట్టబద్ధమైంది..మరోకటి లేదు..
🔻ప్రేమకు షరతులుండవు. 'నిబంధనలు వర్తిస్తాయి' అన్న నక్షత్రం గుర్తులుండవు. మనకు నచ్చని లక్షణాలు ప్రేమించుకుంటున్న రోజుల్లోనో, పెళ్లయిన కొత్తలోనో బయటపడక పోవచ్చు. బయటపడినా, ఆకర్షణ తీవ్రత వల్ల అంత తీవ్రంగా అనిపించకపోవచ్చు. ఆతర్వాత అసంతప్తిగా అనిపించవచ్చు.
🔻అయినా సరే.. ఆ లోపంతో సహా ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి. అలాగని వ్యసనాల్ని, దురలవాట్లని ప్రోత్సహించమని కాదు. అలాంటివి ఉంటే, చర్చించుకోవాలి. సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి. అందుకు, మనవంతు సహకారం తప్పకుండా అందించాలి.
🔻ఖర్చుచేసినప్పుడే డబ్బుకు విలువ. ప్రేమ కూడా అంతే. గుండెల నిండా ఉండొచ్చు. మనసులో గుడి కట్టుకుని ఉండొచ్చు. ఎప్పుడైనా చెప్పారా?, నువ్వంటే నాకిష్టమని మనసు విప్పారా? వ్యక్తం చేసినప్పుడే ప్రేమకు విలువ. ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక మార్గం... నిండైన, నిజమైన ప్రశంస.
🔻అవును, ప్రశంస పాయసంలో జీడిపప్పు లాంటిది. కాపురానికి కొత్తరుచి తెస్తుంది. అలాగని స్తోత్రపాఠాలు చెప్పనక్కర్లేదు. మనస్ఫూర్తిగా ఓ మాట చాలు. కాస్త రొమాంటిక్‌గా చెప్పడం అదనపు ఆకర్షణ.
మనసు విప్పి మాట్లాడుకోవాలి
ప్రతి క్షణము భాగస్వామితో కలిసి గడపాలనుకోవడం అంత మంచిది కాదు. అంటి పెట్టుకు తిరగడం వలన , వెన్నంటి ఉండడం వలన అతడు / ఆమె కు ఆ పరిస్థితి ఇబ్బందికరంగా ఉండవచ్చు. దానివలన ఏదైన చేయడానికి సరిగా ప్రయత్నించలేరు. సలహా చెప్పడానికి సమయానికి ఆయనో , ఆవిడో లేదని అనుకోవలసిన పరిస్థితి ఎదురయ్యే విధంగా మసలుతూ ఉండాలి.
🔻అభిప్రాయాలు నిర్మొహమాటంగా వెళ్లడించు కోవాలి. ప్రశాంతంగా వ్యవహరించుకోవాలి. ఆరోపణ, అభియోగాల ధోరణి ఉండకూడదు. ఇద్దరి మధ్య చర్చ ఉండకూడదు, స్పష్టత ఉండాలి. భాగస్వాముల్లో ఏకపక్ష నిర్ణయాలు, ప్రయత్నాలు ఆశించినంత ఫలితాలు ఇవ్వవు. కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు.
🔻వారాంతము రోజుల్లో షికారులు, సినిమాలు ఉండాలి. పెళ్లిల్లు, ఫంక్షన్లు, గుడి గోపురాలకు కలిసే వెళ్లాలి . భక్తి అయినా రక్తి అయినా ఒకే బాటలో నడవాలి.
🔻కొన్ని విషయలలో రాజీ పడడం అవసరం.. మొండి వాదనకు దిగరాదు .. కుక్కతోక వంకర అన్నట్లు మెలగరాదు.నమ్మకం ఎంత బలంగా ఉంటే కాపురం అంత సంతోషంగా ఉంటుంది. ఎంత బలహీనపడితే, అంత నరకం అవుతుంది.
*🔻నమ్మకం ఉన్నచోట అభద్రత ఉండదు.. అనుమానాలు ఉండవు.. హింస ఉండదు.. రహస్యాలు ఉండవు.. వాటిని కప్పిపుచ్చుకో డానికి ఆత్మవంచనలుండవు. అయితే నమ్మకం ఒకరోజులో ఏర్పడదు. ఒకరోజుతో బలపడదు. ఇద్దరూ కలిసి దాన్నో బిడ్డలా పెంచి పెద్దచేయాలి.*
🔻భార్య భర్తల అన్యోన్యతా జీవనము తమ పిల్లల మంచి మనుగడకు దోహదపడుతుంది.
🍒🕊✍సే:సురేష్ కట్టా (సోషల్ టీచర్)