ఇంద్రజాలం ! మహేంద్రజాలం !!
ప్రపంచ ఇంద్రజాల దినోత్సవ సందర్భంగా..
*🔅ఇంద్రజాలం ఒక విధమైన కళారూపము. భారతదేశం "ఇంద్రజాల భూమి" (Land of Magic) అని ప్రసిద్ధిచెందినది. ఇక్కడ వీధులలోను, వేదికల మీదా ఇంద్రజాల ప్రదర్శనలు జరుగుతాయి. ఇంద్రజాలం గురించి హిందూ పురాణాలైన వేదాలు మరియు ఉపనిషత్తులలో ప్రస్తావించబడింది.*
*🔅ఇంద్రజాలం హిందువుల దేవరాజైన ఇంద్రుడు (Indra) మరియు జాలం (Net) అనే రెండు పదాల కలయిక వలన ఏర్పడింది. భారతీయ సాంప్రదాయ ఇంద్రజాలం లో పేరుపొందినవి భారతీయ తాడు, భారతీయ తట్ట, పచ్చ మామిడి మర్మం, కప్పులు మరియు బంతి, ఎగిరే మనిషి.*
*🌼ప్రసిద్ధ ఇంద్రజాల విద్యలు*
▪నీటి మీద నడవడంతాళం వేసిన పెట్టెలో నుండి బయటకు రావడం.
▪చేతులు కాళ్ళు తాడుతో కట్టించుకొని మూతి కట్టిన సంచిలో కూర్చొని నీటిలోకికి విస్రివేయబడ్డ సంచిలో నుండి బయటకు రావడం.
▪పావురాలు మాయం చేయడంఒకే రంగు గుడ్డ నుండి రకరకాల రంగుల గుడ్డలు తీయడం.
▪మాయంచేసిన నాణెములను ప్రేక్షకుల జేబుల నుండి తీయడం.
▪ఇండియన్ రోప్ ట్రిక్ : ఓ వ్యక్తి నాదస్వరం ఊదుతూ ఉంటే చుట్టగా చుట్టిన తాడు పాములాగా పైపైకి లేస్తుంది. ఆ తరువాత ఆ వ్యక్తి దానిని పట్టుకుని పైకి ఎగబ్రాకుతాడు.
🔅ఇక ఎందరో వివిధరంగాల్లో వున్న వ్యక్తులు మాజిక్ కళను హాబీగా ఎంచుకొని ప్రజల్లో వున్న కొన్ని మూఢనమ్మకాలను తొలగించడానికి పయత్నిస్తున్నారు.
*☀మన దేశంలో పి.సి.సర్కార్ దేశవిదేశాల్లో ఇంద్రజాలికుల్లో అగ్రగణ్యునిగా ఖ్యాతిని పొందారు.*
🔅ఆనాటి చందమామ పాఠకులకు పి.సి.సర్కారు చిన్న చిన్న మాజిక్కులను ప్రతి నెలా పాఠకులకు చెప్పేవారు. ఆయన కుమారుడు సర్కార్ జూనియర్ తండ్రి జాడలో నడుస్తుంటే ఆయన కుమార్తెకూడా తండ్రితో పాటు మాజిక్ ప్రదర్శనలలో పాల్గొంటూ రాణిస్తున్నారు.
🔅ప్రపంచ ఇంద్రజాల దినోత్సవ సంధర్భంగా ఇంద్రజాలప్రేమికులకు, ఇంద్రజాల మిత్రులకు శుభాభినందనలు..
సే:సురేష్ కట్టా(సోషల్ టీచర్)