Type Here to Get Search Results !

Vinays Info

భారతదేశంలో పేదరికం తీరుతెన్నులు

భారతదేశంలో పేదరికం తీరుతెన్నులు:

🔹భారతదేశం ప్రపంచంలో  జాతీయాదాయంలో 7వ ర్యాంక్‌తో ధనిక దేశంగా, HDIలో 135వ ర్యాంక్‌తో పేద దేశంగా ఉంది. అంటే దేశంలో అసమానతలు చోటుచేసుకున్నాయి. దీని వల్ల ధనిక, పేద వర్గాల మధ్య వ్యత్యాసాలు ఎక్కువగా వున్నాయి. అందువల్ల భారత్‌లో నిరపేక్ష పేదరికం, సాపేక్ష పేదరికం రెండూ ఉన్నాయి.

🔹ఇండియాలో 1/5వ వంతు జనాభా పేదరికంలో మగ్గిపోతోంది.
🔹J.M. కీన్స్ అనే ఆర్ధిక వేత్త ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రధాన సమస్య మూలధన కొరత, దీని వల్ల ఈ దేశాలు అనేక రకాల ఆర్థిక సమస్యలకు గురవుతాయి. అందులో ప్రధానమైనది పేదరికం. కనుక పేదరికానికి ప్రధాన కారణంగా మూలధన కొరతను పేర్కొనవచ్చు.
🔹భారత దేశంలో పేదరికానికి మరొక ప్రధాన కారణం ప్రాథమిక రంగాన్ని(వ్యవసాయ రంగం) బలోపేతం చేయకపోవడం.

🔹NSSO- 68వ రౌండ్ లెక్కల ప్రకారం – 2011-12లో భారత్‌లో పేదరికం (BPL) 21.90 శాతంగా నమోదైంది.
భారత్‌లో పేదరికం ఎక్కువగా గ్రామాల్లో ఉంది. ఇందులో 25.7 శాతం గ్రామీణ ప్రాంతాల్లో 13.7 శాతం పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు.

🔹అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వినియోగం అధికంగా ఉండి దిగుమతులకు దారితీస్తుంది. ఇలా దిగుమతి అయిన వస్తువుల ధరలు అధికంగా ఉండటంతో పేదరిక తీవ్రత పెరిగే అవకాశం ఉంది.
డాక్టర్ సి.రంగరాజన్ రిపోర్ట్ ప్రకారం భారత్‌లో ప్రతి ముగ్గురిలో ఒకరు పేదరికంలో ఉన్నారు.

బ్రిటీష్‌వారి ప్రభావం:

🔹ఇండియాలోని పేదరికానికి బ్రిటీష్ పాలన ప్రధాన కారణం. ఎందుకంటే భారత్ ఒక కాలనీగా మార్చబడిన భారత పారిశ్రామిక రంగం, ఆహార పంటలు, సుసంపన్నమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, చేతివృత్తులు, సహజ వనరులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

🔹బ్రిటీష్ ఆర్థిక దోపిడీ గురించి దాదాబాయి నౌరోజీ 1868లో రాసిన Poverty and Un-British Rule in India –  Drain of Wealth Theory  గ్రంథంలో తెలుసుకోవచ్చు.

అంతర్జాతీయంగా పేదరికం:

🔹అంతర్జాతీయంగా పేదరికాన్ని IPL – International Poverty Line ద్వారా లెక్కిస్తారు. దీని ద్వారా రోజుకి 1.90 డాలర్లను ఆర్జించేవారిని బట్టి లెక్కిస్తారు. IPL ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 30 శాతం పేదరికం కలదు.
🔹రోజువారీ ఆదాయం 1.90 డాలర్లు కంటే తక్కువ ఉంటే పేదవారు. IPL ను అక్టోబర్, 2015 లో World Bank 1.25 డాలర్ల నుంచి 1.90 డాలర్లకు మార్చింది.
🔹IPL ప్రకారం 3వ ప్రపంచ దేశాల్లో అత్యధికంగా అంటే ఆఫ్రికా, ఆసియా, కరేబియన్ దేశాల్లో పేదరికం ఎక్కువగా ఉంది.

భారత్‌లో పేదరికస్థాయిని లెక్కించే విధానం:

🔹దేశంలో పేదరికాన్ని లెక్కించడానికి 1950 లో National Sample Survey Organisation (NSSO) ను స్థాపించారు.
🔹భారత దేశంలో పేదరికాన్ని MPCE (Monthly Per Capita Consumption Expenditure) – నెలసరి తలసరి ఖర్చు ద్వారా లెక్కిస్తారు.
దీని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో MPCE – రూ. 816గా, పట్టణ ప్రాంతాల్లో MPCE – రూ. 1000 గా నిర్ణయించారు.
దీని కన్నా ఎక్కువగా MPCE ఉంటే APL (Above Poverty Line) అంటే పేదరిక స్థాయికి ఎగువన వున్నవారిగా , తక్కువగా ఉంటే BPL (Below poverty Line) అంటే పేదలుగా నిర్ణయిస్తారు.
🔹HCR (Head Count Ratio) : దీనిని దండేకర్ & రథ్‌ లు రూపొందించారు.
🔹HCR =  (పేదవారి సంఖ్య/ మొత్తం జనాభా) X 100
🔹HCR పద్ధతిలో Poverty Line  ఆధారంగా పేదవారి సంఖ్యను లెక్కించి మొత్తం జనాభాలో శాతంగా చెబుతారు.
🔹తీసుకునే ఆహారంలోని కేలరీలను బట్టి కూడా పేదరికాన్ని నిర్ణయిస్తారు. దీని  ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో – 2400 కేలరీలు, పట్టణ ప్రాంతాల్లో – 2100 కేలరీలను నిర్ణీత స్థాయిగా నిర్ధారించారు. ఈ స్థాయి కన్నా తక్కువ తీసుకుంటే  వారిని పేదవారిగా BPL గా పరిగణిస్తారు.
🔹Food and Agriculture Organisation (FAO)  ప్రకారం తలసరి రోజువారీ ఆహారం 448 గ్రాములుగా నిర్ణయించారు.
🔹పేదరిక రేఖ (Poverty Line) – పేదల సగటును తెలుపుతుంది
🔹PGI (Poverty Gap Index): పేదరిక  తీవ్రత (Intensity)ని తెలుపుతుంది.
🔹1997లో United Nations Development Program (UNDP) Human Development Index (HDI)లో- Human Poverty Index (HPI)ను ప్రవేశపెట్టింది.

NSSO-68వ రౌండ్ లెక్కల ప్రకారం దేశంలో పేదరికం:

🔹గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ తలసరి వ్యయం – రూ. 27.20, పట్టణ ప్రాంతాల్లో రోజువారీ తలసరి వ్యయం – రూ. 33.30 కన్నా తక్కువగా ఉన్నవారందరూ BPL కిందికి వస్తారు. అంటే ఇంతకంటే తక్కువగా ఖర్చు చేసేవారంతా పేదలే అని అర్థం.
🔹ఇదే MPCEకి తీసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో – రూ. 816 గా, పట్టణ ప్రాంతాల్లో – రూ. 1000గా  నిర్ణయించారు.
🔹NSSO ప్రకారం 2011-12 సంవత్సరంలో మొత్తం జనాభాలో 21.9 శాతం ప్రజలు పేదవారిగా (BPL) ఉన్నారు.
🔹ఇందులో 25.7 శాతం గ్రామీణ ప్రాంతాల్లో 13.7 శాతం పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు.
🔹NSSO ప్రకారం కనీస అవసరాలు అంటే:
1. వస్ర్తాలు
2. పాదరక్షలు
3. గృహవసతి
4. మన్నిక గల వస్తువులు (Consumer Durable Goods)
5. విద్య, వ్యవస్థాపక వైద్యఖర్చులు మొదలైనవి

పేదరిక సమస్య దుష్ప్రభావాలు:

🔹అసమానతలు
🔹నిరుద్యోగ సమస్య (Unemployment)
🔹ఆదాయ అసమానతలు (Income Inequalities)
🔹మాతా, శిశు మరణాలు అత్యధిక (IMR, MMR) నమోదు
🔹పౌష్టికాహారలోపం (Malnutrition)
🔹ప్రాంతీయతత్వం (Regionalism)
🔹అనారోగ్యం, అపరిశుభ్ర పరిస్థితులు
🔹పని గంటలు తగ్గిపోవడం,
🔹నిరక్షరాస్యత, సామాజిక దుష్ప్రభావాలు
🔹నివాస సదుపాయాలు లేకపోవడం
🔹దేశం, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందకపోవడం

UNO – సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (Sustainable Development Goals – SDG)- ప్రపంచ పేదరికం:

🔹UN సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (Sustainable Development Goals SDG) లో ప్రథమ లక్ష్యం (SDG 1) పేదరిక నిర్మూలన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతీ ఐదుగురిలో ఒకరు 1.25 డాలర్ కన్నా తక్కువ ఆదాయంతో ప్రతిరోజూ జీవిస్తున్నారు.
836 మిలియన్ ప్రజలు అత్యంత పేదరికంలో నివసిస్తున్నారు.
🔹చిన్న, ఆర్థికంగా బలహీన దేశాల్లో, ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న దేశాల్లో (సిరియా, ఇరాక్, జోర్డాన్) పేదరిక రేటు అధికంగా నమోదవుతున్నట్లు UNO పేర్కొంది.

పేదరిక రకాలు:

🔹పేదరికం రెండు రకాలుగా ఉంటుంది. అవి: 1.సాపేక్ష పేదరికం (Relative Poverty) 2. నిరపేక్ష పేదరికం(Absolute Poverty)

1.సాపేక్ష పేదరికం:

🔹ప్రజల ఆదాయ పంపిణీని తులనాత్మకంగా అంచనా వేసి పైస్థాయిలో 5 నుంచి 10 శాతం ప్రజల జీవనస్థాయితో (ఎక్కువ ఆదాయస్థాయి) దిగువ స్థాయిలోని 5 నుంచి 10 శాతం ప్రజల జీవనస్థాయి (తక్కువ ఆదాయ స్థాయి)ని పోల్చి సాపేక్ష పేదరికాన్ని నిర్ణయిస్తారు.
🔹USA, U.K, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన అత్యధిక ధనిక దేశాల్లో కూడా సాపేక్ష పేదరికం ఇప్పటికీ ఉంది.
🔹అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ పేదరికం కనిపిస్తుంది. ఈ పేదరికానికి కారణం ఆదాయ అసనమానతలు.

2.నిరపేక్ష పేదరికం:

🔹కనీస జీవనాధార వినియోగాన్ని కూడా పొందలేని స్థితిని నిరపేక్ష పేదరికం లేదా పేదరికం అంటారు.
🔹సాధారణంగా పేదరికం అంటే నిరపేక్ష పేదరికమే
భారతదేశంలోని పేదరికం అంటే Absolute Poverty.
🔹అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేదరికం నిరపేక్ష పేదరికం
🔹పేదరికం అనేది బహుముఖాలు కలిగిన సామాజిక, ఆర్థిక సమస్య

👉పేదరికాన్ని అంచనా వేసే పద్ధతులు:

🔹URP – Uniform Recall Period : దేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి 30 రోజుల్లోని ఐదు రకాల ఆహారేతర వస్తువులను మినహాయించి అన్ని రకాల వస్తువులపై చేసిన వినియోగ వ్యయాన్ని లెక్కిస్తారు. వస్ర్తాలు, పాదరక్షలు, మన్నిక గల వస్తువులు, విద్య, వైద్యం మొదలైనవి.
MRP:  Mixed Recall Period: 5 రకాల ఆహారేతర వస్తువులపైన (Non Food Items) 365 రోజుల్లో చేసే వినియోగ వ్యయాన్ని 30 రోజులతో ఇతర వస్తువులపై చేసే ఖర్చును అంచనా వేసి MRP లెక్కిస్తారు.

👉పేదరిక నిర్మూలన చర్యలు:

👉పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలు:

🔹Atal Mission for Rejuvenation and Urban Transformation (AMRUT) అమృత్, 2015
🔹Smart Cities Program, 2015
🔹Housing for All by 2022 –
🔹Swarna Jayanti Shahari Rojgar Yojana (SJSRY), స్వర్ణ జయంతి పట్టణ ఉపాధి పథకం, 1997
🔹National Urban Health Mission (NUHM) – జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్
🔹స్వచ్ఛ భారత్ – అర్బన్
🔹UIDSSMT (Urban Infrastructure 🔹Development Scheme for Small and Medium Towns)

👉గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలు:

🔹 SAGY – సంసద్ ఆదర్శ్ గ్రామజ్యోతి యోజన
🔹DDUGYY : దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామజ్యోతి యోజన
🔹SPM RUrban Mission: శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్
🔹MGNREG : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
🔹IRDP – సమీకృత గ్రామీణ అభివృద్ధి కార్యక్రమం
🔹IAY – ఇందిరా ఆవాస్ యోజన
🔹స్కిల్ ఇండియా (Skill India)
🔹ముద్రా యోజన (Mudra Yojana)
🔹PMJDY – ప్రధానమంత్రి జనధన్ యోజన
🔹NSAP – జాతీయా సామాజిక సహాయతా కార్యక్రమం
🔹NRLM – AAJEEVIKA
🔹PMGSY -ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన
పై పథకాల ద్వారా భారత్‌లో పేదరిక నిర్మూలన చర్యలు చేపట్టారు.

Click here follow us on Facebook

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section