Type Here to Get Search Results !

Vinays Info

ఐ.ఎన్.ఎస్. షల్కి ~1992న నౌకాదళం లోచేరిన రోజు,ఈ సందర్భంలో..భారతీయ,నౌకా దళంలోని మన జలాంతర్గాములు

ఐ.ఎన్.ఎస్. షల్కి ~1992న  నౌకాదళం*
*లోచేరిన రోజు,ఈ సందర్భంలో..భారతీయ*
*నౌకా దళంలోని మన  జలాంతర్గాములు గురించి..*✍సురేష్ కట్టా(సోషల్ టీచర్)
🔻భారతీయ నౌకా దళం భారత సాయుధ బలగాలలో ఒక శాఖ.భారతీయ రాష్ట్రపతి దీనికి అధిపతిగా వ్యవహరిస్తారు. 5000 మంది నౌకా వైమానిక దళ సభ్యులు,2000 మంది నౌకా దళ కమెండోలతోసహా యుధ్ధ సన్నద్ధంగా ఉండే 55,000 మంది సభ్యులు గలిగి ప్రపంచంలో 5వ పెద్ద నౌకాదళం గా వుంది. భారత నౌకా దళం 155 నౌకల్ని కలిగి ఉంది.ఆసియాలో జెట్ యుద్ధ విమానాల్ని కలిగి ఉన్న విమాన వాహక నౌకని, నడిపే ఏకైక నావికా దళం.

🔻భారత నౌకాదళంలో చేరిన కొన్ని జలాంతర్గాములు - వాటి తేదీలు

🔻భారత నౌకాదళంలోని అన్ని యుద్ధ నౌకలకు ముందు 'ఇండియన్ నేవల్ షిప్' (ఐ.ఎన్.ఎస్), జలాంతర్గాములకు ముందు 'ఇండియన్ నేవల్ సబ్ మెరైన్ (ఐ.ఎన్.ఎస్) ' అని చేరుస్తారు.

*జలాంతర్గామిపేరు..చేరిన తేది*

‍ *🔹ఐ.ఎన్.ఎస్.సింధుధ్వజ్~ 12 జన వరి,1987*

*🔹ఐ.ఎన్.ఎస్. వజ్ర బాహు~01 ఫిబ్రవరి 1996*
🔻ఇది జలాంతర్గామి కాదు. ఒడ్డున ఉండే ముంబై లోని కార్యాలయం

*🔹ఐ.ఎన్.ఎస్. షల్కి ~07 ఫిబ్రవరి 1992*

*🔹ఐ.ఎన్.ఎస్. సింధుఘోష్ ~30 ఏప్రిల్ 1986*

*🔹ఐ.ఎన్.ఎస్. వీరబాహు ~ 19 మే 1971*
🔻ఇది జలాంతర్గామి కాదు. ఒడ్డున ఉండే విశాఖపట్నంలోని కార్యాలయం

*🔹ఐ.ఎన్.ఎస్. షంకుల్ ....~28 మే 1994*

*🔹ఐ.ఎన్.ఎస్. సింధువీర్..~11 జూన్ 1988*

*🔹ఐ.ఎన్.ఎస్. సింధుశస్త్ర...~19 జూలై 2000*

*🔹ఐ.ఎన్.ఎస్. వగ్లి ...... ~10 ఆగష్టు 1974*

*🔹ఐ.ఎన్.ఎస్. వేల ...... ~31 ఆగష్టు 1973*

*🔹ఐ.ఎన్.ఎస్. షిషుమార్~22 సెప్టెంబరు1986*

*🔹ఐ.ఎన్.ఎస్. సింధురాజ్ ~20అక్టోబరు 1987*

*🔹ఐ.ఎన్.ఎస్. సింధురత్న~19నవంబరు1988*

*🔹ఐ.ఎన్.ఎస్. షంకుష్ ..~ 20 నవంబరు1986*

*🔹ఐ.ఎన్.ఎస్. సింధుకీర్తి ~09 డిసెంబరు1989*

*🔹ఐ.ఎన్.ఎస్.సింధు విజయ్~17డిసెంబర్1990*

*🔹ఐ.ఎన్.ఎస్.సింధు కేసరి~19డిసెంబర్1988*

*🔹ఐ.ఎన్.ఎస్.శాతవాహన~ 21 డిసెంబర్1974*

🔻ఇది జలాంర్గామి కాదు. ఒడ్డున ఉండే విశాఖపట్నంలోని కార్యాలయం)

*🔹ఐ.ఎన్.ఎస్.సింధు రక్షక్ ~24డిసెంబర్1997*

*🔹ఐ.ఎన్.ఎస్ విరాట్*
🔻27 సంవత్సరాల సేవ తరువాత 2016 లో ఈ నౌకను నౌకాదళం నుండి విరమింపజేసారు. 2013 లో ఐ.ఎన్.ఎస్ విక్రమాదిత్య కమిషను కాకముందు, విరాట్‌యే భారత నౌకాదళపు ఫ్లాగ్‌షిప్ నౌక. పని విరమించే ముందు వరకూ ఇది ప్రపంచంలోనే అత్యంత పాత విమాన వాహక నౌక. 1959 లో బ్రిటిషు నౌకాదళంలో హెచ్ ఎం ఎస్ హెర్మెస్‌గా చేరిన ఈ నౌకను 1987లో భారత్ కొని, 1987 మే 12 న ఐ ఎన్ ఎస్ విరాట్‌గా పేరు పెట్టింది.

*🔹ఐ.ఎన్.ఎస్ విక్రమాదిత్య*
🔻విక్రమాదిత్య భారత్ రష్యా నుండి కొనుగోలు చేసిన  విమాన వాహక నౌక. కీయెవ్ తరగతికి చెందిన అడ్మిరల్ గోర్ష్‌కోవ్ విమాన వాహక నౌకను విక్రమాదిత్యగా పునర్నిర్మించారు. ఇది 2013 లో భారతీయ నౌకాదళం లోకి ప్రవేశించింది.

*🔹ఐ.ఎన్.ఎస్. విక్రాంత్ (2013)*
🔻భారత్‌లో నిర్మించిన మొదటి విమాన వాహక నౌక. 2013 లో దీన్ని నిర్మించారు.ఇది తేలిక పాటి విమాన వాహక నౌక.

*🔹ఐ.ఎన్.ఎస్ చక్ర  ~అణు జలాంతర్గామి*

*🔹 ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌-నూక్లియర్‌ సబ్‌మెరైన్‌*

🔻నూక్లియర్‌ మిస్సైల్స్‌ను ప్రయోగించే సబ్‌మెరైన్ల కోసం ఇక్కడ సముద్ర గర్భంలో అధునాతనబెర్తులురూపుదిద్దుకుంటున్నాయి.
విశాఖపట్నం కేంద్రంగా స్వదేశీ పరిజ్ఞానంతో తొలి నూక్లియర్‌ సబ్‌మెరైన్‌ నిర్మాణం జరుగుతోంది. దీని పేరు అరిహంత్‌.

🔻సముద్రంపైన, భూమిపైన యుద్ధం చేయగల ఐఎన్‌ఎస్‌ జలాశ్వతో పాటు అణుఇంధనంతో పనిచేసే సబ్‌మెరైన్‌ ఐఎన్‌ఎస్‌ చక్ర ఇక్కడి నుంచే సేవలు అందిస్తోంది.

*🔻చైనా వద్ద 56 సబ్‌మెరైన్లు ఉండగా మన దగ్గర 14 మాత్ర మే వున్నాయి. చైనా ఇప్పటికే ఐదు న్యూక్లియర్‌ సబ్‌మెరైన్లను సమకూర్చుకోగా మనం తొలి న్యూక్లియర్‌ జలాంతర్గామి (అరిహంత్‌) నిర్మాణంలో ఉన్నాం.
సే:సురేష్ కట్టా(సోషల్ టీచర్)
          

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section