నేడు జాతీయ బాలికా దినోత్సవం..
✍సురేష్ కట్టా (సోషల్ టీచర్-నెల్లూరు)
~~ఆడపిల్ల దేశానికి గర్వకారణం~~
🔻ఒకప్పుడు ఆడపిల్ల పుడితే మహలక్ష్మి పుట్టిందని ఆనందించే వారు. కాని మనసులో ఏదో తెలియని బాధ .. ఆ క్షణమే అయ్యో ఆడపిల్ల పుట్టిందా అనే నిట్టూర్పు.. నేటి కాలంలో ఆడపిల్ల పుట్టకముందు నుండే వివక్ష చూపుతున్నారు. పుట్టాక అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారు...
*🔻ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ‘నేషనల్ గర్ల్స్ డెవలప్ మెంట్ మిషన్‘ పేరుతో గతంలో ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టిసారించింది.*
*🔻అందులో భాగంగానే స్త్రీ, శిశు సంక్షేమ శాఖ 2008 నుండి భారత జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. సమాజంలో బాలికల సంరక్షణ పట్ల అవగాహన కల్పించ డానికి ,బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్యా, సామాజికంగా ఎదుగుదల అంశాలపై అవగాహన కల్పించడానికి 2008సంవత్సరం నుంచి ప్రభుత్వం జాతీయ బాలికల దినోత్సవం జరుపుతోంది.*
*🔻ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మారాక నూతన మోడీ ప్రభుత్వం కుడా ఈ విషయంపై పూర్తి బాధ్యత తీసుకుంది. అందులో భాగంగానే "బేటి బచావో బేటి పడావో "పధకాన్ని ప్రవేశపెట్టారు.*
🔻భ్రూణ హత్యలు… తల్లిగర్భంలో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలిస్తేనే ఆ ఆడశిశువును అంతమొందిస్తున్నారు. ఆ అంతరాన్ని దాటి కళ్లు తెరిచి భూమ్మీదకి వచ్చినా ఆ అమ్మాయి అడుగడుగునా వివక్షకు గురి అవుతుంది. నేడు ఆడపిల్లల భ్రూణహత్యలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా తాజా జనగణన లెక్కల్లోనూ స్త్రీ, పురుష నిష్పత్తిలో అనూహ్య మైన తేడా కనిపిస్తోంది.2011జనాభా లెక్కల ప్రకారం.. ప్రతి వెయ్యిమంది పురుషులకు 940మంది మాత్రమే మహిళలున్నట్లు తేలింది. అలాగే,6 సంవత్సరాల లోపు ఆడపిల్లలైతే ప్రతి 1000 మంది మగ పిల్లలకు 914 మంది మాత్రమే ఉన్నారు. ఇది ఆందోళన కలిగించే విషయమే.
🔻గత దశాబ్ద కాలంలో సుమారు 30 లక్షల మంది బాలికలు అదృశ్యమయ్యారు. దీంతో బాలబాలికల లింగనిష్పత్తిలో వ్యత్యాసం అధికమవుతోందని, మొత్తం జనాభాలో బాలికల సంఖ్య తగ్గిందని కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన ‘చిల్డ్రన్ ఇన్ ఇండియా - ఏ స్టాటిస్టికల్ అప్రైజల్’ నివేదిక తెలిపింది.
*మహిళా సంరక్షణ కొరకు చేపట్టిన వివిధ ప్రభుత్వ పధకాలు:*
• ధన్ లక్ష్మీ పథకం - భారతదేశం ప్రభుత్వం (కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ)
• బంగారు తల్లి-ఆంధ్ర ప్రదేశ్
• భాగ్యలక్ష్మి పథకం - కర్నాటక
• లాడ్లీ లక్ష్మీ యోజన - మధ్యప్రదేశ్
• లాడ్లీ పథకం - ఢిల్లీ, హర్యానా
• రాజలక్ష్మి పథకం - రాజస్థాన్
• బాలికా సమృద్ధి యోజన (BSY) - గుజరాత్
• బేటీ హై అన్మోల్ పథకం - హిమాచల్ ప్రదేశ్
• రక్షక్ యోజన - పంజాబ్
• ముఖ్యమంత్రి కన్యా సురక్ష యోజన - బీహార్
• ముఖ్యమంత్రి కన్యా వివాహ్ పథకం - బీహార్
• కున్వర్ బైను మమేరు పథకం - గుజరాత్
• ఇందిరా మహాత్మా గాంధీ బాలికా సురక్ష యోజన - హిమాచల్ ప్రదేశ్
• ముఖ్యమంత్రి కన్యాదాన యోజన – మధ్య ప్రదేశ్
ఇలా అనేక పధకాలు ప్రవేశపెట్టి బాలికలకు తోడ్పాటును అందించినా..మంచి మార్పు కావాలంటే మాత్రం తల్లిదండ్రులు,సమాజ సహకారాలు కూడా తప్పక అవసరం.
*కారణాలు:*
*💁🏻సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా..*
🔻బాలికలైతే భారమని, మగపిల్లలైతే లాభమన్న భావన కారణంగానే తల్లిదండ్రులు ఆడశిశువులంటేనే అయిష్టత చూపుతున్నా రు. ఈ కారణంతోనే కొందరు లింగ నిర్ధారణ పరీక్షలకు, మరికొందరైతే భ్రూణహత్యలకు సైతం తెగిస్తున్నారు.
*👩🏻చదువులోనూ తప్పని వివక్ష…*
🔻ఆడపిల్లలకు అందించే విద్యావకాశాలు కూడా దయనీయంగా ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ భారతంలో ఆడపిల్లల చదువులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. మగపిల్లలతో వారిని పాఠశాలల్లో చేర్పించినా, కుటుంబ ఆర్థిక అవసరాల కోసమో, ఇతర బాధ్యతలు నెరవేర్చడం కోసమో ఆడపిల్లలను చదువుకు దూరం చేస్తున్నారు. ఉన్నత విద్యావకాశాలు అందుకుంటున్న మహిళలు కూడా నూటికి 10 నుండి 30 శాతం మాత్రమే ఉండడం ఇందుకు సాక్ష్యం.
*🙅🏻పోషకాహార లోపం…*
🔻నేటికీ ఆడపిల్లలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్య పోషకాహార లోపం. కుటుంబ ఆర్థిక సమస్యలతో ఏదో ఒక పనిచేసి కడుపునింపుకోవాల్సిన దుస్థితి వస్తోంది. ఉన్న ఊర్లో పనులు దొరకక వలసలు పోతున్న ఆడపిల్లలు, అక్కడా రక్షణ లేక లైంగిక దాడుల బారిన పడుతున్నారు. కనిపించకుండా పోతున్న వారి సంఖ్య వందల సంఖ్యల్లో ఉంది. సామాజిక, ఆర్థిక పరిస్థితిల్లో వచ్చిన మార్పుల ఫలితంగా బాలికలంటే కేవలం కట్నం తెచ్చే యంత్రంగానే పరిగణిస్తున్నారు. దాంతో ఆడపిల్లల పెళ్లిళ్లు భారంగా మారాయి. దీంతో పేద తల్లిదండ్రులు తప్పని పరిస్థితుల్లో మైనార్టీ తీరకుండానే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. దాంతో వారు అతి చిన్న వయస్సులోనే మాతృమూర్తులుగా మారుతున్నారు. ఫలితంగా భవిష్యత్తులో అనేకరకాల ఆరోగ్యసమస్యల బారిన పడుతున్నారు.
*🙇🏻♀భద్రత కరువు..*
🔻బాలికలు విద్యాసంస్థల్లో చదువు కొనసాగిస్తున్న వారికి భద్రత కరువయింది. పసి బాలికలపై కూడా పైశాచిక దాడులు జరుగుతున్నాయి. ప్రైవేటు రంగాల్లో పని చేసే మహిళల పని వేళలు ఎక్కువగా రాత్రివేళల్లో ఉంటుండడం గమనార్హం. అలాంటి సమయా ల్లో తమ గమ్యస్థానాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోందని, రాత్రి సమయాల్లో బస్టాండుల్లో, రైల్వేస్టేషన్లలో ఆకతాయిల నుంచి తప్పించుకోవడం కష్టం గా మారుతోందని బాలికలు ,యువతులు తెలిపారు. ఆకాశంలో సగంగా పిలిచే మహిళల పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.
*💁🏻బాలికల భవిష్యత్ ఆందోళనకరం…*
🔻ఆడపిల్లల్లో నిరక్ష్యరాస్యత, పౌష్టికాహార లేమి, ఆడపిల్లల అక్రమ రవాణాతో దేశ భవిష్యత్ అంధకారమవుతోంది. సమాజ ప్రగతి తిరోగమిస్తుంది. అందుకే బాలికల విద్య, ఆరోగ్యం, పోషకాహారం, బాల్యవివాహాల నియంత్రణ, అక్రమ రవాణా వంటి విషయాలపై అవగాహన కల్పించేందుకు బాలికా దినోత్సవం పేరుతో ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు కృషి చేస్తున్నాయి.
*👸🏻ఆడపిల్ల పుడితే ఆడపిల్ల కాదు... పాడు పిల్ల అనే అవగాహన నుంచి బయటపడితే మహిళల మీద జరుగుతున్న హింసకు అడ్డుకట్ట పడుతుందని ఆశిద్దాం..*
..🕊సురేష్ కట్టా [సోషల్ టీచర్-నెల్లూరు]
🌸🙋🌸