సి.డి.దేశ్‌ముఖ్ (జనవరి 14, 1896 - అక్టోబరు 2, 1982) పూర్తి పేరు చింతామణి ద్వారకానాథ్ దేశ్‌ముఖ్ (Chintaman Dwarakanath Deshmukh). వీరు భారతీయ రిజర్వ్ బాంక్ మూడవ గవర్నర్ మరియు స్వతంత్ర భారత దేశపు తొలి రిజర్వ్ బాంక్ గవర్నర్. ఇతడు 1943, ఆగష్టు 11 నుంచి 1949, జూన్ 30 వరకు ఈ పదవిని నిర్వహించాడు. ఆ తర్వాత దేశ్‌మూఖ్ భారత దేశానికి ఆర్థిక మంత్రిగా నియమితులైనాడు.
జననం
1896, జనవరి 14 న జన్మించాడు. 1920లో రోసినా ఆర్థర్ విల్కాక్స్ అనే ఆంగ్ల వనితను వివాహమాడాడు. 1949లో తొలి భార్య మరణించింది. వీరి కుమార్తె ప్రిమ్‌రోజ్ ఇంగ్లాండులో నివసిస్తుంది. ఆ తరువాత 1953లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలైన దుర్గాబాయి దేశ్‌ముఖ్ను వివాహం చేసుకున్నాడు.
ఇండియన్ సివిల్ సర్వీస్ సభ్యుడైన దేశ్‌ముఖ్ కు 1939 నుంచే రిజర్వ్ బ్యాంక్ తో సంబంధం ఉంది. 1941లో రిజర్వ్ బ్యాంక్ డిప్యూటి గవర్నర్ గా నియమించబడ్డాడు. August, 1943. ఆ తర్వాత జేమ్స్ టేలర్ నుంచి 3 వ గవర్నర్ గా బాధ్యతలు పొందినాడు. దేశ్‌ముఖ్ గవర్నర్ గా ఉన్న సమయంలో ప్రపంచంలో ముఖ్యమైన ఆర్థిక పరిణామాలు సంభవించాయి. జూలై 1944లో జరిగిన బ్రెట్టన్ వుడ్స్ సమావేశంలో అతడు కూడా భారత దేశం తరఫునన పాల్గొన్నాడు. ఈ సమావేశమే అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (International Monetary Fund-IMF) మరియు ప్రపంచ బ్యాంకు (International Bank for Reconstruction and Development-IBRD) ఏర్పడడానికి కారణమైంది. ఈ రెండు సంస్థల లోనూ దేశ్‌ముఖ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ గా పదేళ్ళ పాటు పనిచేశాడు. 1950లో పారిస్లో జరిగిన ఈ రెండు సంస్థల వార్షిక సంయుక్త సమావేశంలో ఇతడు చైర్మెన్ గా వ్యవహరించాడు.
అవార్డులు
1952లో దేశ్‌ముఖ్ విద్యనభ్యసించిన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయపు జేసస్ కళాశాల నుంచి గౌరవ ఫెలోగా ఎన్నికయ్యడు.
1959లో ప్రభుత్వ సర్వీసు రంగంలో రామన్ మెగ్సేసే అవార్డును పిలిప్పీన్స్కు చెందిన జోస్ అగ్విలార్ తో కల్సి సంయుక్తంగా పొందినాడు.
1975లో భారత ప్రభుత్వం చే పద్మ విభూషణ పురస్కారం పొందినాడు.
మరణం
1982, అక్టోబరు 2న మరణించారు.