Type Here to Get Search Results !

Vinays Info

ఫాదర్‌ ఆఫ్‌ జెనెటిక్స్‌'గా కీర్తి పొందిన..."గ్రెగర్ జాన్ మెండెల్ "వర్దంతి నేడు.


*'ఫాదర్‌ ఆఫ్‌ జెనెటిక్స్‌'గా కీర్తి పొందిన...*
*"గ్రెగర్ జాన్ మెండెల్ "వర్దంతి* *నేడు.
సే. సురేష్ కట్టా

*🌾ఈయన ఆస్ట్రియా సన్యాసి, వృక్షశాస్త్రజ్ఞుడు. 'లాస్ ఆఫ్ హెరెడిటీ' జీవుల అనువంశికత సూత్రాలు కనుగొన్నాడు.*

*🌾ఆయన చేసిన పరిశోధన ను ఆయన జీవించి ఉండగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆయన కనుగొన్నసూత్రాలు ఆయన మరణానంతరం ఓ కొత్త శాస్త్రం ఆవిర్భావానికి నాందిగా నిలిచాయి.*

*🌾వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలపై ప్రయోగాలు చేసి తర్వాతి కాలంలో 'ఫాదర్‌ ఆఫ్‌ జెనెటిక్స్‌'గా కీర్తి పొందిన ఆ శాస్త్రవేత్తే జోహన్‌ గ్రెగర్‌ మెండెల్‌.అప్పటి ఆస్ట్రియాలోని మొరావియాలో ఓ రైతు కుటుం బంలో పుట్టిన జోహన్‌ గ్రెగర్‌ బాల్యమంతా తండ్రి వెంట పొలాల్లో గడిచింది. తోటలు, తేనెటీగల పెంపకంలో చురుగ్గా ఉండే అతడికి ప్రకృతి అధ్యయ నం, సునిశిత పరిశీలన సహజం గానే అలవడ్డాయి. హైస్కూలు కోసం పట్నానికి వెళ్లినా తండ్రికి జరిగిన ప్రమాదం వల్ల తిరిగి రావడంతో చదువుకు ఆటంకం ఏర్పడింది. ఆపై ఉపాధ్యాయుడి సలహాపై క్రైస్తవ సన్యాసిగా మారడానికి నిర్ణయించుకుని మఠంలో చేరాడు. ఆ విధంగా 21వ ఏటనే 'గ్రిగర్‌' పేరును స్వీకరించి మఠాధిపతిగా మారాడు.*

*🌾సైన్స్‌ పట్ల అభిరుచితో ఎన్నోపుస్తకాలు చదివేవాడు.  మఠంలోని తోటలో బఠానీ మొక్కలపై ఉత్సుకతతో ఆయన చేసిన పరిశోధన ఫలితాలే వంశపారంపర్య సిద్ధాంతా నికి  మూలసూత్రాలుగా తర్వాతి కాలంలో పేరొందాయి. ఈ మొక్కల్లో పొడుగు, పొట్టి రకాలకు అంట్లు కట్టి, వాటిని కొన్ని తరాల పాటు పెంచి, ఏ తరానికి ఆ తరం వాటి లక్షణాలను నమోదు చేసుకుంటూ తన పరిశీలనలను సూత్రీకరించ గలిగాడు.*

*🌾దాదాపు 30,000 మొక్కలపై ఆయన జరిపిన ప్రయోగాలే మెండల్‌ నియంత్రణ నియమం , ఖండీకరణ నియమం గా పేరొందాయి.*

*🌳పరిశోధనలు:🐉*
    〰〰〰〰〰
*ఆయన పరిశోధనలు, ప్రయోగాలు చాలా సామాన్యంగా ఉంటాయి. కాని వీటిద్వారా వచ్చిన ఫలితాలను ఆధారంగా చేసుకుని ఈయన వెలువరించిన పరికల్పనలు మాత్రం చాలా గొప్పవి. బఠానీ మొక్కలను ప్రాయోగిక సామాగ్రిగా ఈయన స్వీకరించాడు. పొడుగు రకం, పొట్టిరకం, మధ్య సంకరం జరిపించాడు. మొదటి తరంలో అన్నీ పొడుగు మొక్కలే వచ్చాయి. మాతృతరానికి, మొదటి తరానికి మధ్య మళ్లీ సంకరం జరిపించాడు. రెండవ తరంలో పొడుగు, పొట్టి మొక్కల నిష్పత్తి 3:1 లో వచ్చింది. పొడుగును నిర్దేశించిన కారకం ప్రభావాన్ని ఎక్కువగా చూపుతుంది. పొట్టిని నిర్దేశించే కారకం ఉన్నప్పటికీ పొడుగును నిర్దేశించిన కారకానిదే పై చేయి అని తెలిసింది.*

*అలాగే మెండల్ రెండు లక్షణా లను, గుండ్రని విత్తనాలు, పసుపు రంగు ఒక రకం  మొక్క లో, ముడతలు పడ్డ విత్తనాలు, ఆకుపచ్చ రంగు ఇంకో మొక్కలో ఎన్నుకుని రెండు తరాల వరకు పరిశోధించాడు. మొదటితరం లో ప్రభావ కారకాలదే పై చేయి అయింది. అంటే అన్ని మొక్కల కూ గుండ్రని విత్తనాలు, పసుపు రంగే ఉంది. కాగా ఈ తరాన్ని, మాతృతరంతో సంకరం చెందించగా రూపొందిన రెండవ తరం నిష్పత్తి 9:3:3:1 లో ఉంది. గుండ్రని పసుపు పచ్చని విత్తనా లవి తొమ్మిది మొక్కలైతే, గుండ్రని ఆకుపచ్చ విత్తనాలవి మూడు మొక్కలైతే, ముడతలు పడ్డ పసుపుపచ్చ విత్తనాలు మూడు మొక్కలైతే, ముడతలు పడ్డ ఆకుపచ్చ విత్తనాలు గలది ఒకమొక్క రూపొందింది. ఈ నిష్పత్తుల ఆధారంగా మెండల్ కొన్ని పరికల్పనలు వెల్లడించాడు.*

*🍒అభివ్యక్తీకరణ ప్రభావ సిద్ధాంతం:* 
(లా ఆఫ్ డామినెన్స్)  
〰〰〰〰〰〰〰
*🌾ఒక లక్షణాన్ని నిర్దేశించే కారకాలు రెండు ఉంటాయి. ఉదాహరణకు పొడుగు, పొట్టి అనుకుందాము. పొడుగును నిర్దేశించే కారకాలు రెండు, పొట్టిని నిర్దేశించే కారకాలు రెండు ఉంటాయి. అందులో పొడుగు లక్షణానికి అభివ్యక్తీ కరించే ప్రభావం ఎక్కువ. కాబట్టి పొడుగు కారకం ఒకటి పొట్టి కారకం ఒకటి జతగా యేర్పడితే పొడుగుకే ప్రభావం ఎక్కువ. పొట్టి లక్షణం బయట పడాలంటే రెండు కారకాలూ పొట్టిని సూచించేవి అయి ఉండాలి. అదే అభివ్యక్తీకరణ ప్రభావ సిద్ధాంతంలోని ప్రధానాంశం.*

*🌿విశిష్ట ప్రతిపత్తి సిద్ధాంతం:*
    (లా ఆఫ్ సెగ్రెగేషన్)
〰〰〰〰〰〰〰〰
*జతగా ఏర్పడిన కారకాలు రెండూ ఒకే లక్షణాన్ని నిర్దేశించేవి అయితే పేచీయే లేదు. అలాకాక రెండు కారకాలూ రెండు వేరు వేరు లక్షణాలను నిర్దేశించేవి అయితే ఆ రెండింటి లో ఒక లక్షణం బహిర్గతమైనప్పటికీ ఆ రెండో కారకం తన లక్షణాన్ని కోల్పోదు. అంటే కారకాల లక్షణాలు విశిష్టంగా ఉంటాయే కాని ఎప్పటికీ కలవవు. వేటి ప్రతిపత్తిని అవే నిలుపుకుంటాయి.*

*స్వయం ప్రతిపత్తి సిద్ధాంతం:*
(లా ఆఫ్ ఇండెపెండెంట్ అసార్ట్ మెంట్)
〰〰〰〰〰〰〰〰
*విశిష్ట లక్షణాలను ప్రదర్శించే కారకాలు స్వయం ప్రతిపత్తిని కూడా కలిగి ఉంటాయి. కారకం విశిష్టంగా ప్రవర్తించడంలో ఏదీ అడ్దు రాదు. మూడు, నాలుగు లక్షణాలను ప్రదర్శించే కారకాలు కలసినప్పుడు కూడా వేటికవే స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటాయి.*

*🍒జన్యువులు:🍇*
〰〰〰〰〰〰
*🌾ఈ కారకాలను ఇప్పుడు జన్యువులుగా గుర్తిస్తున్నారు. 1865 లోనే మెండల్ యీ ప్రతిపాదనలు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. ఈయన జనవరి 6,1884 న ఒక గొప్ప శాస్త్రజ్ఞుడనే విషయం లోకానికి తెలియకుండానే మరణించాడు. 1900 ప్రాంతం లో మెండల్ ప్రతిపాదలలు సరైనవే నని ఎంతో మంది ధృవీకరించారు.*

*🌾జన్యుశాస్త్రం  వివిధ ప్రయోగాలతో కూడిన, జీవులకు సంబంధించిన ఆధునిక శాస్త్రం. జెనెటిక్స్ , జీవశాస్త్రంలో ఒక ముఖ్యమైన విభాగం. ఇది జీవుల అనువంశికత కు సంబంధించిన శాస్త్ర విజ్ఞానం.*

*🌾20వ శతాబ్దం వరకు తల్లి దండ్రులు పిల్లల్లో కనిపించే తమ లక్షణాలకు తమ రక్తమే కారణ మని భావించేవారు. కానీ తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు సంక్రమించడాన్ని అనువంశికత అంటారని, దానికి కారణం జన్యువులనీ ప్రముఖ శాస్త్రవేత్త గ్రెగర్ జాన్ మెండల్ తెలిపాడు. జన్యువులు డి.ఎన్.ఎ.  నిర్మాణంలోని నిర్ధిష్ట ప్రదేశాలు. ఇవి క్రోమోజోములలో ఉంటాయి.*

*🌾మనుషుల్లో తరతరాల్లో కనిపించే పోలికలు, లక్షణాలు ఎలా సంక్రమించే అవకాశం ఉందనే విషయాలను కూడా ఈ సూత్రాలు విశదీకరించగలిగా యి.దాదాపు 30 ఏళ్ల తర్వాత వంశపారంపర్యతపై పరిశోధన లు చేసిన కొందరు శాస్త్రవేత్తలు, జోహన్‌ సూత్రాలను చదివితే కానీ తాము పొందిన ఫలితాల ను అర్థం చేసుకోలేకపోయారంటే ఇవెంత ప్రాముఖ్యతను పొందా యో తెలుస్తుంది.
సే : వినయ్స్ ఇన్ఫో

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section