🔣💡➖➖➖➖➖➖➖➖➖
*'నంబర్ థియరీ'లో ఎన్నో సూత్రాలను.. సూత్రీకరించిన 'దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్' జయంతి నేడే..*✍సురేష్ కట్టా 🕴
➖➖➖➖➖➖➖➖➖💡🔣
*🔸దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్ ప్రసిద్ధ భారతీయ గణితశాస్త్రజ్ఞుడు. 'సంఖ్యా శాస్త్రము'(Number Theory) లో అనేక ఆసక్తికరమైన ధర్మాలను కనుగొన్నాడు.*
*👶🏻బాల్యం మరియు విద్యాభ్యాసం..*📚
〰〰〰〰〰〰〰〰〰
*🔻కప్రేకర్ జనవరి 17,1905న, బొంబాయిలో జన్మించాడు. చిన్నవయసులోనే తల్లిని కోల్పోయాడు. కాబట్టి బాల్యమం తా తండ్రి పెంపకంలోనే పెరిగాడు. విద్యార్థి దశలోనే లెక్కలలో సులభ గణనలు, పజిల్స్ ను సాధన చేయడంలో కుతూహలం ప్రదర్శించే వాడు.*
*🔻మహారాష్ట్ర లోని పూనాలో ఫెర్గూసన్ కళాశాల ద్వారా బి.యస్సీ పూర్తి చేశాడు. 1927 లో చదివేటప్పుడే ఆయన రాసిన "థియరీ ఆఫ్ ఎన్వలప్స్ "అనే వ్యాసానికి గాను రాంగ్లర్ RP పరంజపే గణిత బహుమతి లభించింది.*
🔻అతను ముంబై విశ్వవిద్యాలయం నుండి 1929 లో తన బ్యాచులర్స్ డిగ్రీని అందుకున్నాడు. ఆయన పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీని తన కెరీర్ లో (1930-1962) తీసుకోలేదు.
🔻ఈయన మహారాష్ట్ర లోని నాసిక్ వద్ద పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఈయన ప్రత్యేక లక్షణాలతో పునరావృత దశాంశాలు, మేజిక్ స్క్వేర్స్ మరియు పూర్ణాంకాల ధర్మాలను ఆవిష్కరించి ప్రచురించాడు.
🍥 *ఉపాధ్యాయ వృత్తి....🕴*
〰〰〰〰〰〰〰〰〰
🔻బి.యస్సీ పూర్తి అయిన తర్వాత దేవ్‌లాలీలో ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. ఉపాధ్యాయుడిగా ఉంటూనే తన పరిశోధన లు కొనసాగించాడు. గణిత సమాజం వార్షికోత్సవంలో ప్రతిసారీ తాను కనుగొన్న కొత్త కొత్త సభ్యుల సమక్షంలో ప్రదర్శించేవాడు. సంఖ్యల మధ్య సంబంధాలు, వాని విచిత్ర లక్షణాలు, మొదలైన కొత్త కొత్త విషయాలను ఆవిష్కరించే వాడు. డెమ్లో నంబర్లపై ఆయన చేసిన పరిశోధనకుగాను, బాంబే విశ్వవిద్యాలయం వారు మూడేళ్ళ పాటు ఆర్థికసహాయంఅందించారు.
*🔻రిక్రేయషనల్ మ్యాథ్స్ గురించి ఆయన రాసిన అనేక వ్యాసాలు, స్క్రిప్టా మ్యాథమేటిక్స్, అమెరికన్ మ్యాథమేటిక్స్ లాంటి విదేశీ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.*
*🔻ఆయన ఇంటి ప్రవేశ ద్వారానికి కూడా గణితానంద మండలి అని పేరు పెట్టడం గణితంపై ఆయనకున్న అభిమానానికి నిదర్శనం.*
*🔻మార్టిన్ గార్డినర్ అనే పాత్రికేయుడి ద్వారా తాను కనుగొన్న సెల్ఫ్ నంబర్స్, కప్రేకర్ స్థిరాంకం (6174), జనరేటెడ్ నంబర్లు జగద్విదితమయ్యా యి.*
*🔻తన పరిశోధనల ద్వారా విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించుకున్న కప్రేకర్ భారత ప్రభుత్వం యొక్క ప్రోత్సాహానికి మాత్రం నోచుకోలేదు.*
*🔻చివరి దాకా ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగిన కప్రేకర్ జూలై 4, 1986 న కన్నుమూశాడు.*
(జనవరి17,1905—జూలై4,1986)
..✍సే:సురేష్ కట్టా[సోషల్ టీచర్-నెల్లూరు]
🌸🌸🙏🌸🌸