Type Here to Get Search Results !

Vinays Info

మౌలానా అబుల్ కలాం ఆజాద్ : Moulana Abul Kalam Azad

మౌలానా అబుల్ కలాం ఆజాద్ (నవంబర్ 11, 1888 — ఫిబ్రవరి 22, 1958) (బెంగాళీ: আবুল কালাম মুহিয়ুদ্দিন আহমেদ আজাদ, ఉర్దూ: ابو الکلام آزاد ) ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి, మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆయన అసలుపేరు 'మొహియుద్దీన్ అహ్మద్', 'అబుల్ కలాం' అనేది బిరుదు, 'ఆజాద్' కలంపేరు. ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ లకు 1888 నవంబరు 11 న మక్కాలో జన్మించాడు.

🔹ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాలపాటు జైలుశిక్ష అనుభవించాడు.
🔹భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసాడు. 1958 ఫిబ్రవరి 22 న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మరణించాడు.

👉గౌరవాలు, బిరుదులు

🔹గాంధీజీ ఇతడిని భారత ప్లాటో అని, గాంధీ మరియు నెహ్రూ ఇతడిని మౌలానా, మీర్-ఎ-కారవాన్‌ అని పిలిచేవాడు.
🔹1992లో భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించింది.
🔹ఇతడి జన్మదినమైన నవంబరు 11 ను జాతీయ విద్యా దినోత్సవం గా జరుపుకుంటారు.

🔹సాహిత్యం

తర్జుమానుల్ ఖురాన్ (ఖురాన్ అనువాదం)
"అల్-హిలాల్" మరియు "అల్-బలాగ్" అనే పత్రికలు స్థాపించాడు.
గుబార్-ఎ-ఖాతిర్
ఇండియా విన్స్ ఫ్రీడమ్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section