➖➖➖➖➖➖➖➖
ప్రపంచ సహన దినోత్సవం
➖➖➖➖➖➖➖
🔻సహనము,ఓర్పు మనిషికి సహజ లక్షణము . మనుషుల మధ్య ఎన్నో తేడాలుంటాయి ... లావు , పోడుగు , చర్మపు రంగు , జుట్టువంటి తేడాలు అంగీకరించినట్లే భిన్న ఆలోచనా విధానాలను సహజమైనవిగా అంగీకరించాలి. తన ఆలోచనా విధానానికి అందరూ బద్దులై వుండాలన్న నియంతృత్వ పోకడ ఎంతమాత్ర ము సరైనది కాదు . ఆ ధోరణి ప్రదర్శించే వారంతా తమ సహజ సహన గుణం కోల్పోయి , అసహము లో కొట్టుమిట్టాడి , అసహనం నుండి పుట్టుకు వచ్చే విధ్వంసపు ఆలోచనలతో తోటి వారికి , మొత్తం మానవాళికి నస్టము కలిగిస్తూ ఉన్నారు .
🔻శాంతియుత సహజీవనము ఉన్నప్పుడు సరైన లక్ష్యము దిశగా వెళ్తున్నట్టే లెక్క . . ఆ దిశ బాగున్నప్పుడు ప్రపంచాభివృద్ధి బాగుం టుంది . ఇటువంటి భావనలున్నప్పుడు తోటివారి పట్ల ఈర్శాద్వేషాలుండవు . దయా గుణము ఉంటుంది .
🔻సహనమంటే అవతలి వారిని నిర్లక్ష్యం చేయుట లేదా బలవంతము గా భరించటం కాకూడదు . అవతలివారిని అర్ధముచేసుకుని గౌరవించగలిగిన సహనం కావాలి .
🔻 ప్రపంచము లో లోపిస్తున్న ఈ " సహనము" మీద దృస్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి 1995 వ సంవత్సరాన్ని " ఇయర్ ఆఫ్ టాలరెన్స్ " గా జరపాలని తీర్మానించింది .
🔻ఆ సంవత్సరము నవంబరు 16 న సమావేశమైన యునెస్కో దేశాలు సహన సూత్రాలతోకూడిన ఒక సమగ్రమైన ప్రకటనను జారీ చేసాయి . సహనం అవశ్యకతను గుర్తించాలన్న లక్ష్యము తో ప్రకటన విడుదలైనందున ప్రతి ఏటా ఆరోజునే ' ప్రపంచ సహన దినోత్సవం' గా జరపాలని నిర్ణయించారు .
🔻ఎప్పుడో వందల సంవత్సరాల నాటి చేదు జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ తరువాత తరమువారిలో అనవసర విద్వేషాలకు , ఆగ్రహాలకు కారణమయ్యే కంటే ఆ చేదు జ్ఞాపకాఅలకు స్వస్తిపలికి ప్రశాంతజీవనానికి దోహదపడడము మంచిది .
🔻గతాన్ని మనం మార్చివేయాలి . కుల , జాతి , మత , సంస్కృతి , దేశ గోడలని చేదించి ప్రపంచ శాంతి సౌభ్రాతృత్వానికి తోడ్పడాలి . పొరుగు వారు ఏదో మాట అన్నారని అనవసర రాద్ధాంతము చేయక సహనము తో మంచి చెడులను గురించి ఆలోచించాలి .
🔻మంచినే బోధించాలి.. మంచినే ఆచరించాలి.. ప్రపంచీకరణ ప్రజలను దగ్గరికి తెచ్చింది . ఒకరి గురించి మరొకరు తెలుసుకునే అవకాశ ము పెరిగించి . అతివేగముగా సమాచారము అందుతున్న నేపధ్యము లో బిన్నత్వం పై ఏకత్వం దిశగా ప్రపంచం పననిస్తుందేమోనన్న అనుమానము వస్తుంది కొందరికి . కనుకనే అందరూ సహనము తో (ఓర్పు తో) ప్రపంచ శాంతి కోసము పాటుపడాలి .
🔻చిన్న పెద్ద , పేదలు , ధనికులు, విద్యావంతులు నిరక్షరాస్యులు , ఉద్యోగులు , నిరుద్యోగులు ఎవరైనా సరే దయతో , కరుణతో చేసే చిన్న చిన్న చర్యలే కొండంత బలము నిచ్చేదిగా ముందుకు సాగాలి .