భారతరత్న పురస్కారాలు:-
భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారం భారతరత్న.ఈ అవార్డుని 1954 సంవత్సరంలో ప్రారంభించారు.ఈ అవార్డును జనవరి 26 న ప్రధానం చేస్తారు.ఈ అవార్డును కళలు,శాస్త్ర సాంకేతిక రంగం,ప్రజాసేవ,ప్రభుత్వ సేవా రంగాలలో కృషి చేసిన వ్యక్తులకు ప్రధానం చేస్తారు.
భారతరత్న అవార్డును 1977 సంవత్సరంలో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రద్దు చేసారు.ఈ అవార్డును తిరిగి 1980 సంవత్సరంలో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వం పునఃప్రారంభించింది.
ఈ అవార్డును సంవత్సరానికి గరిష్టంగా ముగ్గురికి ఇవ్వడం జరుగుతుంది.ఈ అవార్డును ఇప్పటి వరకు 45 మందికి ప్రధానం చేసారు.ఇప్పటి వరకు 5 గురు మహిళలకు భారతరత్న అవార్డు లభించింది.2011 లో భారతరత్న పరిధిని క్రీదారంగంతో సహా అన్ని రంగాలకు విస్తరించింది.
భారతరత్న,పద్మ అవార్డులు రాజ్యాంగంలో 18 వ అధికరణలో వివరించబడ్డాయి. భారతరత్న అవార్డుల ఎంపిక కమిటీకి చైర్మన్ - ఉపరాష్ట్రపతి
ముఖ్యాంశాలు :
👉భారతరత్న అవార్డు పొందిన మొట్ట మొదటి వ్యక్తీ - సి.రాజగోపాలాచారి(రాజాజీ).
👉భారతరత్న అవార్డు పొందిన మొట్ట మొదటి మహిళ - శ్రీమతి ఇందిరాగాంధీ.
👉భారతరత్న అవార్డును మరణానంతరం పొందిన మొట్ట మొదటి వ్యక్తీ - లాల్ బహదూర్ శాస్త్రి.
👉భారతరత్న అవార్డును మరణానంతరం పొందిన మొట్ట మొదటి మహిళ - అరుణా అసఫ్ అలీ.
👉భారతరత్న అవార్డు పొందిన మొట్ట మొదటి విదేశీయుడు - ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్.
👉భారతరత్న పొందిన మొట్ట మొదటి క్రీడాకారుడు - సచిన్ టెండూల్కర్(2013).
👉భారతరత్న పొందిన పిన్న వయస్కుడు - సచిన్ టెండూల్కర్(40 సంవత్సరాలకు).
👉భారతరత్న పొందిన మొదటి రాష్ట్రపతి - బాబు రాజేంద్రప్రసాద్(1961).
👉భారతరత్న పొందిన మొదటి ఉపరాష్ట్రపతి - ఎస్.రాధాకృష్ణన్(1954).
👉భారతరత్న పొందిన మొదటి ప్రధాని - జవహర్ లాల్ నెహ్రు(1955).
👉భారతరత్న పొందిన మొదటి మరియు ఏకైక సినిమా నటుడు - ఎం.జి